ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'
ఉపేంద్ర.. 'ఎక్స్ వై జడ్'
Published Mon, Sep 9 2013 12:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రం ‘శ్రీమతి’ తెలుగులో ‘ఎక్స్ వై జడ్’ పేరుతో విడుదల కానుంది. సెలీనా జైట్లీ, ప్రియాంక త్రివేది నాయికలు. రవి దర్శకుడు. జీఎంఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గాజుల మాణిక్యాలరావు విడుదల చేయనున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
శివకృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, సురేష్ కొండేటికి ఇచ్చారు. వి. సాగర్, సునీల్‌కుమార్‌రెడ్డి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. సినిమా పరిశ్రమ మీద మమకారంతో వచ్చిన ఈ నిర్మాత చేసిన తొలి ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నానని శివకృష్ణ అన్నారు.
కథలో విషయముంటేనే ఉపేంద్ర సినిమాలు చేస్తాడని, ఈ చిత్రం కొత్తగా ఉంటుందని ఊహిస్తున్నానని వి.సాగర్ చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సునీల్‌కుమార్‌రెడ్డి, సురేష్, ఘంటాడికృష్ణ మాట్లాడారు.
Advertisement
Advertisement