![Nafisa Ali suffering from peritoneal, ovarian cancer - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/21/Untitled-11.jpg.webp?itok=vxRq3dz-)
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఒవేరియన్ క్యాన్సర్ థర్డ్ స్టేజీలో ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం నఫీసా చికిత్స పొందుతున్నారు.1979లో శశికపూర్ సరసన ‘జునూన్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నఫీసా ‘మేజర్ సాబ్, బేవఫా, బిగ్ బి, లైఫ్ ఇన్ ఏ మెట్రో, గుల్జారిష్’ తదితర చిత్రాల్లో నటించారు.
2009లో వచ్చిన ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ నఫీసా చివరి చిత్రం. ఆమెకు క్యాన్సర్ సోకిన విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నఫీసాని పరామర్శిస్తున్నారు. ‘నా కుటుంబమే నా ధైర్యం’ అని నఫీసా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment