శ్రేయారావు, హర్షిత, కిరణ్మయిలు బెంగళూరులో జరిగే తర్వాతి దశ మిస్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు.
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): మెరుపు తీగల్లా మురిపించారు.. భువి నుంచి దిగివచ్చిన దేవతల్లా మైమరిపించారు. అందమైన శరీరాకృతి, ఆకర్షణీయమైన వస్త్రధారణతో ర్యాంప్ వాక్ చేసి ఆంధ్ర భామలు హోరెత్తించారు. నగరంలో శుక్రవారం మిస్ ఇండియా ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి యువతులు తరలి వచ్చారు. వీరిలో శ్రేయరావు, హర్షిత, కిరణ్మయి మిస్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 24వ తేదీన బెంగళూరులో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఫైనల్స్‌ను ముంబైలో జూన్ నెలలో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్స్‌కు యంగ్ హీరో ప్రిన్స్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయన ఎంపికైన ముగ్గురు భామలతో ర్యాంప్ వాక్ చేసి కేక పుట్టించారు.
మురిపించిన మిస్సమ్మలు
హంస నడకలు.. అందాల హొయలు.. కలగలిసి ర్యాంప్ వాక్ చేశాయి.. ఆహూతులను కట్టిపడేశాయి. నగరంలో శుక్రవారం జరిగిన మిస్ ఇండియా ఆడిషన్స్‌లో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అందాల బామలు తమ అందచందాలు, ప్రతిభా పాటవాలతో ఆకట్టుకున్నారు. వీరిలో శ్రేయారావు, హర్షిత, కిరణ్మయిలు బెంగళూరులో జరిగే తర్వాతి దశ మిస్
ఇండియా పోటీలకు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment