Nafisa Ali
-
నేను చనిపోలేదు, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా: సింగర్
సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగిన సోషల్ మీడియోలో ఆ సంఘటన ఇట్టె వైరల్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరికి సమాజంలో జరిగే సంఘటనలు తెలియజేయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే అలాగే ఇందులో వచ్చే ప్రతి విషయం కూడా నిజమై ఉంటుందనేది కూడా లేదు. సోషల్ మీడియాల్లో వచ్చే వార్తల్లో ఏది నిజం, అబద్ధమని చెప్పడం చాలా కష్టం. ఇందుకు ఈ తాజా సంఘటనే ఉదహరణ. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ గాయకుడు లక్కీ అలీ కరోనా బారిన పడ్డారని, ఆరోగ్యం విషమించడంతో తనువు చాలించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన చనిపోయాడని భావించి చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ అభిమానులు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇది కాస్తా నటి నఫీసా అలీ దృష్టికి వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. లక్కీ అలీ చనిపోలేదని, క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తన మరణంపై వస్తున్న పుకార్లపై స్వయంగా లక్కీ అలీయే స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన స్టోరీ పోస్టు చేస్తూ.. ‘అందరి నమస్కారం. నా ఆరోగ్యంపై, మరణంపై వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవం. నేను బతికే ఉన్నాను. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. మరెక్కడికి వెళ్లలేదు. ఈ వార్తలను ఎవరూ నమ్మకండి. నాకు కరోనా వచ్చిందనే విషయం కూడా నిజం లేదు. మీరు అంతా కూడా సేఫ్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ విపత్కర సమయంలో దేవుడు మనందరిని కాపాడుతాడని ఆశిద్దా’ అంటూ లక్కీ అలీ పోస్టు షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగి కంగుతిన్నారు. ఇలా బ్రతికున్న వారిని చంపడం దారుణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. -
Fact Check: ఆ సింగర్ చనిపోయాడా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ లక్కీ అలి కోవిడ్ బారిన పడ్డారని, ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు లోనై తనువు చాలించారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అదే నిజమని నమ్మిన అభిమానులు అతడికి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థించడం మొదలు పెట్టారు. ఈ వార్తలు చూసి షాకైన నటి నఫీసా అలీ వీటిని అసత్య వార్తలుగా కొట్టిపారేసింది. లక్కీ క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేసింది. "లక్కీ అలి ఆరోగ్యంగా ఉన్నాడు. అతడికి ఆ మాయదారి కరోనా సోకలేదు. ప్రస్తుతం అతడు తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. మేము ఇందాకే ఫోన్లో చాటింగ్ కూడా చేసుకున్నాం. మున్ముందు ఎలాంటి కచేరీలు ఇవ్వాలా? అని ప్లానింగ్ చేసుకుంటున్నాడు" అని నఫీసా పేర్కొంది. దీంతో లక్కీ చనిపోయాడంటూ పుకార్లు సృష్టించినవారిని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. బతికున్న మనిషి లేడంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. He will be always remembered for his unique hmmm voice♥️🙏#LuckyAli #Covid pic.twitter.com/oy3Zg23K7z — Tweetera🐦 (@DoctorrSays) May 4, 2021 #RIP #luckyali .. he was one of a gem... — Goku San (@Gokusingh1988) May 4, 2021 In his own words: he is “resting, peacefully at home.” #luckyali https://t.co/5Rjx2EKCHc — Malvika Nanda (@MalvikaNanda) May 4, 2021 చదవండి: ఆ రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన తాప్సీ -
మిస్ ఇండియాగా నేను: ఎవరో గుర్తుపట్టారా?!
లాక్డౌన్ కాలంలో సోషల్ మీడియాలో ‘థ్రోబ్యాక్ ఫొటో’ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ నటి నఫీసా అలీ తన పాత ఫొటోను షేర్ చేశారు. ‘‘1976లో మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత... జపాన్‌లోని టోక్యోలో మిస్ ఇంటర్నేషనల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాను. 19 ఏళ్ల వయస్సులో నేను పొందిన హాస్యపూరిత అనుభవం! నా కాళ్లు బాగున్నాయన్నారు!’’అంటూ ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. అదే విధంగా స్విమ్మింగ్ పట్ల తనకున్న ఆసక్తిని తెలిపే మరో ఫొటోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన తోబుట్టువులు అనీసా, సలీమా, నియాజ్ కలిసి తరచూ పూరీ(ఒడిశా)కి వెళ్లే వాళ్లమని.. అక్కడ సముద్రంలో ఈతకొడుతూ సేదతీరే వాళ్లమని రాసుకొచ్చారు. బలంగా తాకే అలలు తనను స్విమ్మింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.(నొప్పి కూడా ఎక్కువ ఉండదు.. దయచేసి..) ఇక ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్న తరుణంలో తన పిల్లలు అజిత్, పియా, అర్మానాలను మిస్ అవుతున్నానంటూ ఆమె మరో పోస్టు పెట్టారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. మిస్ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆమె.. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ చాంపియన్‌గా పలు పతకాలు అందుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నఫీసా.. ఆ తర్వాత రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. కాన్సర్ బారిన కోలుకున్న 63 ఏళ్ల నఫీసా సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.(నాన్న మాట ఎందుకు విన్నానో!) -
నొప్పి కూడా ఎక్కువ ఉండదు.. దయచేసి..
ఎంతో ధైర్యంగా పోరాడి ప్రాణాంతక కరోనా వైరస్‌ను జయించడంతో పాటు తన ప్లాస్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని తన కజిన్ కూతురు దియా నాయుడుపై నటి నఫీసా అలీ ప్రశంసలు కురిపించారు. కరోనాపై పోరులో విజయం సాధించి... ప్రస్తుతం తన లాంటి పేషెంట్లను కాపాడేందుకు సాయం అందిస్తున్న హీరో దియా అనుభవాలను తెలుసుకోవాలని తన ఇన్‌స్టా ఫాలోవర్లకు సూచించారు. ‘‘దియా నాయుడు. ప్లాస్మా దానం చేసి ఇంటికి తిరిగివచ్చింది. ఇప్పుడదే లిక్విడ్ గోల్డ్‌లా కనిపిస్తోంది. ఎన్నో ప్రాణాలను నిలబెడుతోంది కాబట్టి దానికి విలువ కట్టలేం’’అని తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు. దియాను ధైర్యశాలిగా ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.(కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?) కాగా బెంగళూరులో నివసించే దియా నాయుడు కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె ఇటీవలే కోలుకున్నారు. కరోనా పేషంట్లకు.. కోవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా ఎక్కించడం ద్వారా ప్రమాద తీవ్రత తగ్గుంతుందన్న వార్తల నేపథ్యంలో ముందుకొచ్చి.. కర్ణాటకలో ప్లాస్మా దానం చేసిన రెండో వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ క్రమంలో తన అనుభవాలు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. ‘‘కర్ణాటకలో ప్లాస్మా థెరపీ ప్రారంభించారు. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల రక్తంలోని ప్లాస్మాను సేకరిస్తున్నారు. అందులోని యాంటీబాడీలు వైరస్ బారిన పడిన వారు కోలుకునేందుకు ఉపయోగపడతాయి. ఒక్క బ్యాగు ప్లాస్మా ఒక పేషెంట్‌కు మాత్రమే సరిపోతుందట. అంటే ప్లాస్మా దానం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.(ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు) కాబట్టి కరోనా నుంచి బయటపడ్డవారు ముందుకురావాలి. మనలాగే బాధ పడుతున్న వారిని కాపాడాలి. మీరు నాకు మెసేజ్ చేస్తే మీ సమాచారాన్ని డాక్టర్లకు చేరవేస్తాను. ఎవ్వరూ భయపడవద్దు. రక్తదానం చేసినట్లుగానే ఈ ప్రక్రియ కూడా. పెద్దగా నొప్పికూడా ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మన నుంచి ప్లాస్మా సేకరిస్తారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అంతేకాదు మరో రెండు వారాల్లో తిరిగి ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కేవలం నాలుగు గంటలు కేటాయిస్తే చాలు ఒక్కరి ప్రాణం కాపాడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. వైద్యబృందాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. వారికి సాయం అందిద్దాం’’అని చైతన్యం నింపారు. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. View this post on Instagram My darling niece Diya Naidu - I am so grateful to you brave child - a COVID19 warrior ( living in Bangalore) has agreed to donate her plasma to help cure other COVID19 serious patients. The process of donating plasma to treat COVID-19 is not very complex and can be done in just two hours. One of the most discussed methods of treatment of the disease caused by the novel coronavirus is plasma therapy, which involves the transfusion of plasma from a convalescent coronavirus patient to a critical patient. The blood of a recovering patient is rich in antibodies produced by the body to fight the virus, which are expected to help the critical patient recover.#covid_19 #plasmadonation #india A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Apr 27, 2020 at 2:37am PDT -
గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం
పనజి: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యాన్సర్ పేషెంట్, నటి నఫీసా అలీకి గోవా ప్రభుత్వం సాయం అందించింది. నఫీసాకు అవసరమైన మందులను అధికారులు ఆమెకు అందించనున్నారు. వివరాలు.. ఢిల్లీలో నివసించే నఫీసా అలీ కొన్ని రోజుల క్రితం తన కూతురిని చూసేందుకు గోవా వెళ్లారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గోవాలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్న తరుణంలో మందుల విషయంలో నఫీసా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ... ‘‘లాక్డౌన్ ప్రకటించిన తర్వాత గోవాలో తొలివారం చాలా కఠినంగా గడిచింది. అయితే ఇప్పుడు కూరగాయలు, నిత్యావసరాల షాపులు తెరుస్తున్నారు. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. నీళ్లు లేవు. రేషన్ లేదు. బయటకు వెళ్తే పోలీసులు కొడుతున్నారు. నా మందులు అయిపోయాయి. క్యాన్సర్ నివారణకు వాడే మందులు ఇక్కడ లభించడం లేదు. ఢిల్లీలో లభిస్తాయి గానీ కొరియర్ సర్వీసు పనిచేయడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గోవా ప్రభుత్వ దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. అధికారులు నఫీసాను కలిసి ఆమెకు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం వారు షేర్ చేశారు. ఇక దేశ వ్యాప్తంగా 2,069 కరోనా కేసులు నమోదు కాగా.. 53 మంది మృత్యువాత పడ్డారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. నఫీసా తాతయ్య వాజిద్ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న నఫీసా చికిత్స తీసుకుంటున్నారు. -
అసలు అలా ఎందుకు చేశానో?!
‘దంగల్’ స్టార్ జైరా వసీం సినిమాల నుంచి తప్పుకొంటున్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఇందుకు నిర్మాతలు కూడా సమ్మతించారు. అయితే సినిమా ప్రచారం కోసమే జైరా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఇకపై మత విశ్వాసాలకు లోబడి ఉండేందుకే ఇండస్ట్రీని వీడుతున్నానన్న జైరా ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేన్సర్‌తో పోరాడుతున్న బెంగాల్ నటి నఫీసా అలీ కూడా జైరా నిర్ణయంపై స్పందించారు. ఆ భగవంతుడు ప్రతీ ఒక్కరికీ కలలు నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చాడు..కాబట్టి ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘ సరికొత్త నేను.. వయస్సు మీద పడి తెల్లజట్టు వచ్చింది. అయినా ఇప్పటికీ సానుకూల దృక్పథంతోనే ఉన్నా. 20 ఏళ్ల ప్రాయంలో ఎలా ఉన్నానో కూడా నాకు గుర్తుంది. ఇక నటి జైరా వసీం విషయంలో నేను చాలా ఫీలవుతున్నాను. ఏ పని చేయాలో నిర్ణయించుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అదే విధంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు ఉంటాయి. ప్రస్తుతం యువత ఎన్నో ఒత్తిళ్లతో సతమవుతోంది. అయితే చాయిస్ తీసుకునే అవకాశం లభించినపుడు కచ్చితంగా సరైన దాన్ని ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే నేను ఇప్పటికి ఒక్కసారి గత జీవితంలోకి తొంగి చూసుకుంటే... నాన్న మాట ఎందుకు విన్నాను. నిజానికి నా మనసు మాట విని ఉంటే బాగుండేది కదా అని పశ్చాత్తాపడుతుంటాను’ అని నఫీసా అలీ తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అదే విధంగా ఈ పోస్టు కొంత మందికైనా ధైర్యాన్ని ఇస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఇక తనకు ఇంకా సినిమాల్లో నటించే ఓపిక ఉందని... పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తన భావోద్వేగాలను ప్రతిబింబించేందుకు తప్పక సినిమాల్లో నటిస్తానని, తన నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. భారత్ ఒక ప్రత్యేక దేశమని.. ఇక్కడ విభజన రాజకీయాలు చెల్లవు కాబట్టి లౌకిక భావన పెంపొందించాలని సంప్రదాయవాదులకు చురకలంటించారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. నసీఫా తాతయ్య వాజిద్ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న నసీఫా చికిత్స తీసుకుంటున్నారు. View this post on Instagram This is the new me ... older , grey and feeling positive . "I saw myself when I was 20 and I just felt for young actor Zaira Wasim . I thought let me put this message out that work is something which is your choice, it is your freedom, your independent right. There are many pressures young people are surrounded by... but if you have a choice, make you sure you think and make the right choice." "Because I always look back and say why did I give in, why did I listen to my father, I should have listened to myself “. A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Jul 2, 2019 at 1:18am PDT -
‘ఇప్పుడే అసలు యుద్ధం మొదలైంది’
‘మూడో కీమోథెరపీ పూర్తయింది. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైంది. తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలంటూ ఇంతమంది కోరుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ మాటలే నాకు ధైర్యాన్ని, బతుకతాననే ఆశను బలంగా రేకెత్తిస్తాయి’ అంటూ బెంగాల్ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నఫీసా అలీ(61) ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఆమె అభిమానులను ఉద్వేగానికి గురిచేస్తోంది. తాను ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నానే విషయాన్ని నఫీసా అలీ గతేడాది నవంబరులో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె... ‘ నా విలువైన స్నేహితురాలిని కలుసుకున్నాను. స్టేజ్ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను త్వరగా కోలుకోవాలని ఆమె ఆశించారు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె తాతయ్య వాజిద్ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. View this post on Instagram Done my 3rd Chemotherapy 10th January ‘19 and now the battle begins ... I am praying to get well .I am so deeply touched by all your wishes and feel blessed reading messages from around the world. Gives me hope and courage.💕🥰 A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Jan 10, 2019 at 11:12am PST View this post on Instagram A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Nov 17, 2018 at 4:53am PST -
నా కుటుంబమే నా ధైర్యం
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఒవేరియన్ క్యాన్సర్ థర్డ్ స్టేజీలో ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం నఫీసా చికిత్స పొందుతున్నారు.1979లో శశికపూర్ సరసన ‘జునూన్’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నఫీసా ‘మేజర్ సాబ్, బేవఫా, బిగ్ బి, లైఫ్ ఇన్ ఏ మెట్రో, గుల్జారిష్’ తదితర చిత్రాల్లో నటించారు. 2009లో వచ్చిన ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ నఫీసా చివరి చిత్రం. ఆమెకు క్యాన్సర్ సోకిన విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నఫీసాని పరామర్శిస్తున్నారు. ‘నా కుటుంబమే నా ధైర్యం’ అని నఫీసా పేర్కొన్నారు. -
ఆనందమే అందం
ఐదు పదులు దాటినా తరగని అందం.. ఆత్మవిశ్వాసం నిండిన చూపు, కట్టిపడేసే చిరునవ్వు.. ఒకప్పటి మిస్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ రన్నరప్.. క్రీడాకారిణి, నటి, రాజకీయ, సామాజికవేత్త... ఇలా విభిన్న రంగాలలో మేటి అయినా తల్లిగా, నానమ్మగా తాను ఎక్కువ సంతృప్తిని పొందుతున్నానని చెప్పే స్త్రీమూర్తి నఫీసా అలీతో కాసేపు... - ఓ మధు అథ్లెట్.. బ్యూటీక్వీన్, పొలిటీషియన్.. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? అథ్లెట్ కావటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ గ్యారంటీగా ఉంటుంది. చదువు ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవడానికి సహకరిస్తుంది. అలాగే సహజంగా మన పుట్టుక కొన్ని అవకాశాలు కల్పిస్తుంటుంది. పెరిగిన వాతావరణం కొంత హెల్ప్ చేస్తుంది. అలా అదృష్టవశాత్తు అవన్నీ నాకు అమరాయి. మనకున్న పాజిబిలిటీస్ నుంచి ముందుకు సాగటమే జీవితమంటే. అందుకే నా జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందంగా గడుపుతున్నా. ఫిట్‌గా ఉండటానికి ఏం చేస్తుంటారు? వాతావరణ కాలుష్యం, జీవన శైలి మార్పులు అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతుంటాయి. వాటిని తట్టుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రవేశం కలిగి వుండాలి. అథ్లెట్ కావడం వల్ల అనారోగ్యం పాలు కారని చెప్పలేం. కాని అనారోగ్యం పాలైనా తొందరగా కోలుకునేందుకు ఉపకరిస్తుంది. అందుకే, అందరూ జీవితంలో తప్పకుండా ఏదో ఒక క్రీడతో కనెక్ట్ కావాలి. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు పలకరిస్తుంటాయి. వీటిని తట్టుకోవడానికి, నియంత్రించడానికి మనం ఫిట్‌గా ఉండటం ద్వారా ప్రయత్నించాలి. క్రీడాకారిణులు రాణించాలంటే? నేను స్వతహాగా క్రీడాకారిణిని. అవకాశం కల్పిస్తే ఎంతోమంది మంచి క్రీడాకారిణులు దేశానికి ఎన్నో పతకాలు తీసుకురాగలరు. ఇటీవల కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారిణులు రాణిస్తున్నారు. అయితే అందరికీ సమానావకాశాలు రావటం లేదనేది వాస్తవమే. స్ఫూర్తి ఉన్న వారందరికీ అవకాశాలు కల్పించే అంశంలో కొంత బ్యాలెన్స్ రావలసి ఉంది. తగిన శిక్షణావకాశాల్ని మెరుగుపరిస్తే ఫలితం ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, సేవ.. వీటిలో మీరు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏది? నేను నా మదర్‌హుడ్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అమ్మమ్మనయ్యా. అథ్లెట్ కావటం వల్ల నా గ్రాండ్ చిల్డ్రన్‌తో పరుగెడుతూ అలసట లేకుండా ఆడుకోగలుగుతున్నాను. అదినాకెంతో సంతోషాన్నిస్తుంది. చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఎన్నో సేవలు అందించారు. వాటి గురించి కొన్ని వివరాలు... చదువంటే పుస్తకాలే కాదు. వినోదం ద్వారా కూడా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చక్కటి సినిమాలు చూసే అవకాశం పిల్లలకు ఉండాలని నెహ్రూ ఆశించే వారు. పిల్లల సృజనకు కావలసిన వాతావరణం సృష్టించాలన్నదే ఆయన ఆంతర్యం. ఇందుకోసం మేం బాలల చిత్రోత్సవాలను నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో సైతం ప్రదర్శించాం. సందేశాత్మక, స్ఫూర్తిదాయక చిత్రాలను చూడటం ద్వారా పిల్లల్లో లక్ష్యాల కల్పన, వివిధ విషయాలపై అవగాహన కలుగుతాయి. హైదరాబాద్ గురించి? గతంలో హైదరాబాద్‌లో ఫిలిం ఫెస్టివల్స్ నిమిత్తం చాలాసార్లు వచ్చాను. ఇక్కడి వారితో నాకు ప్రత్యేక అనుబంధం వుంది. హైదరాబాద్ కల్చర్, హెరిటేజ్ ఇండియాలోనే యూనిక్ అనిపిస్తుంది. చార్మినార్ దగ్గరుండే చిన్న చిన్న బజారుల్లో కొత్తకొత్తగా తయారు చేసే వస్తువులను షాపింగ్ చేస్తుంటాను. హైదరాబాద్ వచ్చి బిర్యాని పట్ల నాకున్న ప్యాషన్‌కు న్యాయం చెయ్యకుండా వెళ్లింది లేదు. హుస్సేన్‌సాగర్, పురాతన కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం నాకు నచ్చిన స్పాట్స్. ఒక మాట... కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రతిభను కనబర్చనివ్వరు. దీనివల్ల పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు రాకుండాపోతుంది. అదే విదేశాలలో పిల్లలను చూస్తే వీల్ చెయిర్లో ఉన్న పిల్లలు కూడా ఎంతో ప్రొడక్టివ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. దానిని గుర్తించటమే పెద్దవారిగా మన బాధ్యత. -
ఆకట్టుకున్న బల్గేరియా డాన్స్..