
‘‘చిత్ర పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. అలాగే కొన్ని సినిమా అవకాశాలు కోల్పోయాను’’ అన్నారు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. బంధుప్రీతి గురించి ఎదురైన ఓ ప్రశ్నకు రకుల్ సమాధానం ఇస్తూ– ‘‘సినిమా రంగంలో బంధుప్రీతి ఉన్న మాట నిజమే.
ఈ నెపోటిజం కారణంగా కొన్ని సినిమా చాన్స్‌లు మిస్ అయ్యాను. నన్ను సంప్రదించి ఆ తర్వాత మరొకరిని తీసుకున్నారు. అయితే అవి నాకు దక్కలేదని బాధ పడలేదు. అవకాశాలు కోల్పోవడం కూడా జీవితంలో ఓ భాగమే. వాటి గురించి ఆలోచించి టైమ్ వృథా చేసుకోను. ఏం చేస్తే నేను ఎదుగుతానో దానిపైనే శ్రద్ధ పెడతాను. ఒక స్టార్ కిడ్‌కు లభించినంత ఈజీగా మిగతా వారికి అవకాశాలు రావు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment