ప్రముఖ సంగీతకారుడు లక్కీ అలీ హైదరాబాద్‌లో రేపు(మార్చి 4న) తన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈయన పాడిన ‘ఓ సనమ్’, ‘ఏక్ పల్ కే జీనా’ ; ‘న తుమ్ జానో న హమ్’ సహా మరెన్నో పాటలు సంగీతాభిమానుల మదిలో చిరస్ధాయిగా నిలిచిపోయాయి. శనివారం నాడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద సంగీతాభివమానులను ఆలరించనున్నారు లక్కీ అలి. ‘‘నిరీక్షణ ముగిసింది ! ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న కన్సర్ట్ చివరకు హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఫెయిర్‌పార్క్) వద్ద జరుగనుంది. లక్కీ మెలోడియస్ ట్యూన్స్‌లో లీనం కావడానికి సిద్ధం కండి, హైదరాబాద్‌లో మరుపురాని రాత్రులను సొంతం చేసుకోండి’’అని ఈ కార్యక్రమ నిర్వాహకులు సౌండ్స్‌వర్త్ వెల్లడించారు.
లక్కీ అలీ సంగీతాభిమానుల ఆరాధ్య గాయకులలో ఒకరు. యన 1996లో తన తొలి ఆల్బమ్ ‘సునో’ విడుదల చేశారు. అది ఇన్‌స్టెంట్ హిట్ కావడంతో పాటు పలు అవార్డులు ఆయన్ను వరించాయి. వీటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంటీవీ ఆసియా వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా ఉంది. ఆయన పాడిన పాటలలో చాలా వరకూ ఇప్పటికీ సంగీతాభిమానులకు ప్రీతిపాత్రంగా వెలుగొందుతున్నాయి. లక్కీ అలీ విడుదల చేసిన ఇతర ఆల్బమ్‌లలో సిఫార్, అక్స్, స్యుయీ వంటివి ఉన్నాయి. అవి కూడా అభిమానులు, విమర్శల ప్రశంసలు పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment