
నా ఆరోగ్యం మరింత దిగజారకముందే నీతో నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకో. నీతో జీవితం పంచుకోవడానికి ఇల్లరికం రావడానికి కూడా నేను సిద్ధమే! నా ప్రపోజల్‌కు స్పం
హీరోయిన్ల అందచందాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు అబ్బాయిలు. వారి ఫోటోలను వాల్‌పేపర్లుగా పెట్టుకుని మురిసిపోయేవారు కొందరైతే సెల్ఫీలు దిగి షేర్లు చేసేవారు మరికొందరు. అయితే కొద్దిమంది మాత్రం సదరు హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని పట్టపగలే కలలు కంటూ ఊహల్లో తేలిపోతుంటారు. తాజాగా ఓ నెటిజన్ కూడా అదే ఊహలో మునిగిపోయాడు. బాలీవుడ్ నటి, మోడల్ సెలీనా జైట్లీ తనకు భార్య అయితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడు.
'సెలీనా జైట్లీ.. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నా ఆరోగ్యం మరింత దిగజారకముందే నీతో నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకో. నీతో జీవితం పంచుకోవడానికి ఇల్లరికం రావడానికి కూడా నేను సిద్ధమే! నా ప్రపోజల్‌కు స్పందిస్తావని ఎదురుచూస్తున్నాను. ఇట్లు కోల్‌కతా నుంచి విజయ్ మగన్‌లాల్ వోరా' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన సెలీనా వెరైటీగా రిప్లై ఇచ్చింది. 'నా భర్తను, ముగ్గురు పిల్లలను అడిగాక వస్తాను' అంటూ తెలివిగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా మిస్ యూనివర్స్ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 11 ఏళ్ల కవలలు విన్‌స్టన్, విరాజ్‌తో పాటు ఐదేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్‌మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది.
I will ask my husband and three kids and revert ! https://t.co/jIEXG8pEVD
— Celina Jaitly (@CelinaJaitly) April 6, 2023