Lucky Ali Trends After Rumours Of His Death Goes Viral, Lucky Ali Is Well, No COVID-19 - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ బారిన పడిన సింగర్‌: నిజమేనా?

Published Wed, May 5 2021 11:12 AM | Last Updated on Wed, May 5 2021 11:25 AM

Lucky Ali Trends After Rumours Of His Death Goes Viral - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ లక్కీ అలి కోవిడ్‌ బారిన పడ్డారని, ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు లోనై తనువు చాలించారంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అదే నిజమని నమ్మిన అభిమానులు అతడికి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థించడం మొదలు పెట్టారు. ఈ వార్తలు చూసి షాకైన నటి నఫీసా అలీ వీటిని అసత్య వార్తలుగా కొట్టిపారేసింది. లక్కీ క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేసింది.

"లక్కీ అలి ఆరోగ్యంగా ఉన్నాడు. అతడికి ఆ మాయదారి కరోనా సోకలేదు. ప్రస్తుతం అతడు తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఫామ్‌ హౌస్‌లో ఉన్నాడు. మేము ఇందాకే ఫోన్‌లో చాటింగ్‌ కూడా చేసుకున్నాం. మున్ముందు ఎలాంటి కచేరీలు ఇవ్వాలా? అని ప్లానింగ్‌ చేసుకుంటున్నాడు" అని నఫీసా పేర్కొంది. దీంతో లక్కీ చనిపోయాడంటూ పుకార్లు సృష్టించినవారిని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. బతికున్న మనిషి లేడంటూ ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఆ రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన తాప్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement