Miss India
-
అనార్కలీ డ్రెస్‌లో మహారాణిలా వెలిగిపోతున్న మాజీ మిస్ ఇండియా (ఫోటోలు)
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా నికితా పోర్వాల్
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగినా ఈ ఫెమినా అందాల పోటీలో నికితా విజయకేతనం ఎగురవేసి కిరీటాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా మంచి స్టోరీ టెల్లర్. ఆ అభిరుచికి జీవం పోయాలనే ఉద్దేశ్యంతోనే సుమారు 60కి పైగా నాటకాలలో నటించింది. కృష్ణలీల అనే పేరుతో 250 పేజీల నాటకాన్ని కూడా రాసింది. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఫీచర్ ఫిల్మ్‌లో నికితా కూడా ఒక భాగం, త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఆమె మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమాని. ఆమె గంభీరమైన వ్యవహారశైలి, తెలివితేటలంటే నికితకు అత్యంత ఇష్టమట. ఆధునికతను స్వీకరించటం తోపాటు భారతీయ వారసత్వానికి కూడా ప్రాధాన్యతి ఇచ్చే వైఖరిలో ఐశ్వర్యకు సాటిలేరని అంటోంది నికితా. ప్రకాశవంతమైన స్త్రీకి ఉదాహారణ ఆమె అంటూ ఐశ్వర్వరాయ్పై ప్రశంసలు కురిపించింది. ఇక నికిత జంతు ప్రేమికురాలు కూడా. మన అభివృద్ధి తోపాటు మనపై ఆధారపడిన జీవుల సంరక్షణ బాధ్యత కూడా మనదే అనేది ఆమె నమ్మకం. ఆశయం వద్దకు వస్తే చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలనేది ఆమె కోరిక. అలాగే జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి అడిగినప్పుడు..తానేనంటూ సగర్వంగా చెప్పుకుంది. ఎందుకంటే..వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా వచ్చానా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తనకు తన భవిష్యత్తుని అందంగా రూపుదిద్దుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతుంది. (చదవండి: బీచ్ వెడ్డింగ్, అందమైన లవ్‌స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్) -
Prakruthi Kambam: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.జీవితం నేర్పిన పాఠాలు..నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు. మల్టీ క్వీన్...నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్‌తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్‌గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్‌తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.25 ఏళ్ల వయసులో..ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్‌లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి. -
‘వేవ్‌మెడ్ పిక్సీ’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ – 2023 ‘ఊర్మిళ చౌహాన్’ బంజారాహిల్స్‌లోని ‘ది స్కిన్ సెన్స్’లో సందడి చేశారు. దక్షిణాదిలో స్కిన్‌కేర్ రంగంలోకి మొదటిసారిగా తీసుకొచి్చన వినూత్న ప్లాస్మా టెక్నాలజీ ‘వేవ్‌మెడ్ పిక్సీ’ని ఊరి్మళ చౌహాన్ ఆవిష్కరించారు. మంగళవారం జరిగిన ఈ ఆవిష్కరణలో ఊర్మిళ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి స్కిన్ కేర్ అవసరమని, ముఖ్యంగా సౌందర్య సంరక్షణలో పిక్సీ వంటి అధునాతన చికిత్సలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రముఖ డెర్మటాలజిస్టు ‘డాక్టర్ అలెక్యా సింగపూర్’ వేవ్‌మెడ్ పిక్సీ అధునాతన సేవల గురించి వివరిస్తూ.. పిక్సీ ఇటలీకి చెందిన అధునాతన ప్లాస్మా టెక్నాలజీ. ఇది నాన్–ఇన్వాసివ్ సర్జరీ. భవిష్యత్ సేవలకు ఇది నాంది పలుకుతుందని అన్నారు. నాన్–సర్జికల్ బ్లీఫరోప్లాస్టీ వంటి అధునాతన పద్దతులను ప్రదర్శిస్తుందని, అతి సులభంగా వినిమోగించేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందించారని పేర్కొన్నారు. -
Manushi Chhillar: బ్యూటీ క్వీన్, ఆపరేషన్ వాలెంటైన్ భామ బర్త్‌డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
Sruthi Chakravarthi Photos: హైదరాబాద్‌కు మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్.. శ్రుతి చక్రవర్తికి ఘన స్వాగతం (ఫొటోలు)
-
మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
హ్యాట్రిక్ నేతకు చుక్కలు చూపించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఉత్తరప్రదేశ్ దేశంలో రాజకీయంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడి లోక్‌సభ స్థానాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు పోటీ చేస్తున్న సీట్లు ఇక్కడే ఉన్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యేందుకు పోటీలో నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani). 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ తీవ్ర ఎన్నికల పోరులో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, వరుసగా మూడుసార్లు గెలిచిన రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఓడించి సంచలనం సృష్టించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ అక్కడ నుంచి గెలిచి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరోసారి అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గత చారిత్రక పోరు మరోసారి పునరావృతం కానుంది. స్మృతి ఇరానీ గురించి.. 1976 మార్చి 23న జన్మించిన స్మృతి ఇరానీ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1998 మిస్ ఇండియా అందాల పోటీలో ఫైనలిస్టులలో ఒకరైన ఆమె.. ఏక్తా కపూర్ ప్రముఖ డైలీ సీరియల్ ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తులసి విరానీ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో మరిన్ని టీవీ షోలలోకూ ఆమె కనిపించారు. టెలివిజన్‌లో విజయవంతమైన నటనా జీవితం తర్వాత స్మృతి ఇరానీ 2003లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరిన ఆమె 2004లో పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. 2010లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఏడాది తర్వాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీ లోక్‌సభ నుండి అప్పటికే రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ బీజేపీ నుంచి పోటీ చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే ఆ స్థానంలో పోటీ చేసి ఆసక్తి రేకెత్తించగలిగారు. రాహుల్ గాంధీ గెలుపు మార్జిన్‌ను 1 లక్ష ఓట్లకు తగ్గించారు. ఓటమి పాలైనప్పటికీ ఆమె మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలో చేరారు. 38 ఏళ్ల వయసులో ప్రధాని మోదీ తొలి క్యాబినెట్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. 2014 నుండి 2019 వరకు స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూటమి అభ్యర్థులను నిలబెట్టకుండా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చినప్పకీ, స్మృతి ఇరానీ 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2022 జూలై నుండి ఆమె మైనారిటీ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తున్నారు. స్మృతి ఇరానీ పార్సీ వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న 'మాజీ మిస్ ఇండియా'..!
ఆదిలాబాద్: మాజీ మిస్ ఇండియా, తెలంగాణ ఐటీ హబ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాగూర్ బుధవారం కుటుంబసమేతంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి, అమ్మవారి శేష వస్త్రంతో ఆశీర్వచనాలు అందజేశారు. -
తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు: స్టార్ హీరోయిన్
సాధారణంగా హీరోయిన్ అనగానే తెల్లగా ఉండాలి, లేకపోతే సినిమా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆ హీరోయినే బయటపెట్టింది. అసలు అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ.. ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో పాటే ఎవరికీ తెలియని బోలెడన్నీ సంగతల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) 'మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని. అయినాసరే రన్నరప్‌గా నిలిచాను. ఇది నేను గర్వపడే విషయమే. 15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. చాలా స్ట్రగుల్స్ చూశాను. దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి. దీంతో నా టీనేజీ అంతా చాలా కష్టంగా గడిచింది. మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా రక్తం పోయేది' 'నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్స్, ర్యాంప్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు. అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు. చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అదే అందరిలో నన్ను స్పెషల్‌గా మార్చింది' 'అందం అనేది శక్తివంతమైన ఆయుధం. నా దేశం తరఫున ఓ యాక్టర్, అంబాసిడర్‌గా పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను' అని నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. తెలుగులో మంచు విష్ణు 'సూర్యం' మూవీ మాత్రమే చేసింది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాలేదో, వద్దనుకుందో గానీ పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) (ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ) -
వెక్కిరింతలు తట్టుకుని.. మూర్ఛ నుంచి మిస్ ఇండియా వరకు
From Epilepsy to Pageant Triumph- Strela Thounaojam: రెండు రోజుల క్రితం ‘మిస్ ఇండియా 2023’ ఫైనల్స్ జరిగాయి. రాజస్థాన్ సుందరి నందిని గుప్తా విజేత. ఢిల్లీకి చెందిన శ్రేయా పూజా ఫస్ట్ రన్నరప్. కాని మణిపూర్ అమ్మాయి స్టెర్లా లువాంగ్ సెకండ్ రన్నరప్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. మణిపూర్ నుంచి మిస్ ఇండియా ఫైనల్స్ వరకూ చేరిన వారు ఇప్పటి దాకా లేరు. అదీగాక టీనేజ్‌లో మూర్ఛవ్యాధి వల్ల తీవ్రంగా బాధ పడిన స్టెర్లా తన అందాల కల కోసం ఆ వ్యాధితో పోరాడి గెలిచింది. స్ఫూర్తిగా నిలిచింది. టీనేజ్‌లో మూర్ఛ వ్యాధి ‘అది నా భవిష్యత్తుకు అడ్డంకి అనుకోలేదు. ఒక ఆశీర్వాదం అనుకున్నాను’ అంది టీనేజ్‌లో మూర్ఛ వ్యాధి బారిన పడ్డ స్టెర్లా. ‘అడ్డంకులు వస్తేనే కదా మనం పోరాడి మరింత శక్తిమంతులం అయ్యేది’ అందామె. అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి ఇప్పుడు స్టెర్లా మణిపూర్‌లో క్షణం తీరిక లేకుండా జనం అభిమానంతో ఇస్తున్న విందుల్లో పాల్గొంటోంది. సీఎం ఆమెను ఆహ్వానించి ప్రభుత్వ పెద్దలతో కలిసి డిన్నర్ ఇచ్చాడు. కారణం మణిపూర్‌లాంటి అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి ‘మిస్ ఇండియా’ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఒకరుగా ఆమె నిలవడం. ఏప్రిల్ 15న ఇంఫాల్‌లో జరిగిన ‘మిస్ ఇండియా 2023’ ఫైనల్స్‌లో 28 రాష్ట్రాలు 2 కేంద్ర ప్రాంతాల నుంచి 30 మంది పోటీ పడితే వారితో తలపడి మూడో స్థానంలో నిలిచింది స్టెర్లా. అయితే ఈ విజయం అంత ఈజీగా రాలేదు. మానసికంగా ఆరోగ్యపరంగా ఆమె చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. వెక్కిరింతలు తట్టుకుని 14 ఏళ్ల వయసులో స్టెర్లాకు మిస్ ఇండియా కావాలన్న లక్ష్యం ఏర్పడింది. కాని ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరూ అలాంటి కలను కనరు. ఇంకా చెప్పాలంటే ‘నిర్వచనాల ప్రకారం ఉండే ముక్కు, రూపు’ వారికి లేవన్న భావన వారిలో బలంగా ప్రవేశపెట్టి చాలా కాలం అవుతోంది. అందుకే అందరూ ఏడ్పించేవారు స్టెల్లాను. అది వొత్తిడిగా మారి ఆ తర్వాత నరాల జబ్బుగా పరిణమించింది. తరచూ మూర్ఛలు వచ్చేవి. ఒక్కోసారి మంచానికి అతుక్కు పోయేదాన్ని. అలాంటి స్థితిలో కూడా ఇదంతా దాటుతాను... నాకో అందమైన భవిష్యత్తు ఉంటుంది అని గట్టిగా అనుకునేదాన్ని. అదే నిజమైంది. ఇవాళ నా జబ్బును జయించాను. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను’ అంటుందామె. క్యాబిన్ క్రూగా పని చేసి బిజినెస్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొనసాగిస్తూనే మోడల్‌గా పని చేస్తోంది స్టెల్లా. కొంతకాలం ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో క్యాబిన్ క్రూగా చేసింది. ‘ఇంతకు ముందు అందం నిర్వచనం వేరే ఉండేది. ఇప్పుడు సహజ రూపాలను కూడా అందంగా చూస్తు్తన్నారు. అందుకే నేను టాప్ 3గా నిలిచానని అనుకుంటున్నాను.’ అంది స్టెర్లా. చదవండి: 1994లో తెల్లవెంట్రుకలను నల్లగా చేసే హెర్బల్ మందు కనిపెట్టాం! ఇప్పుడిలా.. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్.. పాత వీడియో వైరల్
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీటన్నిటికంటే ముందు స్మృతి మోడల్‌గా పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల కిత్రం అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఈ విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.బెంగాలీ-పంజాబీ కుటుంబానికి చెందిన స్మృతి.. 2000లో ఆతిష్, హమ్ హై కల్ ఆజ్ ఔర్ కల్ అనే సీరియల్స్ ద్వారా తొలిసారి బుల్లితెరపై కనిపించారు. ఏక్తా కపూర్ షో 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'లో తులసి విరాణిగా అందరికీ గుర్తుండిపోయారు. ఈ సీరియల్ ఆమెకు భారీ స్టార్‌డమ్‌ని సంపాదించిపెట్టింది. ఆమె ఉత్తమ నటిగా వరుసగా ఐదు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు అందుకున్నారు. అంతేగాక స్మృతి ఇరానీ 25 సంవత్సరాల క్రితం 1998లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు. ఆమె టాన్జేరిన్ స్లీవ్‌లెస్ టాప్, మినీ స్కర్ట్‌లో అద్భుతంగా ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారు. అయితే టాప్ 9కి చేరుకోలేకపోయారు. గురువారం( మార్చి23)న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాంప్ వాక్ చేస్తున్న స్మృతి వీడియోను మీరూ చూడండి. View this post on Instagram A post shared by Cryptic Miind (@crypticmiind) కాగా 2003లో ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె 2004లో మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2011లో తొలిసారి 2017లో రాజ్యసభకు రెండోసారి ఎన్నికయ్యారు. 2014లో అమేథీ నుంచి బరిలోకి దిగి రాహుల్ గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అదే అమేథీ గడ్డపై రాహుల్ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్!
టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున అక్కినేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60 ఏళ్లలో కూడా గ్లామర్, ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్‌తో జతకట్టబోతున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసల వినిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నట్లు వినికిడి. తండ్రి-కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ నాగార్జున సరసన నటించే హీరోయిన్ హాట్‌టాపిక్ నిలిచింది. మిస్ ఇండియాతో నాగ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. 2020 మిస్ ఇండియా టైటిల్ గెలిచిన మానస వారణాసిని ఇందులో జూనియర్ నాగ్ సరసన హీరోయిన్గా ఎంపిక చేశారని, ఇప్పుటికే నాగార్జున, మానసల ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: 200 థియేటర్లో రిరిలీజ్కు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. కొత్త ట్రైలర్ చూశారా? ఆ గుడ్‌న్యూస్‌ని ముందు తారక్‌తో పంచుకున్నా: రామ్ చరణ్ -
మిస్ ఇండియా పోటీలకు గ్రామీణ రైతుబిడ్డ గోమతిరెడ్డి
ఓబులవారిపల్లె: గ్రామీణ రైతుబిడ్డ జాతీయ స్థాయి అందాల పోటీలకు ఎంపికైంది. తన అందం, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మిస్ ఆంధ్రాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో నిర్వహించనున్న మిస్ ఇండియా పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా శ్రీనివాసులరెడ్డి, అరుణకుమారి దంపతుల ఏకైక కుమార్తె ముక్కా గోమతిరెడ్డి మార్చి 5వ తేదీన ముంబైలో నిర్వహించనున్న ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గోమతిరెడ్డి చిన్ననాటి నుంచి పాఠశాలల్లో బెస్ట్ బేబి తదితర పోటీల్లో రాణిస్తూ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేందుకు అన్ని విధాల సహకారం అందించారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అందాల పోటీల్లో గెలుపొందింది. అనంతరం బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అక్కడితో అగిపోకుండా మోడలింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి, 25వ తేదీన ముంబైలో నిర్వహించిన ఫెమీనా మిస్ అంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో మిస్ ఇండియా పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్న గోమతిరెడ్డి... మిస్ వరల్డ్ సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. తల్లిదండ్రుల సహకారంతో ఏదైనా సాధించవచ్చనే లక్ష్యంతో ముందుకువెళుతున్నానని, తన గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పింది. -
అతను 'గే' అని తెలిసిందో.. ఆ పని చేస్తాను: రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అతితక్కువ కాలంలోనే పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలె ఆమె హిందీలో నటించిన డాక్టర్ జీ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ప్రీత్‌కి సంబంధించన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 2011లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్న రకుల్‌కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్ స్పందిస్తూ.. ఈ విషయం తెలియగానే నేను షాక్ అవుతాను. వెంటనే అతన్ని చెంపదెబ్బ కొడతాను. కానీ తర్వాత ఆలోచిస్తాను. అతని అతని నిర్ణయం అని గౌరవిస్తాను. అదే దారిలో తను వెళ్లాలనుకుంటే నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు సంబంధించినంత వరకు నేను చాలా ముక్కుసూటిగా ఉండేందుకు ఇష్టపడతాను అంటూ ఆమె బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. -
సౌత్, నార్త్పై మిస్ ఇండియా సినీ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..
Miss India Sini Shetty Tollywood Favorite Actor Is Vijay Devarakonda: ఇటీవల ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ 'తుళు' భామ. ''టైటిల్ గెలిచాక నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వాటిని రీచ్ అయేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మిస్ వరల్డ్‌కు రెడీ అవుతున్నాను. ఆ పోటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను దేశంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పోటీపడ్డాను. ప్రతి అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత రెండేళ్లుగా సౌత్ నుంచి వచ్చిన వారు కిరీటాన్ని గెలుచుకున్నారు. వచ్చే సంవత్సరం ఎవరైనా పొందొచ్చు. సౌత్, నార్త్ అనే బేధం లేకుండా ఎవరైనా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. చదవండి: బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. అకాడమిక్‌గా కూడా నాకు మంచి రికార్డు ఉంది. నేను చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలకు అభిమానిని. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాను చూసి వారిలా అవ్వాలనుకున్నాను. నాకు బాలీవుడ్లో షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్తానంటే మొదట్లో నా తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందారు. ప్రతి అమ్మాయి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి'' అని మిస్ ఇండియా సినీ శెట్టి పేర్కొంది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్‌గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్‌కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
మిస్ ఇండియా 2022: తుళు సౌందర్యానికి మరో కిరీటం
ఐశ్వర్యా రాయ్... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది. 21 ఏళ్ల సిని శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ‘మిస్ ఇండియా 2022’ కిరీటాన్ని గెలుచుకుంది. చూడబోతే తుళు స్త్రీల శిరస్సులు అందాల కిరీటాల కోసమూ వారి అధరాలు విజయ దరహాసాల కోసమూ పుడుతున్నట్టున్నాయి. ఆదివారం ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. రాజస్థాన్‌కు చెందిన రుబుల్ షెకావత్ మొదటి రన్నర్ అప్‌గా నిలువగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచింది. భారీ హైబ్రిడ్ ఈవెంట్ నేరుగా జరిగే ఈవెంట్లో ఆన్లైన్ ద్వారా కూడా కొందరు ప్రాతినిధ్యం వహిస్తే అలాంటి ఈవెంట్‌ని ‘హైబ్రిడ్ ఈవెంట్’ అంటారు. అంటే డైరెక్ట్‌గా వర్చువల్‌గా కూడా జరిగే ఈవెంట్ అన్నమాట. ‘మిస్ ఫెమినా ఇండియా 2022’ ఈవెంట్ కూడా ఈ విధంగానే జరిగింది. జూరీలో నేహా దూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్‌తో పాటు మన మిథాలీ రాజ్ కూడా ఉంది. వీరి పరీక్షలన్నింటిని దాటి సిని విజేతగా నిలిచింది. దీని వల్ల ఆమె ఈ సంవత్సరం జరగనున్న 71వ ‘విస్ వరల్డ్’ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. సిని శెట్టి ఎవరు? కర్నాటకలో మూలాలున్న తుళు కుటుంబం నుంచి వచ్చిన సిని శెట్టి 2000 సంవత్సరంలో ముంబైలోనే పుట్టి అక్కడే పెరిగింది. తల్లి పేరు హైమా శెట్టి. సోదరుడు షికిన్ శెట్టి. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే సిని ముందు నుంచి మోడలింగ్ అంటే ఇష్టపడింది. ప్రియాంకా చోప్రా నుంచి స్ఫూర్తి పొంది ఆమెలాగే ఎదగాలనుకుంది. మంచి భరతనాట్యం డాన్సర్. మోడల్. ఇన్‌స్టాలో ఆమె అకౌంట్ దాదాపు 60 వేల మంది ఫాలోయెర్లు ఉన్నారు నిన్న మొన్నటి దాకా (ఇప్పుడు లక్షల్లో మారుతుంది). ఇన్‌స్టాలో సిని చేసే డాన్స్ రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘మాది స్త్రీల విషయంలో సమకాలీన ధోరణి ఉన్న కుటుంబమే అయినా మా సమూహం స్త్రీల విషయంలో సంప్రదాయ విలువల గురించి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఆ విలువలు స్త్రీల విషయంలోనే పట్టింపుతో ఉండటం నేను గమనించాను. స్త్రీ జీవితం అంటే ఏమిటో నాదైన ఒక విలువను వెతుక్కునే ప్రయత్నం చేశాను. నేను ఉండే (మోడలింగ్) రంగంలో స్త్రీలు సంప్రదాయ–ఆధునిక పోకడల మధ్య నలుగుతూ నిలవడం పెద్ద సవాలు. కాని సవాళ్లను ఎదుర్కొనే తత్త్వం వల్లే నేను ఈనాడు ఇక్కడ నిలుచుని ఉన్నాను’ అని సిని అంది. మరిచిపోలేని జ్ఞాపకం ‘మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?’ అని అడిగితే సిని శెట్టి తన భరతనాట్యం అరంగేట్రం గురించి చెప్పింది. ‘నాకు డాన్సంటే చాలా ఇష్టం. అది శరీరాన్ని, ఆత్మను సంలీనం చేస్తుంది. అది ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అందువల్ల నేను ఆరంగేట్రం చేసిన రోజును మర్చిపోలేను. అది నా సంస్కృతితో నేను అనుబంధం ఏర్పరుచుకున్న రోజుగా భావిస్తాను. నా భుజాల నుంచి చెమట కారిపోతున్నా, నా కొప్పుముడిలోని పూసలు ఊడి వేళ్లాడుతున్నా డాన్స్ చేస్తున్నందుకు నా లోలోపల ఉబికిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. మూడు గంటలు ప్రేక్షకుల ముందు డాన్స్ చేసి చివరన భూదేవికి పెట్టిన నమస్కారంతో ధన్యురాలిని అయ్యాను’ అని చెప్పింది సిని. త్వరలో ఆమె ఏదైనా భారీ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. -
ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి (ఫొటోలు)
-
Femina Miss India 2022: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
Karnataka Sini Shetty Crowned Femina Miss India World 2022: మగువల అందాన్ని నిర్వచించలేం. కానీ వారి కురులను కారు మబ్బులుగా, మోమును చంద్రబింబంలా, కళ్లను కలువపూలుగా ఇలా వివిధ రకాలుగా పోల్చగలరు, అభివర్ణించగలరు కవులు. అయితే ఫ్యాషన్ రంగంలో మాత్రం అందాన్ని వివిధ రౌండ్స్ వారీగా అంచనా వేస్తారు. ఈ విభాగాలకు రకరకాల పేర్లు పెట్టి ఒకర్ని మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌గా ఎంపిక చేస్తారు. అలాంటి ఈ ఫ్యాషన్ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేది 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలు. ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి కైవసం చేసుకుంది. అన్నీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సినీ శెట్టి అందంలో విజేతగా నిలిచింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలు ఆదివారం (జులై 3) అట్టహాసంగా ముగిసాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే కనులవిందుగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్స్ నేహా ధూపియా, మలైకా అరోరా, డినో మోరియా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ శియామక్ దావర్, మాజీ క్రికేటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్‌గా వ్యవహరించారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో సినీ శెట్టి విజేత కాగా, రాజస్థాన్‌కు చెందిన రూబల్ శెఖావత్ మొదటి రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. విజేతగా ఎంపికైన తర్వాత 21 ఏళ్ల సినీ శెట్టి మాట్లాడుతూ.. 'ఈ జర్నీని నేనేప్పటికీ మర్చిపోలేను. ఇందులో భాగమై నాకు అడుగడుగునా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని తెలిపింది. సినీ శెట్టి కిరీటాన్ని సోంతం చేసుకోవడం పట్ల ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలతో సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. When dreams turned into reality 👑 . . . . .#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/VmXwWjN7Uz — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Danced for Thalapathy's Vaathi Coming during the DANCES OF INDIA segment in the Miss India Competition last night 🔥💥 . . .#SiniShetty #MissIndiaFinale2022 #ThalapathyVijay𓃵 #Varisu #MissIndia2022 #Thalapathy67 #FeminaMissIndia2022 #Thalapathy66 #LokeshKanagaraj #VaathiComing pic.twitter.com/ZYexh43Qtc — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Thanks for all your lovely wishes 🥺🙏🏼 I hope I made Karnataka proud. Can't wait to start this new journey and make India proud 🇮🇳🤞🏼 Keep showering all your love and blessings and I love y'all ❤️#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/x3oRvXdBa0 — Sini Shetty (@sini_shetty) July 4, 2022 -
మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న శివానీ, ఎందుకంటే?
ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల కోసం ఎంతగానో కష్టపడింది శివానీ రాజశేఖర్. ఇటీవలే మిస్ తమిళనాడుగానూ ఎంపికైంది. మరికొన్ని రోజుల్లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల శివానీ మలేరియా బారిన పడింది. దాంతో మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్ మిస్ అయింది. అంతేకాదు, అనారోగ్యంతో తను మరింత సన్నబడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తన మెడికల్ థియరీ పరీక్షలు కూడా మొదలయ్యాయని, మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే రోజు అంటే జూలై 3న తనకు ఎగ్జామ్ ఉందని తెలిపింది. ఈ పరీక్ష మిస్ అవ్వకూడదనే ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేసింది. దీంతో చదువు కోసం అంత పెద్ద త్యాగం చేస్తున్న శివానీని కొందరు అభినందిస్తుంటే, అంత మంచి అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంటున్నావని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివానీ.. అద్భుతం, శేఖర్ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం తన పరీక్షల మీద పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఎగ్జామ్స్ పూర్తవగానే రాజ్ తరుణ్‌తో కలిసి వెబ్ సిరీస్‌లో నటించనుంది. View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) చదవండి: శాస్త్రవేత్తపై దోశద్రోహి కేసు.. 50 రోజులు జైల్లో నరకం.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ -
విజయవాడలో మిస్ఇండియా 2020 మానస వారణాసి సందడి ( ఫొటోలు )
-
