
మిస్ ఇండియా పోటీలకు ఎన్టీపీసీ యువతి
గోదావరిఖని(కరీంనగర్) : మణప్పురం గోల్డ్‌లోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ ఇండియా పోటీల్లో గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన రశ్మీ పాల్గొని దక్షిణ భారతదేశం నుంచి నాల్గోదశ వరకు చేరింది. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌ న్‌షిప్‌లో వ్యాపారం నిర్వహించే భగత్‌సింగ్, ప్రసన్నలక్ష్మి దంపతుల పెద్దకుమార్తె రశ్మీ హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు. ప్రస్తుతం కోయంబత్తూర్‌లో ఈ నెల 18న దక్షిణ భారతస్థాయిలో పోటీలు జరుగుతుండగా.. ఇందులో విజేతలైన మొదటి ముగ్గురిని మిస్ ఇండియా పోటీల్లో నేరుగా పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
పారిశ్రామిక ప్రాంతానికి చెందిన రశ్మీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం ఈ ప్రాంతానికి గర్వ కారణమని శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 18న కోయంబత్తూర్‌లో నిర్వహించనున్న ఫైనల్ సెలెక్షన్స్‌లో రశ్మీ పాల్గొననుందని తెలిపారు. ఎంపికలో నిర్వహిస్తున్న అంశాలతో పాటు ఓటింగ్ విధానం కూడా పోటీలో ఉందని, ఇందుకోసం www. uniquetimes.org ద్వారా రశ్మీకి ఓటు వేసి ప్రజలు అండగా నిలవాలని కోరారు. విద్యార్థులు, యువకులు మొబైల్, ఇంటర్నెట్ ద్వారా ఓటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17 వరకు ఓటింగ్ చేసే అవకాశముందని తెలిపారు. సమావేశంలో నాయకులు కుమార్, రవి, శ్రీని వాస్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.