శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు | Tollywood Hero Aadi Sai Kumar, Allu Arjun wife Visited Tirumala On Tuesday | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి

Published Tue, Mar 16 2021 9:45 AM | Last Updated on Tue, Mar 16 2021 11:08 AM

Tollywood Hero Aadi Sai Kumar, Allu Arjun wife Visited Tirumala On Tuesday - Sakshi

హీరో ఆది దంపతులు

సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది దంపతులు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మీడియాతో మాట్లాడుతూ... కరోనా తరువాత శ్రీవారిని మొదటిసారి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తను నటించిన శశి చిత్రం ఈ నెల 19న రిలీజ్ అవబోతుందని, ట్రీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించినట్లే సినిమా కూడా హిట్ అవుతుందని ఆశీస్తున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు.

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ .. ఇటీవల  జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు గెలవాలని శ్రీవారిని మొక్కుకున్నాని అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ సిటింగ్ ఎమ్మెల్సీ అనుభవపరుడని పేర్కొన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ అభ్యర్థిని వాణీదేవి దివంగత మాజీ ప్రధాని పివీ నరసింహ రావు కూతురని గుర్తు చేశారు. వీరు ఇరువురు అత్యంత మెజారిటీతో గెలుపొందాలి అని కోరుకుంటున్నాని పేర్కొన్నారు.

చదవండి: ఆస్కార్‌ నుంచి సూర్య సినిమా అవుట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement