ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీని ఎగతాళి చేసిన ఓ నెటిజన్‌పై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మండిపడ్డారు. ఇటీవల ఆమె ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి మద్దతుగా ఓ వీడియోనూ రిలీజ్ చేసింది. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె ట్వీట్‌లో జత చేశారు. ఇది చూసిన ఓ నెటిజన్ స్పందించారు. 'ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి వారే అడుక్కుంటారు' సెలీనా ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.
ఇది చూసిన సెలీనా జైట్లీ నెటిజన్‌పై ఘూటుగా స్పందించింది. 'అసలు అందులో తమాషా ఏముంది సార్ ???? ఎవరైనా లింగమార్పిడి చేసుకుని మరీ అడుక్కునే స్థాయికి దిగజారడం చూస్తే గుండె పగిలేలా లేదు ??? మీలాంటి వారే ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్ కావడానికి కారణం. " అంటూ ట్వీట్ చేసింది.
మరో ట్వీట్‌లో నెటిజన్ రాస్తూ..'వారు ఎలా అడుక్కుంటారో మీరు చూశారా? వారు అడుక్కోరు. పబ్లిక్‌లో తప్పుగా ప్రవర్తిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ ప్రత్యేకమైన జెండర్ గల వ్యక్తులు చేసే పనిని మరొకరు చేస్తే మీకు ఓకేనా? ఆర్ యూ బెగ్గింగ్? బహుశా ఇది నీ పెంపకం వల్ల కావచ్చు.' అంటూ రిప్లై ఇచ్చాడు.
మార్చి 31న అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా,సెలీనా వారికి మద్దతును తెలియజేస‍్తూ ఒక వీడియోను షేర్ చేసింది. "ప్రపంచంలోని ధైర్యవంతులైన కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు. వారిపై జరిగే అన్ని వివక్ష, హింసకు వ్యతిరేకంగా నేను పోరాడతా. మన ప్రపంచానికి వారి సహకారాన్ని అభినందిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది.
Have you seen how they beg? They don't beg. They misbehave in public. And would you be ok if man did what these "special" gender people do at Traffic signals 🚦 under the pretext of begging? Maybe you would because of your poor upbringing 😎 I pity your parents 😊 https://t.co/rOfrg7PFHY
— Naam Kya Hay (@NaamKyaHay) April 1, 2023
దీనికి సెలీనా జైట్లీ స్పందిస్తూ.. 'నా పెంపకం గురించి నువ్వు అస్సలు చింతించకు. నేను 4 తరాల భారత సాయుధ బలగాల కుటుంబంలో పెరిగాను.ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పటికీ మన దేశంలో చాలా వెనుకబడి ఉంది. వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వ్యక్తులే వారి బహిష్కరణకు, దుస్థితికి బాధ్యులు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. సెలీనా జైట్లీ మిస్ యూనివర్స్-2003లో రన్నరప్‌గా నిలిచింది. జనాషీన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్‌మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమె గత రెండు దశాబ్దాలుగా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీతో కార్యకర్తగా పని చేస్తున్నారు.
I'm reminded of this gender only at Traffic signals 🚦🤣
— Naam Kya Hay (@NaamKyaHay) March 31, 2023
Comments
Please login to add a commentAdd a comment