
వాషింగ్టన్: ‘మిస్ ఇండియా యూఎస్‌ఏ–2017’ కిరీటం వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీసైని (21) అనే విద్యార్థినిని వరించింది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా కనెక్టికట్‌కు చెందిన వైద్య విద్యార్థిని ప్రాచీ సింగ్ (22), రెండో రన్నరప్‌గా నార్త్ కరోలినాకు చెందిన ఫరీనా నిలిచారు. న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్ ప్యాలెస్‌లో ఆదివారం మూడు విభాగాల్లో నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో 24కు పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మంది పాల్గొన్నారు. కాగా మిసెస్ ఇండియా యూఎస్‌ఏగా ఫ్లోరిడాకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణురాలు కవితా మల్హోత్రా పట్టాని ఎంపికయ్యారు. మొదటి రన్నరప్ టైటిల్‌ను ప్రేరణ, రెండో రన్నరప్ టైటిల్‌ను ఐశ్వర్య సాధించారు. మిస్ టీన్ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని న్యూజెర్సీకి చెందిన స్వప్న మన్నం(17) గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment