సాధారణంగా హీరోయిన్ అనగానే తెల్లగా ఉండాలి, లేకపోతే సినిమా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆ హీరోయినే బయటపెట్టింది. అసలు అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
సెలీనా జైట్లీ.. ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో పాటే ఎవరికీ తెలియని బోలెడన్నీ సంగతల్ని పంచుకుంది.
(ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!)
'మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని. అయినాసరే రన్నరప్‌గా నిలిచాను. ఇది నేను గర్వపడే విషయమే. 15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. చాలా స్ట్రగుల్స్ చూశాను. దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి. దీంతో నా టీనేజీ అంతా చాలా కష్టంగా గడిచింది. మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా రక్తం పోయేది'
'నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్స్, ర్యాంప్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు. అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు. చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అదే అందరిలో నన్ను స్పెషల్‌గా మార్చింది'
'అందం అనేది శక్తివంతమైన ఆయుధం. నా దేశం తరఫున ఓ యాక్టర్, అంబాసిడర్‌గా పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను' అని నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఈమె.. తెలుగులో మంచు విష్ణు 'సూర్యం' మూవీ మాత్రమే చేసింది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాలేదో, వద్దనుకుందో గానీ పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్‌కు రెడీ)
Comments
Please login to add a commentAdd a comment