టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిత్రపరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడారు. చిత్రపరిశ్రమ ఏదైనా సరే అక్కడ నెపోటిజం అనే పదం తప్పనిసరిగా వింటూనే ఉంటాం. ఇప్పటికే దీని గురించి చాలామంది నటీనటులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎలాంటి సినీనేపథ్యం లేకుండానే రకుల్ పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, నెపోటిజం వల్ల చాలా సినిమా అవకాశాలు పోగొట్టుకున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో మెప్పించి ఆపై బాలీవుడ్‌లో కూడా భారీ సినిమాల్లో రకూల్ నటించారు. టాప్ హీరోయిన్‌గా కొనసాగిన రకూల్ కూడా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్లు ఇలా చెప్పుకొచ్చారు. 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయాను. అరే, అవకాశాలు కోల్పోయానే అనే బాధ నాలో ఉండదు. అలా అని నేను కూర్చుని ఉండిపోయే వ్యక్తిని కాదు. బహుశా ఆ సినిమాలు నా కోసం ఉద్దేశించినవి కాకపోవచ్చని ముందుకు వెళ్తాను.
ఇదీ చదవండి: 'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్
నా తండ్రి సైన్యంలో పనిచేయడంతో ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. దీంతో ఇలాంటి చిన్నవాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. అవకాశాలు కోల్పవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది. అలాంటప్పుడు దక్కని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఉన్న సమయాన్ని వృథా చేసుకోను. ఒక స్టార్ కిడ్‌కు సులభంగా ఛాన్సులు వచ్చినట్లు కొత్తవారికి మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ రావు. ఆ క్రెడిట్ అంతా వారి తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది. అని రకుల్ చెప్పుకొచ్చారు.
రకుల్ తెలుగులో చివరి సినిమా కొండపొలం. 2021లో ఈ మూవీ విడుదలైంది. రీసెంట్‌గా భారతీయుడు2లో ఆమె కనిపించారు. ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌తో 'దే దే ప్యార్ దే 2'లో నటిస్తున్నారు. మేరీ పట్నీ కా రీమేక్ చిత్రంతో పాటు భారతీయుడు-3 ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి.
ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో నటి హేమ పేరు
Comments
Please login to add a commentAdd a comment