Celina Jaitly
-
శారీరకంగా, మానసికంగా గాయపడ్డా.. తప్పు నాదేనంటూ..
నలుగురు కుర్రాళ్లు వెంటపడితే మా టీచర్ అది నా తప్పే అనేసిందంటోంది హీరోయిన్ సెలీనా జైట్లీ. ఆడపిల్లలను ఇబ్బందిపెట్టేవారిని వదిలేసి బాధితులపైనే విమర్శలు చేయడం దారుణమంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. చిన్నప్పుడు జరిగిన చేదు సంఘటనలను పంచుకుంది. ఈ మేరకు చిన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేసింది.ఏవేవో కారుకూతలుఈ ఫోటో నేను ఆరో తరగతి చదువుతున్నప్పటిది.. నా బడి అయిపోగానే దగ్గర్లోని వేరే స్కూల్ అబ్బాయిలు నన్ను ఫాలో అయ్యేవారు. ఏవేవో కారుకూతలు కూసేవారు. నేనవేమీ పట్టించుకోనట్లు ఉండేదాన్ని. నేనసలు స్పందించకపోవడంతో కొన్ని రోజులకు నాపై రాళ్లు విసిరారు. నా పక్కన ఉన్న ఏ ఒక్కరూ దాన్ని చూసి స్పందించలేదు.తప్పంతా నాదేనా?మా టీచర్‌కు చెప్తే.. ఇదంతా నీవల్లే.. అని తప్పంతా నామీద వేసింది. వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటున్నావ్.. లూజ్ బట్టలు ధరించట్లేదు. జుట్టుకు నూనె పెట్టి దువ్వుకోకుండా హెయిర్ లీవ్ చేస్తున్నావ్.. అందుకే ఇవన్నీ అని చెప్పింది. ఒకసారైతే స్కూల్ రిక్షా కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వీళ్లంతా ఎందుకిలా చేస్తున్నారు? నిజంగా నేనేమైనా తప్పు చేశానా? అని కొన్నేళ్లపాటు నాలో నేనే బాధపడ్డాను.బ్రేకుల వైర్లు కట్11వ తరగతికి వచ్చేసరికి స్కూటీ బ్రేకుల వైర్లు కట్ చేశారు. బ్రేకులు పడకపోవడంతో నన్ను నేను కాపాడుకోవడానికి స్కూటీపై నుంచి జంప్ చేశాను. ఎంతో గాయపడ్డాను. అప్పుడు కూడా మా క్లాస్ టీచర్..జీన్స్ వేసుకుని స్కూటీపై రావడం వల్ల నిన్ను లూజ్ క్యారెక్టర్ అనుకుంటున్నారు, అందుకే ఇలా చేస్తున్నారంది. శారీరకంగా, మానసికంగా గాయపడ్డాను.ఆయనపైనా కుళ్లు జోకులుఏది జరిగినా నా తప్పే అంటున్నారు. మన దేశం కోసం రెండు యుద్ధాల్లో పాల్గొన్న మా తాతయ్య (రిటైర్డ్ కల్నల్) నన్ను తిరిగి స్కూలుకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆయనపైనా అబ్బాయిలు కుళ్లు జోకులు వేశారు. వారిని చూసి అసహ్యించుకుని సైలెంట్‌గా ముందుకు కదిలాడు. జరిగే ప్రతిదానికి మనమే బాధ్యులం కాదు. అని సెలీనా సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది.సినిమాలు..2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సూర్యం మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) -
తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు: స్టార్ హీరోయిన్
సాధారణంగా హీరోయిన్ అనగానే తెల్లగా ఉండాలి, లేకపోతే సినిమా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆ హీరోయినే బయటపెట్టింది. అసలు అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ.. ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో పాటే ఎవరికీ తెలియని బోలెడన్నీ సంగతల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) 'మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని. అయినాసరే రన్నరప్‌గా నిలిచాను. ఇది నేను గర్వపడే విషయమే. 15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. చాలా స్ట్రగుల్స్ చూశాను. దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి. దీంతో నా టీనేజీ అంతా చాలా కష్టంగా గడిచింది. మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా రక్తం పోయేది' 'నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్స్, ర్యాంప్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు. అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు. చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అదే అందరిలో నన్ను స్పెషల్‌గా మార్చింది' 'అందం అనేది శక్తివంతమైన ఆయుధం. నా దేశం తరఫున ఓ యాక్టర్, అంబాసిడర్‌గా పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను' అని నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. తెలుగులో మంచు విష్ణు 'సూర్యం' మూవీ మాత్రమే చేసింది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాలేదో, వద్దనుకుందో గానీ పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) (ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ) -
'ఫేమస్ నైట్ గర్ల్.. చేసినవన్నీ అడల్ట్ సినిమాలే, డైరెక్టర్ ఎదుటే..'
ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు రోజుకో బ్రేకింగ్ న్యూస్ వదులుతాడు. ఆ హీరోకు పెళ్లైనా అఫైర్లు ఉన్నాయని, ఈ హీరోయిన్ కాల్ గర్ల్ అని, వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారని, ఛాన్సులకోసం సదరు నటి చాలామందితో బెడ్ షేర్ చేసుకుందని, కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్, మందు తీసుకున్నారని ఇలా రోజుకో పుకారు సృష్టిస్తుంటాడు. కొందరు దీన్నీ చూసీచూడనట్లు వదిలేస్తారు. మరికొందరేమో అతడు అనే మాటలను తట్టుకోలేక రియాక్ట్ అవుతారు. తాజాగా అదే పని చేసింది బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ. 'సెలీనా.. తండ్రీకొడుకులైన ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌లతో శారీరకంగా చాలాసార్లు కలిశారు' అని ట్వీట్ చేశాడు ఉమైర్. దీనిపై మండిపడ్డ నటి.. 'మీకు ఏదో సమస్య ఉందనుకుంటా.. ముందు డాక్టర్ దగ్గరకు వెళ్లండి. ఇలాంటివారిపై ట్విటర్ చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్ చేసింది. తనపైనే ఎదురుదాడి చేయడంతో ఉడుక్కున్న ఉమైర్.. నటి గురించి అసభ్యంగా మాట్లాడుతూ వరుస ట్వీట్లు చేశాడు. 'నోర్మూయ్.. నువ్వొక సీ గ్రేట్ నటివి. అన్నీ సాఫ్ట్ పోర్న్ సినిమాలే చేశావు. తర్వాత బాగా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయావు. స్వార్థపరురాలా. ట్విటర్.. ఈ సైకో నన్ను వేధిస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోండి. అయినా 2003లో జనాషీన్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ముందు ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడలేదా? సమాధానం చెప్పు.. పైగా నాకు ఏదో రోగం ఉందంటున్నావ్. నువ్వు నాతో బెడ్ షేర్ చేసుకున్నావ్ కదా అప్పుడే ఆ సమస్య వచ్చింది. 2006, 2007 సంవత్సరాల్లో ముంబైలో నువ్వొక ఫేమస్ నైట్ గర్ల్‌వి. సీ గ్రేడ్ భోజ్‌పురి నటివైన నీకు నా ట్వీట్‌తో పబ్లిసిటీ వచ్చింది. అందుకు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పాలి' అని పేర్కొన్నాడు. వీరి మధ్య జరిగిన వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రిటిక్ ఉమైర్ సంధు She slept with me in Austria 🇦🇹 that’s why she knows I’ve erectile dysfunction 😛 ! Btw you were famous “ Night Girl ” in Mumbai in 2006 & 2007. Thanks to me , you got publicity from my tweet. C Grade Bhojpuri Actress 😄😘 https://t.co/gZg1usZzTa — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 Oh Just Shutup ! You were a C Grade Actress. Look at your Filmography. You always did Soft Porn Films. Ok ! Married with a Rich guy & then settled down ! Selfish woman. @TwitterSafety this psychopath is harassing me. Take notice. https://t.co/gZg1usZzTa — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 Sach Kafi Zaiyda Karwa Lag gaya !! Bataon sub ko ! You were naked infront of Director Feroze Khan in his office during Janasheen auditions in 2003. https://t.co/gZg1usZ23C — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 -
మిస్టర్ సంధు.. వెంటనే డాక్టర్‌ను కలవండి.. గట్టిగా ఇచ్చిపడేసిన నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ నటించిన జనషీన్ చిత్రంతో సెలీనా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా నటీనటులపై అదేపనిగా విమర్శలు చేస్తూ ఉండే సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నీ సమస్య త్వరలోనే నయమవుతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారామె. కాగా.. ఉమైర్ సంధు ట్వీట్ చేస్తూ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ నటులైన తండ్రీ, కుమారులు ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌తో శారీరకంగా చాలాసార్లు కలిశారంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి ఘాటూగా స్పందించింది. సెలీనా ట్వీట్లో రాస్తూ.. 'మిస్టర్ సంధు.. ఈ పోస్ట్ చేయడం వల్ల మీరు మనిషిగా మారడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. అలాగే మీ లైంగిక పటుత్వ సమస్య నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నా. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లండి. ఇలాంటి వారిపై దయచేసి ట్విటర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దివంగత నటుడు ఫిరోజ్ ఖాన్ సెలీనా జైట్లీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనషీన్ చిత్రీకరణ సమయంలో ఫిరోజ్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు తనను యువరాణిలా భావించారని నటి పేర్కొంది. ఈ చిత్రానికి ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సెలీనా నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కూడా కనిపించింది. Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da — Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023 -
ముగ్గురు పిల్లలున్న నటికి పెళ్లి ప్రపోజల్.. ఇల్లరికమైనా ఓకే అంటూ..
హీరోయిన్ల అందచందాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు అబ్బాయిలు. వారి ఫోటోలను వాల్పేపర్లుగా పెట్టుకుని మురిసిపోయేవారు కొందరైతే సెల్ఫీలు దిగి షేర్లు చేసేవారు మరికొందరు. అయితే కొద్దిమంది మాత్రం సదరు హీరోయిన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని పట్టపగలే కలలు కంటూ ఊహల్లో తేలిపోతుంటారు. తాజాగా ఓ నెటిజన్ కూడా అదే ఊహలో మునిగిపోయాడు. బాలీవుడ్ నటి, మోడల్ సెలీనా జైట్లీ తనకు భార్య అయితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడు. 'సెలీనా జైట్లీ.. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నా ఆరోగ్యం మరింత దిగజారకముందే నీతో నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకో. నీతో జీవితం పంచుకోవడానికి ఇల్లరికం రావడానికి కూడా నేను సిద్ధమే! నా ప్రపోజల్‌కు స్పందిస్తావని ఎదురుచూస్తున్నాను. ఇట్లు కోల్‌కతా నుంచి విజయ్ మగన్‌లాల్ వోరా' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన సెలీనా వెరైటీగా రిప్లై ఇచ్చింది. 'నా భర్తను, ముగ్గురు పిల్లలను అడిగాక వస్తాను' అంటూ తెలివిగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిస్ యూనివర్స్ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 11 ఏళ్ల కవలలు విన్స్టన్, విరాజ్‌తో పాటు ఐదేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది. I will ask my husband and three kids and revert ! https://t.co/jIEXG8pEVD — Celina Jaitly (@CelinaJaitly) April 6, 2023 -
మీరు కూడా అడుక్కుంటున్నారా?.. హీరోయిన్‌పై నెటిజన్ సెటైర్లు
ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని ఎగతాళి చేసిన ఓ నెటిజన్‌పై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మండిపడ్డారు. ఇటీవల ఆమె ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి మద్దతుగా ఓ వీడియోనూ రిలీజ్ చేసింది. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె ట్వీట్లో జత చేశారు. ఇది చూసిన ఓ నెటిజన్ స్పందించారు. 'ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి వారే అడుక్కుంటారు' సెలీనా ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన సెలీనా జైట్లీ నెటిజన్‌పై ఘూటుగా స్పందించింది. 'అసలు అందులో తమాషా ఏముంది సార్ ???? ఎవరైనా లింగమార్పిడి చేసుకుని మరీ అడుక్కునే స్థాయికి దిగజారడం చూస్తే గుండె పగిలేలా లేదు ??? మీలాంటి వారే ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్ కావడానికి కారణం. " అంటూ ట్వీట్ చేసింది. మరో ట్వీట్లో నెటిజన్ రాస్తూ..'వారు ఎలా అడుక్కుంటారో మీరు చూశారా? వారు అడుక్కోరు. పబ్లిక్‌లో తప్పుగా ప్రవర్తిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ ప్రత్యేకమైన జెండర్ గల వ్యక్తులు చేసే పనిని మరొకరు చేస్తే మీకు ఓకేనా? ఆర్ యూ బెగ్గింగ్? బహుశా ఇది నీ పెంపకం వల్ల కావచ్చు.' అంటూ రిప్లై ఇచ్చాడు. మార్చి 31న అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా,సెలీనా వారికి మద్దతును తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. "ప్రపంచంలోని ధైర్యవంతులైన కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు. వారిపై జరిగే అన్ని వివక్ష, హింసకు వ్యతిరేకంగా నేను పోరాడతా. మన ప్రపంచానికి వారి సహకారాన్ని అభినందిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. Have you seen how they beg? They don't beg. They misbehave in public. And would you be ok if man did what these "special" gender people do at Traffic signals 🚦 under the pretext of begging? Maybe you would because of your poor upbringing 😎 I pity your parents 😊 https://t.co/rOfrg7PFHY — Naam Kya Hay (@NaamKyaHay) April 1, 2023 దీనికి సెలీనా జైట్లీ స్పందిస్తూ.. 'నా పెంపకం గురించి నువ్వు అస్సలు చింతించకు. నేను 4 తరాల భారత సాయుధ బలగాల కుటుంబంలో పెరిగాను.ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పటికీ మన దేశంలో చాలా వెనుకబడి ఉంది. వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వ్యక్తులే వారి బహిష్కరణకు, దుస్థితికి బాధ్యులు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. సెలీనా జైట్లీ మిస్ యూనివర్స్-2003లో రన్నరప్‌గా నిలిచింది. జనాషీన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమె గత రెండు దశాబ్దాలుగా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీతో కార్యకర్తగా పని చేస్తున్నారు. I'm reminded of this gender only at Traffic signals 🚦🤣 — Naam Kya Hay (@NaamKyaHay) March 31, 2023 -
తనయుడి మృతి.. నటి భావోద్వేగం
న్యూఢిల్లీ: పొత్తిళ్లలో పాపాయిని చూడగానే అప్పటివరకు పడ్డ పురిటినొప్పులను మరచిపోతుంది మాతృమూర్తి. తన ప్రతిరూపాన్ని చూసుకుని మురిసిపోతూ బిడ్డ భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటుంది. అలాంటిది.. పసిప్రాయంలోనే బిడ్డ తన నుంచి దూరమై, శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కడుపుకోత ఒకేలా ఉంటుంది. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కూడా ఇలాంటి బాధను అనుభవించారు. నెలలు నిండకుండానే జన్మించిన తన తనయుడు షంషేర్ గుండె జబ్బుతో మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డే సందర్భంగా మంగళవారం తన మనోగతాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.(చదవండి: నా కుమారుడు అలా.. నాకిష్టం లేదు : సోనూ నిగమ్) ‘‘నెలలు నిండకుండానే ఏటా లక్షలాది మంది శిశువులు జన్మిస్తున్నారు. వారు ఎదుర్కొనే సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు నవంబరు 17,2011న వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డేను సృష్టించారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు. నియోనటల్ కేర్(నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులను ఉంచే ప్రత్యేక ఐసీయూ)లో శిశువులను ఉంచినప్పుడు తల్లిదండ్రులు గుండె ధైర్యంతో ఉండాలి. చనుబాలు పట్టించడం, వైద్యులపై నమ్మకం ఉంచితే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. మా విషయంలో ఇది నిరూపితమైంది. ఓ బిడ్డ ఎన్ఐసీయూలో ఉండగా, మరో బిడ్డ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఆ గుండెకోత వర్ణించలేం. అయితే దుబాయ్ వైద్యుల నిర్విరామ కృషి వల్ల మా ఆర్థర్ హాగ్ మాతోపాటు ఇంటికి రాగలిగాడు. కొన్ని సమస్యలు ఎదురైనా ప్రస్తుతం తను బాగానే ఉన్నాడు. విన్స్టన్ చర్చిల్, అల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి ప్రముఖులతో పాటు మా ఆర్థర్ కూడా ప్రిమెచ్యూర్ బేబీనే. మా ఆర్థుకు మీ ఆశీర్వాదాలు, ప్రేమ కావాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రిమెచ్యూర్ బేబీలు కూడా ఆర్థులాగే చలాకీగా మారిపోతారు’’ అని సెలీనా చెప్పుకొచ్చారు. కాగా మిస్ యూనివర్స్ పోటీల్లోనూ నాలుగో రన్నరప్‌గా నిలిచిన సెలీనా, మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్ అనే థ్రిల్లర్(హిందీ)మూవీతో సిల్వర్ స్ర్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్ హాగ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2012లో కవలలు(విన్స్టన్, విరాజ్), 2017లో కవలలు(షంషేర్, ఆర్థర్) జన్మించారు. షంషేర్ గుండెలోపంతో మృతి చెందగా.. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. WORLD PREMATURITY DAY 17 Nov While nothing prepares parents for how it feels to have a preemie baby, it’s a huge support to know others have been where they are now. @peterhaag & I assure you things do also get better. #WorldPrematurityDay Read More: https://t.co/TJhq51URMM pic.twitter.com/Bh33gyd5ka — Celina Jaitly (@CelinaJaitly) November 18, 2020 -
హృతిక్, సెలీనాలపై సోషల్ మీడియా ఫైర్
న్యూఢిల్లీ: టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి టెర్రరిస్టులు సృష్టించిన మారణకాండ పట్ల యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు టైస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం ఈ వార్తలు చదివి కలవర పడిన భారతీయులు ఇదే సంఘటనపై బాలివుడ్ నటుడు హృతిక్ రోషన్, సామాజిక కార్యకర్త, గే హక్కుల కోసం పోరాడుతున్న సెలీనా జైట్లీ పంపిన ట్వీట్లు చూసి కంగుతిన్నారు. ‘ఇదేమి చీప్ పబ్లిసిటీ!’ అంటూ ఈసడించుకున్నారు. వారిద్దరు సెలబ్రిటీల స్పందనలను ఎండగడుతూ కౌంటర్ ట్వీట్లు చేశారు. విశ్రాంతి కోసం ఇద్దరు పిల్లలతో టాంజానియా వెళ్లిన తాను టైస్టుల దాడులకు కొన్ని గంటల ముందు ఇస్తాంబుల్‌లో ఆగానని, అక్కడి నుంచి మరో విమానంలో రావాలంటే ఒకరోజు ఆగాల్సి వచ్చేదని, అయితే తాను ఎకానమీ క్లాస్‌లో సర్దుకొని భారత్‌కు వచ్చానని, ఓ మతం కోసం అక్కడ అమాయకులను చంపారని, టెర్రరిజానికి వ్యతిరేకంగా మనమంతా నిలబడాలంటూ హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియా మండిపడింది. టెర్రరిస్టుల దాడుల్లో 41 మంది అమాయకులు మరణించి, 238 మంది గాయపడి తాము బాధ పడుతుంటే తమరు ఎకానమీ క్లాస్‌లో వచ్చారని జాలి చూపాలా అంటూ పలువురు విమర్శించారు. ‘నా ప్రజలు చనిపోతే ఎకానమీ క్లాస్ గురించి మాట్లాడుతావా?....ప్రజలు చనిపోవడంకన్నా ఎకానమీ క్లాస్‌లో హృతిక్ ప్రయాణించడం ఎక్కువ హారిబుల్‌గా ఉన్నట్టుంది....హృతిక్‌కు మతిపోయింది....ఆయనకు పిసరంతా కూడా మెదడు లేదు....ఆయన మాటలు పట్టించుకోకండి, నేను ఈ క్షణాన ప్రపంచం కోసం నిజంగా బాధ పడుతున్నా...’ అంటూ పలువురు ట్వీట్ చేశారు. ఫ్లోరిడాలోని మయామిలో నెల రోజుల క్రితం జరిగిన హార్వే మిల్క్ ఫౌండేషన్ సన్మాన కార్యక్రమానికి హాజరైన తాను వచ్చేటప్పుడు ఇస్తాంబుల్ మీదుగా వచ్చానని, అక్కడ టెర్రరిస్టుల దాడి జరిగిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని సెలీనా జైట్లీ వ్యాఖ్యానించడంపై కూడా ట్విట్టర్లో మండిపడ్డారు. ‘అసలు నీకేమైంది? మిల్క్ ఫౌండేషన్ గురించి, సన్మానం గురించి మాట్లాడాల్సిన సందర్భమా ఇది!.....నీవు నిజంగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉండి ఉంటే బాధితులతో కలసి సెల్ఫీలు తీసుకునే దానివేమో!’ అంటూ కొందరు మండిపడ్డారు. వీటిపై సెరీనా జైట్లీ స్పందిస్తూ తాను ప్రస్తావించిన ఇతర అంశాలను ఎత్తిచూపినందుకు ధన్యవాదాలని, తనకు దురుద్దేశాలు అంటగట్టవద్దని, తనను క్షమించాలని కోరారు. -
ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'
విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రం ‘శ్రీమతి’ తెలుగులో ‘ఎక్స్ వై జడ్’ పేరుతో విడుదల కానుంది. సెలీనా జైట్లీ, ప్రియాంక త్రివేది నాయికలు. రవి దర్శకుడు. జీఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గాజుల మాణిక్యాలరావు విడుదల చేయనున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. శివకృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, సురేష్ కొండేటికి ఇచ్చారు. వి. సాగర్, సునీల్‌కుమార్‌రెడ్డి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. సినిమా పరిశ్రమ మీద మమకారంతో వచ్చిన ఈ నిర్మాత చేసిన తొలి ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నానని శివకృష్ణ అన్నారు. కథలో విషయముంటేనే ఉపేంద్ర సినిమాలు చేస్తాడని, ఈ చిత్రం కొత్తగా ఉంటుందని ఊహిస్తున్నానని వి.సాగర్ చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సునీల్‌కుమార్‌రెడ్డి, సురేష్, ఘంటాడికృష్ణ మాట్లాడారు.