ఆది సాయికుమార్, సురభి
ఆది సాయికుమార్, సురభి జంటగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొంద నున్న సినిమా ప్రారంభోత్సవం రీసెంట్‌గా జరిగింది. పి.ఆర్. వర్మ సమర్పణలో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మించనున్నారు. ‘‘తొలిసారిగా ఆది, సురభి కలిసి నటించనున్నారు. లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుంది. రావు రామేష్, ప్రియా, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment