Celina Jaitly Slams Film Critic Who Said She Slept with Feroz Khan - Sakshi
Sakshi News home page

Celina Jaitly: మీరు మనిషిగా మారుతారని ఆశిస్తున్నా: బాలీవుడ్ నటి ఫైర్

Apr 11 2023 3:46 PM | Updated on Apr 11 2023 5:47 PM

Celina Jaitly slams film critic who said she SLEPT with Feroz Khan - Sakshi

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ నటించిన జనషీన్ చిత్రంతో సెలీనా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా నటీనటులపై అదేపనిగా విమర్శలు చేస్తూ ఉండే సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నీ సమస్య త్వరలోనే నయమవుతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారామె. 

కాగా.. ఉమైర్‌ సంధు ట్వీట్ చేస్తూ బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ నటులైన తండ్రీ, కుమారులు ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌తో శారీరకంగా చాలాసార్లు కలిశారంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి ఘాటూగా స్పందించింది. 

సెలీనా ట్వీట్‌లో రాస్తూ.. 'మిస్టర్ సంధు.. ఈ పోస్ట్ చేయడం వల్ల మీరు మనిషిగా మారడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. అలాగే మీ లైంగిక పటుత్వ సమస్య నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నా. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లండి. ఇలాంటి వారిపై దయచేసి ట్విటర్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. 

కాగా.. దివంగత నటుడు  ఫిరోజ్ ఖాన్ సెలీనా జైట్లీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనషీన్ చిత్రీకరణ సమయంలో ఫిరోజ్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు తనను యువరాణిలా భావించారని నటి పేర్కొంది. ఈ చిత్రానికి ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సెలీనా నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్‌మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కూడా కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement