నలుగురు కుర్రాళ్లు వెంటపడితే మా టీచర్ అది నా తప్పే అనేసిందంటోంది హీరోయిన్ సెలీనా జైట్లీ. ఆడపిల్లలను ఇబ్బందిపెట్టేవారిని వదిలేసి బాధితులపైనే విమర్శలు చేయడం దారుణమంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. చిన్నప్పుడు జరిగిన చేదు సంఘటనలను పంచుకుంది. ఈ మేరకు చిన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేసింది.
ఏవేవో కారుకూతలు
ఈ ఫోటో నేను ఆరో తరగతి చదువుతున్నప్పటిది.. నా బడి అయిపోగానే దగ్గర్లోని వేరే స్కూల్ అబ్బాయిలు నన్ను ఫాలో అయ్యేవారు. ఏవేవో కారుకూతలు కూసేవారు. నేనవేమీ పట్టించుకోనట్లు ఉండేదాన్ని. నేనసలు స్పందించకపోవడంతో కొన్ని రోజులకు నాపై రాళ్లు విసిరారు. నా పక్కన ఉన్న ఏ ఒక్కరూ దాన్ని చూసి స్పందించలేదు.
తప్పంతా నాదేనా?
మా టీచర్‌కు చెప్తే.. ఇదంతా నీవల్లే.. అని తప్పంతా నామీద వేసింది. వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటున్నావ్.. లూజ్ బట్టలు ధరించట్లేదు. జుట్టుకు నూనె పెట్టి దువ్వుకోకుండా హెయిర్ లీవ్ చేస్తున్నావ్.. అందుకే ఇవన్నీ అని చెప్పింది. ఒకసారైతే స్కూల్ రిక్షా కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వీళ్లంతా ఎందుకిలా చేస్తున్నారు? నిజంగా నేనేమైనా తప్పు చేశానా? అని కొన్నేళ్లపాటు నాలో నేనే బాధపడ్డాను.
బ్రేకుల వైర్లు కట్
11వ తరగతికి వచ్చేసరికి స్కూటీ బ్రేకుల వైర్లు కట్ చేశారు. బ్రేకులు పడకపోవడంతో నన్ను నేను కాపాడుకోవడానికి స్కూటీపై నుంచి జంప్ చేశాను. ఎంతో గాయపడ్డాను. అప్పుడు కూడా మా క్లాస్ టీచర్..జీన్స్ వేసుకుని స్కూటీపై రావడం వల్ల నిన్ను లూజ్ క్యారెక్టర్ అనుకుంటున్నారు, అందుకే ఇలా చేస్తున్నారంది. శారీరకంగా, మానసికంగా గాయపడ్డాను.
ఆయనపైనా కుళ్లు జోకులు
ఏది జరిగినా నా తప్పే అంటున్నారు. మన దేశం కోసం రెండు యుద్ధాల్లో పాల్గొన్న మా తాతయ్య (రిటైర్డ్ కల్నల్) నన్ను తిరిగి స్కూలుకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆయనపైనా అబ్బాయిలు కుళ్లు జోకులు వేశారు. వారిని చూసి అసహ్యించుకుని సైలెంట్‌గా ముందుకు కదిలాడు. జరిగే ప్రతిదానికి మనమే బాధ్యులం కాదు. అని సెలీనా సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది.
సినిమాలు..
2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సూర్యం మూవీలో యాక్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment