లాక్‌డౌన్ కాలంలో సోషల్ మీడియాలో ‘థ్రోబ్యాక్ ఫొటో’ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ నటి నఫీసా అలీ తన పాత ఫొటోను షేర్ చేశారు. ‘‘1976లో మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత... జపాన్‌లోని టోక్యోలో మిస్ ఇంటర్నేషనల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాను. 19 ఏళ్ల వయస్సులో నేను పొందిన హాస్యపూరిత అనుభవం! నా కాళ్లు బాగున్నాయన్నారు!’’అంటూ ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. అదే విధంగా స్విమ్మింగ్ పట్ల తనకున్న ఆసక్తిని తెలిపే మరో ఫొటోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన తోబుట్టువులు అనీసా, సలీమా, నియాజ్ కలిసి తరచూ పూరీ(ఒడిశా)కి వెళ్లే వాళ్లమని.. అక్కడ సముద్రంలో ఈతకొడుతూ సేదతీరే వాళ్లమని రాసుకొచ్చారు. బలంగా తాకే అలలు తనను స్విమ్మింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.(నొప్పి కూడా ఎక్కువ ఉండదు.. దయచేసి..)
ఇక ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉన్న తరుణంలో తన పిల్లలు అజిత్, పియా, అర్మానాలను మిస్ అవుతున్నానంటూ ఆమె మరో పోస్టు పెట్టారు. కాగా బెంగాల్‌లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. మిస్ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆమె.. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ చాంపియన్‌గా పలు పతకాలు అందుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నఫీసా.. ఆ తర్వాత రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. కాన్సర్ బారిన కోలుకున్న 63 ఏళ్ల నఫీసా సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.(నాన్న మాట ఎందుకు విన్నానో!)
Comments
Please login to add a commentAdd a comment