ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలిచిన అమ్మాయి అనగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మనసులలో ఒకటే నామం, ఒకటే రూపం కదలాడుతోంది. మది మదిన సంచరిస్తున్న ఆమే మానస వారణాసి. ఈ భారతీయ సుందరికి డ్రెస్ డిజైన్స్ చేసినవారిలో హైదరాబాదీ డిజైనర్ శ్రవణ్‌కుమార్ ఉన్నారు. మానస వారణాసి సంప్రదాయ, ఇండోవెస్ట్రన్ స్టైల్ వేషధారణ గురించి ఈ డిజైనర్ చెప్పిన వివరాలు. డ్రెస్ డిజైన్స్.
మిస్ ఫ్యాషన్ కూడా...
తెలుగు అమ్మాయిల్లో అరుదైన అందం మానసది. తనకు నేను పలు మార్లు డిజైన్స్ అందించాను. తను బాగా ఫ్యాషన్ స్పృహ ఉన్న అమ్మాయి. ఇండియన్, వెస్ట్రన్, అఫిషియల్, ఫార్మల్... ఇలా ఏ డ్రెస్ అయినా బాగా క్యారీ చేయగలదామె. తను తప్పకుండా మిస్ వరల్డ్ అవుతుంది. ఎందుకంటే... ఆమె ఇండియన్ బ్యూటీ, టెక్నికల్ ఇండియన్ బ్యూటీ... ప్యూర్ ఇండియన్ బ్యూటీ... రైట్ బాడీ, రైట్ యాటిట్యూడ్ లతో నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
– శ్రవణ్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్
టమరీ గాడీగా కాకుండా రెండు రంగులతో చేసిన మ్యాజిక్ వినూత్న అందాన్ని తీసుకువచ్చింది. బంగారు రంగు పెద్ద అంచు ఉన్న వంగపండు లెహంగా అదే రంగు బ్లౌజ్, దుపట్టా, లెహంగాకు సెట్ టాజిల్స్.. ఓ ప్రత్యేక ఆకర్షణ.
టవెస్ట్రన్ జంప్‌సూట్ నుంచి డిజైన్ చేసిన మోడల్ డ్రెస్. మేని రంగును డ్రెస్ రంగు మరింతగా ఎలివేట్ చేస్తుంది.
టవెస్ట్రన్ షార్ట్ గౌన్‌కి ఇండియన్ సంప్రదాయ చీర అంచు మరింత అందాన్ని తీసుకువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment