
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అతితక్కువ కాలంలోనే పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలె ఆమె హిందీలో నటించిన డాక్టర్ జీ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది.
ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ప్రీత్‌కి సంబంధించన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 2011లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్న రకుల్‌కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్ స్పందిస్తూ.. ఈ విషయం తెలియగానే నేను షాక్ అవుతాను. వెంటనే అతన్ని చెంపదెబ్బ కొడతాను. కానీ తర్వాత ఆలోచిస్తాను.
అతని అతని నిర్ణయం అని గౌరవిస్తాను. అదే దారిలో తను వెళ్లాలనుకుంటే నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు సంబంధించినంత వరకు నేను చాలా ముక్కుసూటిగా ఉండేందుకు ఇష్టపడతాను అంటూ ఆమె బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment