సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగిన సోషల్ మీడియోలో ఆ సంఘటన ఇట్టె వైరల్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరికి సమాజంలో జరిగే సంఘటనలు తెలియజేయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే అలాగే ఇందులో వచ్చే ప్రతి విషయం కూడా నిజమై ఉంటుందనేది కూడా లేదు. సోషల్ మీడియాల్లో వచ్చే వార్తల్లో ఏది నిజం, అబద్ధమని చెప్పడం చాలా కష్టం. ఇందుకు ఈ తాజా సంఘటనే ఉదహరణ.
ఇటీవల బాలీవుడ్ ప్రముఖ గాయకుడు లక్కీ అలీ కరోనా బారిన పడ్డారని, ఆరోగ్యం విషమించడంతో తనువు చాలించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన చనిపోయాడని భావించి చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ అభిమానులు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇది కాస్తా నటి నఫీసా అలీ దృష్టికి వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. లక్కీ అలీ చనిపోలేదని, క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తన మరణంపై వస్తున్న పుకార్లపై స్వయంగా లక్కీ అలీయే స్పందించారు.
తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన స్టోరీ పోస్టు చేస్తూ.. ‘అందరి నమస్కారం. నా ఆరోగ్యంపై, మరణంపై వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవం. నేను బతికే ఉన్నాను. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. మరెక్కడికి వెళ్లలేదు. ఈ వార్తలను ఎవరూ నమ్మకండి. నాకు కరోనా వచ్చిందనే విషయం కూడా నిజం లేదు. మీరు అంతా కూడా సేఫ్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ విపత్కర సమయంలో దేవుడు మనందరిని కాపాడుతాడని ఆశిద్దా’ అంటూ లక్కీ అలీ పోస్టు షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగి కంగుతిన్నారు. ఇలా బ్రతికున్న వారిని చంపడం దారుణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment