అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్ | Vidya Balan recalls a producer made derogatory comments on her acting | Sakshi
Sakshi News home page

Vidya Balan: రెండు రోజుల షూట్ తర్వాత.. తల్లిదండ్రుల ముందే అలా: విద్యా బాలన్

Published Tue, Oct 29 2024 5:34 PM | Last Updated on Tue, Oct 29 2024 5:41 PM

Vidya Balan recalls a producer made derogatory comments on her acting

బాలీవుడ్ భామ విద్యా బాలన్ తాజాగా భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విద్యా బాలన్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి కోలీవుడ్‌లో తనకెదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఆ సంఘటనతో దాదాపు ఆరు నెలల పాటు అద్దంలో కూడా తన మొహాన్ని చూసుకోలేదని చెప్పింది. ఓ నిర్మాత తన నటన, డ్యాన్స్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా తనకు చెప్పకుండానే సినిమా నుంచి తొలగించాడని పేర్కొంది.

విద్యా బాలన్ మాట్లాడుతూ.. 'నేను ఒక తమిళ చిత్రంలో చేశా. ఆ సినిమాలో రెండు రోజులు షూట్ పూర్తి చేశా. కానీ ఏమైందో తెలియదు.. నా ప్లేస్‌ను మరొకరితో భర్తీ చేశారు. ఈ విషయంపై చెన్నైలో నిర్మాతతో మాట్లాడేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లా. అతను సినిమాలోని కొన్ని క్లిప్‌లను మాకు చూపించి అవమానకరంగా మాట్లాడారు. మీ కూతురు ఏ యాంగిల్‌లో చూసినా హీరోయిన్‌గా కనిపిస్తోందా? అంటూ అవమానించాడు. తనకు నటించడం, డ్యాన్స్ చేయడం రాదని మొహంపైనే చెప్పాడని' ఆ చేదు ఘటనను గుర్తు చేసుకుంది.

ఆయన మాటలతో చాలా బాధపడ్డానని విద్యాబాలన్ తెలిపింది. దాదాపు ఆరు నెలలు నా మొహం అద్దంలో కూడా చూసుకోలేదని వెల్లడించింది. ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొంది. కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్‌తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత  సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్‌ లాంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. ది డర్టీ పిక్చర్ (2011) చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ప్రస్తుతం హారర్-కామెడీ చిత్రం భూల్ భూలయ్యా -3తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement