ఓవియాతో కోలీవుడ్‌కు.. | Cattery Adventure is a comedy film. | Sakshi
Sakshi News home page

ఓవియాతో కోలీవుడ్‌కు..

Published Thu, Sep 28 2017 5:29 AM | Last Updated on Thu, Sep 28 2017 5:29 AM

Cattery Adventure is a comedy film.

తమిళసినిమా: టాలీవుడ్‌ యువ నటుడు ఆది నటి ఓవియాతో కలిసి కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో తరువాత విపరీతంగా పాపులారిటీని పెంచుకున్న నటి ఓవియా. ప్రస్తుతం ఈ జాణకు అవకాశాలు వరుస కడుతున్నాయి. అందులో ఒకటి కాటేరి. ఇంతకు ముందు యామిరుక్క భయమే వంటి హర్రర్‌ కామేడీ కథా చిత్ర దర్శకుడు డీకే తాజాగా ఈ కాటేరి దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు.

ఈ చిత్రాన్ని స్డూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి ఆయన వివరిస్తూ కాటేరి ఎడ్వెం చర్‌ కామెడీ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హర్రర్‌ థ్రిల్లర్‌ సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువ నటుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పారు.

ఆది సీనియర్‌ నటుడు సాయికుమార్‌ కొడుకన్నది గమనార్హం. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరిగా నటి ఓవియాను ఎంపిక చేసినట్లు చెప్పారు.  ఈయన ఇంతకు ముందు జీవా, కాజల్‌అగర్వాల్‌ జంటగా నటించిన కవలైవేండామ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తొలి చిత్రం యామిరుక్క భయమే చిత్ర నేపథ్యం అయిన హర్రర్‌నే తన తాజా చిత్రానికి నమ్ముకున్నారనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement