Lucky Ali
-
లక్కీ అలి కన్సర్ట్.. సంగీతప్రియులూ.. రెడీయా?
ప్రముఖ సంగీతకారుడు లక్కీ అలీ హైదరాబాద్‌లో రేపు(మార్చి 4న) తన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈయన పాడిన ‘ఓ సనమ్’, ‘ఏక్ పల్ కే జీనా’ ; ‘న తుమ్ జానో న హమ్’ సహా మరెన్నో పాటలు సంగీతాభిమానుల మదిలో చిరస్ధాయిగా నిలిచిపోయాయి. శనివారం నాడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద సంగీతాభివమానులను ఆలరించనున్నారు లక్కీ అలి. ‘‘నిరీక్షణ ముగిసింది ! ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న కన్సర్ట్ చివరకు హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఫెయిర్పార్క్) వద్ద జరుగనుంది. లక్కీ మెలోడియస్ ట్యూన్స్‌లో లీనం కావడానికి సిద్ధం కండి, హైదరాబాద్‌లో మరుపురాని రాత్రులను సొంతం చేసుకోండి’’అని ఈ కార్యక్రమ నిర్వాహకులు సౌండ్స్వర్త్ వెల్లడించారు. లక్కీ అలీ సంగీతాభిమానుల ఆరాధ్య గాయకులలో ఒకరు. యన 1996లో తన తొలి ఆల్బమ్ ‘సునో’ విడుదల చేశారు. అది ఇన్స్టెంట్ హిట్ కావడంతో పాటు పలు అవార్డులు ఆయన్ను వరించాయి. వీటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంటీవీ ఆసియా వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా ఉంది. ఆయన పాడిన పాటలలో చాలా వరకూ ఇప్పటికీ సంగీతాభిమానులకు ప్రీతిపాత్రంగా వెలుగొందుతున్నాయి. లక్కీ అలీ విడుదల చేసిన ఇతర ఆల్బమ్‌లలో సిఫార్, అక్స్, స్యుయీ వంటివి ఉన్నాయి. అవి కూడా అభిమానులు, విమర్శల ప్రశంసలు పొందాయి. -
నేను చనిపోలేదు, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా: సింగర్
సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగిన సోషల్ మీడియోలో ఆ సంఘటన ఇట్టె వైరల్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరికి సమాజంలో జరిగే సంఘటనలు తెలియజేయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే అలాగే ఇందులో వచ్చే ప్రతి విషయం కూడా నిజమై ఉంటుందనేది కూడా లేదు. సోషల్ మీడియాల్లో వచ్చే వార్తల్లో ఏది నిజం, అబద్ధమని చెప్పడం చాలా కష్టం. ఇందుకు ఈ తాజా సంఘటనే ఉదహరణ. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ గాయకుడు లక్కీ అలీ కరోనా బారిన పడ్డారని, ఆరోగ్యం విషమించడంతో తనువు చాలించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన చనిపోయాడని భావించి చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ అభిమానులు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇది కాస్తా నటి నఫీసా అలీ దృష్టికి వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. లక్కీ అలీ చనిపోలేదని, క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తన మరణంపై వస్తున్న పుకార్లపై స్వయంగా లక్కీ అలీయే స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన స్టోరీ పోస్టు చేస్తూ.. ‘అందరి నమస్కారం. నా ఆరోగ్యంపై, మరణంపై వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవం. నేను బతికే ఉన్నాను. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. మరెక్కడికి వెళ్లలేదు. ఈ వార్తలను ఎవరూ నమ్మకండి. నాకు కరోనా వచ్చిందనే విషయం కూడా నిజం లేదు. మీరు అంతా కూడా సేఫ్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ విపత్కర సమయంలో దేవుడు మనందరిని కాపాడుతాడని ఆశిద్దా’ అంటూ లక్కీ అలీ పోస్టు షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగి కంగుతిన్నారు. ఇలా బ్రతికున్న వారిని చంపడం దారుణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. -
Fact Check: ఆ సింగర్ చనిపోయాడా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ లక్కీ అలి కోవిడ్ బారిన పడ్డారని, ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు లోనై తనువు చాలించారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అదే నిజమని నమ్మిన అభిమానులు అతడికి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థించడం మొదలు పెట్టారు. ఈ వార్తలు చూసి షాకైన నటి నఫీసా అలీ వీటిని అసత్య వార్తలుగా కొట్టిపారేసింది. లక్కీ క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేసింది. "లక్కీ అలి ఆరోగ్యంగా ఉన్నాడు. అతడికి ఆ మాయదారి కరోనా సోకలేదు. ప్రస్తుతం అతడు తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. మేము ఇందాకే ఫోన్లో చాటింగ్ కూడా చేసుకున్నాం. మున్ముందు ఎలాంటి కచేరీలు ఇవ్వాలా? అని ప్లానింగ్ చేసుకుంటున్నాడు" అని నఫీసా పేర్కొంది. దీంతో లక్కీ చనిపోయాడంటూ పుకార్లు సృష్టించినవారిని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. బతికున్న మనిషి లేడంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. He will be always remembered for his unique hmmm voice♥️🙏#LuckyAli #Covid pic.twitter.com/oy3Zg23K7z — Tweetera🐦 (@DoctorrSays) May 4, 2021 #RIP #luckyali .. he was one of a gem... — Goku San (@Gokusingh1988) May 4, 2021 In his own words: he is “resting, peacefully at home.” #luckyali https://t.co/5Rjx2EKCHc — Malvika Nanda (@MalvikaNanda) May 4, 2021 చదవండి: ఆ రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన తాప్సీ -
సెప్టెంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: లక్కీ అలీ (గాయకుడు); ఇషా కొప్పికర్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది. 9 అంకె పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కొత్త ఆశలు, ఆశయాలతో జీవితం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీరు కోరినవి లభిస్తాయి. అయితే కుజుని ప్రభావం వల్ల దూకుడుగా వ్యవహరించడం, నిర్మొహమాటంగా మాట్లాడటం మూలాన ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలు నడిపేటప్పుడూ, నిప్పుతోనూ అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. పుట్టిన తేదీ 19. దీనివల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ; నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. కంటిజబ్బులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, రెడ్, ఆరంజ్; సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, సుదర్శన హోమం చేయించడం, ఇంటిలో ఖురాన్ పఠన చేయించడం లేదా ప్రేయర్ పెట్టించడం, రక్తదానం చేయడం, తల్లిని, తోబుట్టువులను ఆదరించడం, అనాథలకు మందులు పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్