
Shivani Rajashekar About Her Miss India Selection: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు మోడల్‌గా మిస్ ఇండియా పోటీల్లో రాణిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న జరిగిన ఈ పోటీలో శివాని మిస్ తమిళనాడుగా ఎంపికైంది. దీంతో ఆమెను విమర్శలు చుట్టుముట్టాయి. తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడుకు రిప్రజెంట్ చేయడమేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై తాజాగా స్పందించింది ఆమె. తన తండ్రి రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శివాని మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీపై స్పందించింది. ‘తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలనుకున్నాను. అయితే నిర్వాహకులు అప్లికేషన్‌లో మల్టిపుల్ అప్షన్స్ ఇచ్చారు. దీంతో నేను తమిళనాడును కూడా అప్షన్‌గా పెట్టా. ఎందుకంటే నేను పుట్టింది చెన్నైలోనే కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడును కూడా అప్షన్‌లో ఇచ్చాను.
చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి
కానీ, పోటీ నిర్వాహకులు నన్ను తమిళనాడు కేటగిరి నుంచి ఎంపిక చేశారు. అందువల్ల ‘మిస్ తమిళనాడు’గా ఎంపికయ్యా’ అని వివరించింది. అయితే ఓ తెలుగు అమ్మాయిగా ఈ రెండు రాష్ట్రాల నుంచి తనను ఎంపిక చేసి ఉంటే మరింత సంతోషపడే దాన్ని అని, తమిళనాడు కూడా తనకు సొంత రాష్ట్రం వంటిదేనని పేర్కొంది. అన్నింటినీ మించి తాను భారత దేశాన్ని రిప్రజెంట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానని శివాని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment