హర్భజన్ సింగ్‌,ఓవియా కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌ చూశారా..? | Harbhajan Singh And Oviya New Movie Savior Announced, Posters Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

హర్భజన్ సింగ్‌,ఓవియా కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌ చూశారా..?

Published Wed, Nov 6 2024 11:43 AM | Last Updated on Wed, Nov 6 2024 1:24 PM

Harbhajan Singh And Oviya New Movie Savior Announced

భారత క్రికెట్‌ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, నటి ఓవియా నటించిన తమిళ చిత్రం 'సేవియర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ తాజాగా విడుదల చేసింది. వెండితెరపై హర్భజన్ మరోసారి కనిపించనున్నడంతో ఆయన ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం విడుదలైన పోస్టర్స్‌ను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో నటి ఓవియా క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు జోడీగా నటిస్తోంది. వీటీవీ గణేష్, జీబీ ముత్తు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జాన్ పాల్ రాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెంటోవా స్టూడియో నిర్మిస్తుంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తల్లి వర్ణ పాత్రలో నటి ఓవియా, డాక్టర్ జేమ్స్ మల్హోత్రాగా  హర్భజన్ సింగ్ కనిపిస్తున్నారు. 

ఈ క్రమంలో జిబి ముత్తు, గణేశన్ పాత్రలను కూడా దర్శకుడు రివీల్‌ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రం పిల్లి-ఎలుక గేమ్‌ల సాగనుందని ప్రచారం జరుగుతుంది. ఒక రాత్రిలో జరిగే 12 హత్యల చుట్టూ సేవియర్‌ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఫ్రెండ్‌షిప్ సినిమా తర్వాత హర్భజన్, జాన్ పాల్ రాజ్‌ల కలయికలో ఇది రెండవ సినిమా కావడం విశేషం.

తాజాగా నటి ఓవియా పర్సనల్‌ వీడియో అంటూ ఒకటి నెట్టింట వైరల్‌ అయింది. బిగ్‌బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న  ఓవియా కొంత కాలం వరకు భారీగానే సినిమా ఛాన్సులతో బిజీగానే ఉండేది. ఆ తర్వాత పలు వివాదాల వల్ల అవకాశాలు తగ్గాయి. గత కొన్నాళ్లుగా సినిమా ఛాన్సులు లేకుండా ఉన్న ఓవియా ఇప్పుడు సేవియర్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement