![కుటుంబంలో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం](/styles/webp/s3/article_images/2017/09/4/51466196548_625x300.jpg.webp?itok=CJPnLEx3)
కుటుంబంలో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
పిల్లలను వదిలి ప్రేమికుడితో వెళ్లిన వివాహిత
ప్రియుడు హ్యాండివ్వడంతో తిరిగి భర్త చెంతకు
భర్త అంగీకరించకపోవడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్
మండ్య: పరపురుషుడి వ్యామోహంలో పడిన ఓ వివాహిత భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత సదరు ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. తనతో కాపురం చేయకపోతే డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే తనను వదిలి వెళ్లిన భార్యను స్వీకరించేది లేదని భర్త చెబుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. మహిళ రశ్మి అలియాస్ లక్ష్మి, ఆమె భర్త శశిలు తమ పిల్లలతో కలిసి మండ్యలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో రశ్మికి ఎదురింట్లో నివాసమున్న సాగర్‌కు పరిచమేర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో భర్తను వదిలి సాగర్‌తో వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. దీంతో భార్య,భర్తల మధ్య గొడవలు మొదలయ్యి శశి బంధువులు సాగర్‌కు దేహశుద్ధి చేయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసుల సమక్షంలోనే తనకు భర్త శశితో ఉండడం ఇష్టం లేదని సాగర్‌ను పెళ్లి చేసుకొని అతనితోనే జీవిస్తానని రశ్మి చెప్పడంతో శశి కూడా అంగాకరించాడు. ఇకపై రశ్మికి,తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం రశ్మి ప్రేమికుడు జరుగుతున్న పరిణామాలతో బెదిరిపోయి పారిపోయాడు. దీంతో రశ్మి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోవడంతో తిరిగి భర్త వద్దకే చేరుకుంది. ఇకపై భర్తతోనే ఉంటానని, అందుకు ఒప్పుకోకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని ఇంట్లో తిష్టవేసింది.
దీంతో ఏమి చేయాలో తోచని స్థితిలో రశ్మిపై అమె భర్త శశి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కాగా ప్రజలు మందు, మీడియా ముందు తనను తన పిల్లను వదిలేసి వెళ్లిన రశ్మిని తిరిగి భార్యగా స్వీకరించేది లేదని ఆమె భర్త శశి తేల్చి చెప్పారు.