హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లి ఫిక్స్.. కాబోయే భర్త ఎవరో తెలుసా? | Actress Rakul Preet Singh To Have Destination Wedding In Goa On February | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి.. అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్!

Published Mon, Jan 1 2024 10:05 AM | Last Updated on Mon, Jan 1 2024 10:49 AM

Actress Rakul Preet Singh Destination Wedding In Goa On February - Sakshi

2023 నవంబరు-డిసెంబరులో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మెగాహీరో వరుణ్ తేజ్‌తో పాటు పలువురు సీరియల్ బ్యూటీస్ కూడా ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా మ్యారేజ్‌‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్, డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. 

దిల్లీకి చెందిన ఈ బ్యూటీ.. 2009లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే తెలుగు మూవీతో ఈమె కెరీర్ పరంగా బ్రేక్ అందుకుంది. దీంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలానే తెలుగులో స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేసింది.

(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)

ప్రస్తుతం రకుల్‌కి తెలుగు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. హిందీలో ఒకటో రెండో మూవీస్ చేస్తోంది. వ్యక్తిగత విషయానికొస్తే 2021లో తన ప్రియుడ్ని అందరికీ పరిచయం చేసింది. ఇతడి పేరు జాకీ భగ్నానీ. బాలీవుడ్‌లో నిర్మాతగా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. 

అయితే 2024 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి పీటలెక్కనుందని సమాచారం బయటకొచ్చింది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. ఈ ఫిబ్రవరి 22న గోవా వేదికగా రకుల్ ప్రీత్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? మిగతా విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement