బాలీవుడ్ భామ విద్యా బాలన్(vidya Balan) గతేడాది భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ హారర్-కామెడీ చిత్రంలో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నటి విద్యాబాలన్ చేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన పోస్ట్ నెట్టింట విమర్శలకు దారితీసింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.
ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ సిరీస్‌లో ఐదో టెస్టుకు దూరంగా ఉండాలన్న రోహిత్ శర్మ(Rohit Sharma) నిర్ణయాన్ని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసించారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ బదులుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని తీసుకున్నారు. అయితే రోహిత్ శర్మకు మద్దతుగా విద్యాబాలన్ స్పందించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె తన పీఆర్ టీమ్ సూచనల మేరకే ఇలా రియాక్షన్ ఇచ్చిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఫేమ్ కోసమే రోహిత్ శర్మ పేరును వాడుకుందని విద్యా బాలన్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై నటి విద్యాబాలన్ టీమ్ స్పందించింది.
స్పందించిన విద్యాబాలన్ టీమ్..
విద్యాబాలన్ పోస్ట్‌పై పీఆర్ టీమ్ స్పందించింది. తమ సూచనల మేరకు ఆమె అలా చేయలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యా బాలన్ తన ఇష్టపూర్వకంగా అలాంటి పోస్ట్‌ను చేసింది. ఇందులో పీఆర్ టీమ్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. విద్యాబాలన్ మొదటి నుంచి క్రీడాభిమాని కాదు.. కానీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేవారిని ఆమె మెచ్చుకుంటుందని పీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ట
రోహిత్‌ను ప్రశంసిస్తూ విద్యాబాలన్ చేసిన ట్వీట్‌పై చాలా మంది విమర్శలు గుప్పించారు. అసలు ఆమె ట్విటర్‌లో రోహిత్‌ను ఫాలో కావడం లేదని.. ఇదంతా కేవలం పీఆర్ స్టంట్‌లో భాగమేనని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రోహిత్‌ను ప్రశంసిస్తూ వచ్చిన స్క్రీన్ షాట్‌ను విద్యాబాలన్ మొదట షేర్ చేసి వెంటనే దాన్ని తొలగించారన్నారు. ఈ పోస్ట్ కాస్తా పెద్ద చర్చకు దారితీయడంతో దీనిపై విద్యా బాలన్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
(ఇది చదవండి: సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగి ఆపై.. చైన్ స్మోకర్‌గా మారిన బ్యూటీ)
2014లో పద్మశ్రీ అవార్డు..
కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్‌తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యాబాలన్ పేరు అందరికీ దగ్గరయ్యారు. బాలీవుడ్‌లో భారీ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అలనాటి తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్‌లో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
సిరీస్ కోల్పోయిన్ భారత్..
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్‌ని ట్రోఫిని టీమిండియా చేజార్చుకుంది. చివరి టెస్ట్‌లో ఓటమి పాలవడంతో 3-1తో సిరీస్‌ను కంగారూలకు అప్పగించింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా అర్హత సాధించింది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్‌తో ఆసీస్ తలపడనుంది.
(ఇది చదవండి: అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్)
Rohit Sharma, what a SUPERSTAR 🤩!!
To take a pause & catch your breath requires courage … More power to you … Respect 🙌 !! @ImRo45— vidya balan (@vidya_balan) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment