Umair Sandhu Controversial Comments On Celina Jaitley On Twitter, Tweets Goes Viral - Sakshi
Sakshi News home page

నోర్మూయ్‌.. డైరెక్టర్‌ ఆఫీసులో ఒంటి మీద దుస్తుల్లేకుండా నిలబడలేదా?: నటిపై క్రిటిక్‌ దారుణ వ్యాఖ్యలు

Apr 12 2023 6:52 PM | Updated on Apr 12 2023 7:59 PM

Umair Sandhu Comments On Celina Jaitley On Twitter - Sakshi

ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డైరెక్టర్‌ ఫిరోజ్‌ ఖాన్‌ ముందు ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడలేదా? సమాధానం చెప్పు.. 2006, 2007 సంవత్సరాల్లో ముంబైలో నువ్వొక

ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ అని చెప్పుకునే ఫిలిం క్రిటిక్‌ ఉమైర్‌ సంధు రోజుకో బ్రేకింగ్‌ న్యూస్‌ వదులుతాడు. ఆ హీరోకు పెళ్లైనా అఫైర్లు ఉన్నాయని, ఈ హీరోయిన్‌ కాల్‌ గర్ల్‌ అని, వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, ఛాన్సులకోసం సదరు నటి చాలామందితో బెడ్‌ షేర్‌ చేసుకుందని, కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌, మందు తీసుకున్నారని ఇలా రోజుకో పుకారు సృష్టిస్తుంటాడు. కొందరు దీన్నీ చూసీచూడనట్లు వదిలేస్తారు. మరికొందరేమో అతడు అనే మాటలను తట్టుకోలేక రియాక్ట్‌ అవుతారు. తాజాగా అదే పని చేసింది బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ.

'సెలీనా.. తండ్రీకొడుకులైన ఫిరోజ్‌ ఖాన్‌, ఫర్దీన్‌ ఖాన్‌లతో శారీరకంగా చాలాసార్లు కలిశారు' అని ట్వీట్‌ చేశాడు ఉమైర్‌. దీనిపై మండిపడ్డ నటి.. 'మీకు ఏదో సమస్య ఉందనుకుంటా.. ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్లండి. ఇలాంటివారిపై ట్విటర్‌ చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్‌ చేసింది. తనపైనే ఎదురుదాడి చేయడంతో ఉడుక్కున్న ఉమైర్‌.. నటి గురించి అసభ్యంగా మాట్లాడుతూ వరుస ట్వీట్లు చేశాడు.

'నోర్మూయ్‌.. నువ్వొక సీ గ్రేట్‌ నటివి. అన్నీ సాఫ్ట్‌​ పోర్న్‌ సినిమాలే చేశావు. తర్వాత బాగా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయావు. స్వార్థపరురాలా. ట్విటర్‌.. ఈ సైకో నన్ను వేధిస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోండి. అయినా 2003లో జనాషీన్‌ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డైరెక్టర్‌ ఫిరోజ్‌ ఖాన్‌ ముందు ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడలేదా? సమాధానం చెప్పు.. పైగా నాకు ఏదో రోగం ఉందంటున్నావ్‌. నువ్వు నాతో బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌ కదా అప్పుడే ఆ సమస్య వచ్చింది. 2006, 2007 సంవత్సరాల్లో ముంబైలో నువ్వొక ఫేమస్‌ నైట్‌ గర్ల్‌వి. సీ గ్రేడ్‌ భోజ్‌పురి నటివైన నీకు నా ట్వీట్‌తో పబ్లిసిటీ వచ్చింది. అందుకు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పాలి' అని పేర్కొన్నాడు. వీరి మధ్య జరిగిన వార్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.


క్రిటిక్‌ ఉమైర్‌ సంధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement