aadhi
-
శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో ఆది దంపతులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మీడియాతో మాట్లాడుతూ... కరోనా తరువాత శ్రీవారిని మొదటిసారి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తను నటించిన శశి చిత్రం ఈ నెల 19న రిలీజ్ అవబోతుందని, ట్రీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించినట్లే సినిమా కూడా హిట్ అవుతుందని ఆశీస్తున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ .. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు గెలవాలని శ్రీవారిని మొక్కుకున్నాని అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ సిటింగ్ ఎమ్మెల్సీ అనుభవపరుడని పేర్కొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థిని వాణీదేవి దివంగత మాజీ ప్రధాని పివీ నరసింహ రావు కూతురని గుర్తు చేశారు. వీరు ఇరువురు అత్యంత మెజారిటీతో గెలుపొందాలి అని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. -
'శశి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
శశి కథేంటి?
డిసెంబర్ 23 ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘శశి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్రబృందం. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు. ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. గుబురు గడ్డంతో కోపంతో అరుస్తున్న పోజులో ఉన్న ఫొటోను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఆది డిఫరెంట్‌గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: అమర్నాథ్ బొమ్మిరెడ్డి. -
కొత్త లవ్‌స్టోరీ
ఆది సాయికుమార్, సురభి జంటగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొంద నున్న సినిమా ప్రారంభోత్సవం రీసెంట్గా జరిగింది. పి.ఆర్. వర్మ సమర్పణలో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మించనున్నారు. ‘‘తొలిసారిగా ఆది, సురభి కలిసి నటించనున్నారు. లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుంది. రావు రామేష్, ప్రియా, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వారసుడొస్తున్నాడు..!
‘ఆది’ ఎవరు? అంటే మన తెలుగు ప్రేక్షకులు చిన్న ఎన్టీఆర్ పేరు చెబుతారు. ఇప్పుడు మలయాళ ‘ఆది’ రెడీ అవుతున్నాడు. ఆదిగా కనిపించనున్న ఈ మలయాళ హీరో ఎవరో కాదు.. మలయాళ స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ప్రణవ్‌కి హీరోగా ‘ఆది’ మొదటి సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే ఈ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ రిలీజ్ చేశారు. ప్రణవ్ హ్యాండ్సమ్గా ఉన్నాడని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని పోస్టర్ చూసినవారు అంటున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్న నమ్మకం ఉంది. ప్రణవ్ అద్భుతంగా నటిస్తున్నాడు’’ అని పేర్కొన్నారు జోసెఫ్. ఆల్రెడీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకెళుతున్నాడు. మలయాళంలో పేరు తెచ్చుకుని, ‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ భాషల్లోనూ మార్కులు కొట్టేశారు. ఇప్పుడు మోహన్‌లాల్ వారసుడు ప్రణవ్ వస్తున్నాడు. ఈ వారసుడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, తండ్రిలా తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తాడని ఊహించవచ్చు. -
కాన్సెప్ట్ సినిమాల కోసమే వి4 బ్యానర్
‘‘తమిళంలో కాన్సెప్ట్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తెలుగులో ఆ తరహా సినిమాలకు ఆదరణ ఉన్నా పెద్దగా రావడం లేదని ‘బన్నీ’ వాసు, నేను డిస్కస్ చేసుకున్నాం. తెలుగులో కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ‘వి4 క్రియేషన్స్’ సంస్థను స్టార్ట్ చేశాం! ‘నెక్ట్స్ నువ్వే’ విడుదలయ్యేలోపు కొత్త కథలున్నవారు మమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో చెబుతాం’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమ అక్షయ పాత్రలాంటిది. ఎవరొచ్చినా ఎంకరేజ్ చేస్తుంది. టైటిల్లోనే అసలు మజా, సక్సెస్ ఉంది. అల్లు అరవింద్‌గారు, జ్ఞానవేల్ రాజా, ‘బన్నీ’ వాసు, వంశీగారు కలిసి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఈ సంస్థను స్థాపించారు. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. అరవింద్, ‘బన్నీ’ వాసు, వంశీ, జ్ఞానవేల్ రాజా వంటి మంచి మనుషుల కారణంగా నాకు దర్శకునిగా చాన్స్ వచ్చింది. టైటిల్ క్రెడిట్ మాత్రం పరుశురాంగారిదే’’ అని ప్రభాకర్ అన్నారు. ‘‘రెండున్నరేళ్లు ముందుగానే ఈ సినిమా చేయాలనుకున్నాం. కానీ, కొన్ని కారణాలతో ఆగిపోయి మళ్లీ స్టార్ట్ అయింది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. నవంబరు 3న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని ‘బన్నీ’ వాసు చెప్పారు. నటుడు సాయికుమార్, ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, హీరో విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. -
ఓవియాతో కోలీవుడ్‌కు..
తమిళసినిమా: టాలీవుడ్ యువ నటుడు ఆది నటి ఓవియాతో కలిసి కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత విపరీతంగా పాపులారిటీని పెంచుకున్న నటి ఓవియా. ప్రస్తుతం ఈ జాణకు అవకాశాలు వరుస కడుతున్నాయి. అందులో ఒకటి కాటేరి. ఇంతకు ముందు యామిరుక్క భయమే వంటి హర్రర్ కామేడీ కథా చిత్ర దర్శకుడు డీకే తాజాగా ఈ కాటేరి దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు. ఈ చిత్రాన్ని స్డూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి ఆయన వివరిస్తూ కాటేరి ఎడ్వెం చర్ కామెడీ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హర్రర్ థ్రిల్లర్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువ నటుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఆది సీనియర్ నటుడు సాయికుమార్ కొడుకన్నది గమనార్హం. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరిగా నటి ఓవియాను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈయన ఇంతకు ముందు జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తొలి చిత్రం యామిరుక్క భయమే చిత్ర నేపథ్యం అయిన హర్రర్నే తన తాజా చిత్రానికి నమ్ముకున్నారనిపిస్తోంది. -
వెటకారమే నా సక్సెస్ కారణం
దర్శకుడు వీరభద్రమ్ కడియం : ‘‘వెటకారంతో కూడిన హాస్యమే తన సక్సెస్‌కు కారణమని, అదే తనను సినీ ఇండస్ట్రీలో నిలిపింది’’ అని అన్నారు ప్రముఖ సినీదర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. చుట్టాలబ్బాయ్ చిత్రం షూటింగ్ నిమిత్తం బుధవారం పల్లవెంకన్న నర్సరీకి వచ్చిన ఆయన షూటింగ్ విరామంలో ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ‘‘డిగ్రీ పూర్తయ్యాక ఎంసీఏ చేద్దామనిహైదారాబాద్ వచ్చిన నాకు ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నా సినీజీవితం మొదలైంది. ఈవీవీ, తేజలతోపాటు పలువురు సక్సెస్ఫుల్ డెరైక్టర్ల వద్ద కో డెరైక్టర్‌గా చేశాను. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ కావడంలో గోదావరి పరిసరప్రాంత ప్రజలు ముందుంటారు. అందుకే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా సినీ రంగంలో ఇక్కడి వారు బాగా రాణిస్తున్నారు. హాస్యనటుడు సునీల్‌ను సిక్స్‌ప్యాక్ బ్యాడీతో హీరోగా చూపించిన పూలరంగడు చిత్రాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కడియం నర్సరీ ప్రాంతంలో ప్లాన్ చేశాం. కానీ ఔట్ డోర్ షూటింగ్లో సునీల్ సిక్స్‌ప్యాక్ కసరత్తులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో స్టూడియోలో చేయాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. గోదావరివాసుల ఆదరణ నచ్చింది : ఆది ఉభయగోదావరి జిల్లా వాసుల ఆదరణ తనకెంతో నచ్చిందని యు వ హీరో ఆది అన్నారు. షూటింగ్ విరామంలో ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడారు. తన అత్తారిల్లు రాజమహేంద్రమైనా కడియం నర్సరీల్లోకి రావడం ఇదే మొదటిశారన్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో హీ రోగా నటించానని, అన్నింటికంటే భిన్నమైన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయవంతమవుతుందన్నారు. ఇక్కడి వారి ఆదరాభిమానాలు ఎన్నటి మరువలేనన్నారు. ఇక్కడే బాగుంది : నమిత మళయాళంలో పలువురు అగ్రహీరోల సరసన 18 సినిమాల్లో హీరోయిన్గా నటించానని హీరోయిన్ నమిత అన్నారు. తెలుగులో చుట్టాలబ్బాయ్ తన తొలి చిత్రమన్నారు. షూటింగ్లో భాగంగా అనేక ప్రాంతాలు చూశానని, అయితే వాటన్నికంటే కడియం నర్సరీలు బాగున్నాయన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే సినిరంగంలోకొచ్చిన తాను ప్రస్తుతం బీఏ లిటరేచర్ చేస్తున్నట్టు చెప్పారు. -