Miss India: మిస్ తమిళనాడుగా శివాని, వివరణ ఇచ్చిన హీరోయిన్
Shivani Rajashekar About Her Miss India Selection: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరోవైపు మోడల్‌గా మిస్ ఇండియా పోటీల్లో రాణిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న జరిగిన ఈ పోటీలో శివాని మిస్ తమిళనాడుగా ఎంపికైంది. దీంతో ఆమెను విమర్శలు చుట్టుముట్టాయి. తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడుకు రిప్రజెంట్ చేయడమేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై తాజాగా స్పందించింది ఆమె. తన తండ్రి రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివాని మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీపై స్పందించింది. ‘తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలనుకున్నాను. అయితే నిర్వాహకులు అప్లికేషన్లో మల్టిపుల్ అప్షన్స్ ఇచ్చారు. దీంతో నేను తమిళనాడును కూడా అప్షన్‌గా పెట్టా. ఎందుకంటే నేను పుట్టింది చెన్నైలోనే కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడును కూడా అప్షన్లో ఇచ్చాను. చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి కానీ, పోటీ నిర్వాహకులు నన్ను తమిళనాడు కేటగిరి నుంచి ఎంపిక చేశారు. అందువల్ల ‘మిస్ తమిళనాడు’గా ఎంపికయ్యా’ అని వివరించింది. అయితే ఓ తెలుగు అమ్మాయిగా ఈ రెండు రాష్ట్రాల నుంచి తనను ఎంపిక చేసి ఉంటే మరింత సంతోషపడే దాన్ని అని, తమిళనాడు కూడా తనకు సొంత రాష్ట్రం వంటిదేనని పేర్కొంది. అన్నింటినీ మించి తాను భారత దేశాన్ని రిప్రజెంట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానని శివాని చెప్పుకొచ్చింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1621343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ది గ్రూమింగ్ స్కూల్ కలలు నెరవేర్చే డిజిటల్ బడి
సాధారణ పల్లెల నుంచి పెద్దపట్టణాల వరకు ఎంతోమంది అమ్మాయిలకు ‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనే లక్ష్యం ఉండవచ్చు. పక్కవారి నుంచి వెక్కిరింపులు కూడా ఎదురు కావచ్చు. ‘అది మనలాంటి వాళ్ల కోసం కాదు’ అంటూ అతిశయోక్తుల సమాచారం వెల్లువెత్తవచ్చు. ఈ గందరగోళాన్ని పక్కకు నెట్టి, స్పష్టత ఇవ్వడానికి, విజయం వైపు దారి చూపడానికి వచ్చిందే.. ది గ్రూమింగ్ స్కూల్. ‘అందంగా కనిపించాలనే ఆసక్తి మీలో ఉందా? ఆత్మవిశ్వాసం ఉందా? మీలోని శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం ఉందా?...‘అయితే ఈ లైఫ్ ఛేంజింగ్ స్కూల్ మీకోసమే’ అంటోంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్(ముంబై). దశాబ్దాలుగా ఎంటర్ టైన్మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) ఎంతోమంది యువతులు అందాల కిరీటాన్ని అందుకోవడంలో సహాయపడింది. ‘డూ–ఇట్–యువర్సెల్ఫ్’ అని నినదిస్తున్న ‘ఎంఐవో’ ఔత్సాహిక యువతుల కోసం ‘ది గ్రూమింగ్ స్కూల్’ ద్వారా వివిధ రంగాల నిపుణులతో వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, స్టైలింగ్, మేకప్, వ్యక్తిత్వ వికాసం, ఫ్యాషన్ స్టైలింగ్, సోషల్ మీడియా... మొదలైన వాటిలో నిపుణులు వీడియో తరగతులు నిర్వహిస్తారు. వారిలో కొందరు... అయేషా సేథ్ (మేకప్ ఆర్టిస్ట్), అలేషియా రౌత్(ర్యాంప్ వాకర్), సంజీవ్‌దత్తా (పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్), భరత్ గుప్తా (ఫ్యాషన్ స్టైలీస్ట్), డా.జార దాదీ (స్కిన్‌కేర్ కోచ్). యువతులను బ్యూటిఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా నిలపడంలో వీరి పాఠాలు ఉపయోగపడతాయి. ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత నైపుణ్యం సొంతం అవుతుంది. ‘కల కనడం ఎంత ముఖ్యమో, ఆ కలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారి కోసం, నిర్మాణాత్మకమైన పాఠాలతో ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశాం’ అంటుంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం అపారంగా అందుతుంది!