రాజుగారి కోడి పలావు
ఆ టేస్టే వేరు: ‘రాజుగారి కోడి పలావు కేరాఫ్ ఉలవచారు’... ఇదేమీ సినిమా టైటిల్ కాదు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-68లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్లో ఫేమస్ డిష్. హైదరాబాద్ బిర్యానీకి దీటుగా కొత్తగా తెరపైకి వచ్చిన రాజుగారి కోడి పలావు భోజనప్రియులకు చవులూరిస్తోంది. దీనిని పద్ధతిగా అరిటాకులో వడ్డించడం మరో ప్రత్యేకత.. సెలబ్రిటీల ఫేవరెట్... రాజుగారి కోడి పలావుకు పలువురు సెలబ్రిటీలు అభిమానులుగా మారారు. మణిరత్నం, లక్ష్మి మంచు, సమంతా, కోన వెంకట్, వెన్నెల కిశోర్, రానా, వీవీ వినాయక్ వంటి సినీ ప్రముఖులంతా రాజుగారి కోడి పలావు కోసమే ‘ఉలవచారు’ రెస్టారెంట్‌కు వస్తుంటారు. ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేయడానికి సిటీలో ఇది బెస్ట్ హ్యాంగౌట్ ప్లేస్ అని ఇక్కడకు వచ్చిన హీరో ఆది చెప్పారు. తాను ఇక్కడకు ఎప్పుడు వచ్చినా, స్టార్టర్‌గా బంగ్లా చికెన్ ఆర్డర్ చేస్తానని, బంగ్లా చికెన్‌తో మొదలయ్యే భోజనం, రాజుగారి కోడి పలావుతో ముగుస్తుందని అన్నారు. అంతా స్టీమ్తోనే... ‘ఇది పూర్తిగా స్టీమ్బేస్డ్ బిర్యానీ. చికెన్ తప్ప ఇందులో నూనెలేవీ వాడం. కాస్త నెయ్యి, కొద్దిగా మసాలా వాడతాం. ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి తప్ప మరేమీ వాడం’ అని ‘ఉలవచారు’ ఎండీ ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో కూడిన రాజుగారి కోడి పలావును ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు మాత్రమే తయారు చేస్తామని ఆయన తెలిపారు. దీనికి కాంబినేషన్‌గా గోంగూర గ్రేవీ, స్పైసీ చట్నీ, రైతా వడ్డిస్తామని, వాటితో పాటు కాంప్లిమెంటరీగా దద్దోజనం, చిప్స్ అందిస్తామని చెప్పారు. - సాక్షి, సిటీప్లస్ -
జోరుమీదున్న ఎన్టీఆర్
తారక్‌ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘ఆది’. ఆ సినిమాతో బెల్లంకొండ సురేష్ కూడా స్టార్ నిర్మాతఅయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుండటం విశేషం. ‘కందిరీగ’ లాంటి వినోదభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. తారక్‌ని ఎలా చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారో ఇందులో ఆయన పాత్ర చిత్రణ అలా ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ‘అత్తారింటికి దారేది’ లాంటి సంచలన విజయం సాధించిన చిత్రంలో నటించిన సమంత, ప్రణీత ఇందులో ఎన్టీఆర్‌తో జతకట్టడం మరో విశేషం. ఈ సినిమాకు ‘రభస’ అనే టైటిల్ మొన్నటిదాకా ప్రచారంలో ఉంది. అయితే... ఆ టైటిల్ కరెక్ట్ కాదని, చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు. ‘జోరు’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కావచ్చని సమాచారం.