miss india contest
-
Miss India: మిస్ తమిళనాడుగా శివాని, వివరణ ఇచ్చిన హీరోయిన్
Shivani Rajashekar About Her Miss India Selection: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరోవైపు మోడల్‌గా మిస్ ఇండియా పోటీల్లో రాణిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న జరిగిన ఈ పోటీలో శివాని మిస్ తమిళనాడుగా ఎంపికైంది. దీంతో ఆమెను విమర్శలు చుట్టుముట్టాయి. తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడుకు రిప్రజెంట్ చేయడమేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: ప్రశాంత్ నీల్ మీకు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై తాజాగా స్పందించింది ఆమె. తన తండ్రి రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివాని మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీపై స్పందించింది. ‘తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలనుకున్నాను. అయితే నిర్వాహకులు అప్లికేషన్లో మల్టిపుల్ అప్షన్స్ ఇచ్చారు. దీంతో నేను తమిళనాడును కూడా అప్షన్‌గా పెట్టా. ఎందుకంటే నేను పుట్టింది చెన్నైలోనే కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడును కూడా అప్షన్లో ఇచ్చాను. చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి కానీ, పోటీ నిర్వాహకులు నన్ను తమిళనాడు కేటగిరి నుంచి ఎంపిక చేశారు. అందువల్ల ‘మిస్ తమిళనాడు’గా ఎంపికయ్యా’ అని వివరించింది. అయితే ఓ తెలుగు అమ్మాయిగా ఈ రెండు రాష్ట్రాల నుంచి తనను ఎంపిక చేసి ఉంటే మరింత సంతోషపడే దాన్ని అని, తమిళనాడు కూడా తనకు సొంత రాష్ట్రం వంటిదేనని పేర్కొంది. అన్నింటినీ మించి తాను భారత దేశాన్ని రిప్రజెంట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానని శివాని చెప్పుకొచ్చింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1621343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్రియేటివ్ డైరెక్టర్ నుంచి మిసెస్ ఇండియాగా..
అందాల పోటీలు అంటేనే యువత, టీనేజ్ అమ్మాయిలు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లైన మహిళలు సైతం అందాల పోటీల్లో టీనేజ్ అమ్మాయిలకు పోటీని ఇస్తున్నారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేసేందుకు ఎన్నో వేదికలు సిద్దంగా ఉన్నాయి. అలాంటి వాటిలో హాట్ మాండే మిసెస్ ఇండియా ఒకటి. ఇటీవల ఈ వేదికపై మిసెస్ ఇండియాగా పోటీల్లో పాల్గోన్న తెలుగమ్మాయి స్వాతి పాల ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే అందాల పోటీల్లో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా శారీరక, మానసిక సామర్థ్యం, సమయస్ఫూర్తి ఆధారంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారు. అలాగే స్వాతిలో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇన్నర్ బ్యూటీ అని కూడా అనిపించుకుంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్ట పొందిన ఆమె సృజనాత్మకతపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. టీవీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా కేరీర్ ప్రారంభించిన స్వాతి విద్య అనే పేరుతో షార్ట్ ఫిలీం తీసి ప్రశంసలు అందుకుంది. అంతేగాక స్వచ్చభారత్పై కొన్ని వీడియోలు తీసి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక పెళ్లయ్యాక పిల్లలకోసం కోన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె.. సేవారంగంపై మెగ్గుచూపింది. నావికాధికారి భార్యగా నేవి భార్యల సంక్షేమం కోసం‘ఎన్డబ్ల్యుడబ్ల్యుఏ’ అనే పేరుతో సంఘాన్ని స్థాపించి అందులో కీలకంగా వ్యవహిరిస్తోంది. అంతేగాక పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పేరుతో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 15వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. -
ఓటు వేయండి.. కిరీటం గెలుస్తా
పంజగుట్ట: కర్ణాటక, బీదర్ జిల్లాల్లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌కు పోటీ పడుతోంది. యూట్యూబ్‌లో ఓటు వేసి తనను గెలిపిస్తే టైటిల్ తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆమే నిషా తాలంపల్లి. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన వివరాలు వెల్లడించింది. బీదర్ జిల్లాలోని దుమున్‌సూర్ గ్రామానికి చెందిన నిషా తాలంపల్లి తల్లి బిందుమతి గృహిణి, తండ్రి శ్రీనివాస్ వ్యవసాయం చేస్తాడని, ప్రముఖ సినీనటి ప్రియాంకా చోప్రాను ఆదర్శంగా తీసుకుని మోడలింగ్‌లోకి వచ్చానని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో పలు పోటీల్లో విజేతగా నిలిచినట్టు వివరించింది. తాను నవంబర్ 18న ఇండోనేసియాలోని రాజధాని జకర్తాలో జరిగే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఫైనల్స్‌కి సిద్ధమవుతున్నానని, దేశవ్యాప్తంగా 9 వేల దరఖాస్తులు రాగా వాటి నుంచి 30 మందిని ఎంపిక చేశారని, తాను అందులో చోటు దక్కించుకున్నానని వివరించింది. ఈ పోటీలో గెలిచేందుకు తనకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మద్దతు తప్పనిసరిగా పేర్కొంది. యూట్యూబ్, గూగుల్‌లో తన పేరు టైప్ చేసి లైక్ కొడితే పాయింట్లు వస్తాయని, ఒక్కో పాయింట్ తనను కిరీటం వైపు తీసుకెళుతుందని వివరించింది. ఈ సమావేశంలో నిషా తండ్రి శ్రీనివాస్ తాలంపల్లి, శ్రేయోభిలాసులు బాసు హిలాల్‌పూర్, రామకృష్ణారెడ్డి, ధర్మేందర్ పూజారి, అనిల్ పాటిల్ పాల్గొన్నారు. -
మిస్ ఇండియాగా సుమన్ రావ్
ముంబై: రాజస్తాన్‌కు చెందిన సీఏ విద్యార్థిని మిస్ ఇండియా–2019 విజేతగా నిలిచారు. ముంబైలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. పరిస్థితులు ఎప్పటికీ చేజారవని, తనలాగే కలలు కంటున్న ఇతర మహిళలు భయపడకుండా కలలను సాకారం చేసుకోవచ్చన్న నమ్మకం ఈ టైటిల్ అందుకోవడం ద్వారా కలిగిందన్నారు. తన కుటుంబం, మిత్రులతో సంబరాలు జరుపుకోవడానికి వేచి ఉండలేకపోతున్నానని అన్నారు. డిసెంబర్లో బ్యాంకాక్‌లో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇంజినీర్ శివాని జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియాగా నిలిచారు. బిహార్‌కు చెందిన మేనేజ్మెంట్ విద్యార్థిని శ్రేయా శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్‌గా నిలిచారు. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ ద్వయం ఫాల్గుని షేన్ పీకాక్, మిస్ వరల్డ్ 2018 వెనెస్సా పొన్కా డి లియోన్, నటులు హుమా ఖురేషి, చిత్రాంగ సింగ్, ఆయుష్ శర్మ, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత రెమో డి సౌజా, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఫుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రితో కూడిన బృందం విజేతలను ఎంపిక చేసింది. ఎంటెక్ చదువుతున్న సంజన... తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. దీనితోపాటు మిస్ తెలంగాణ 2019 టైటిల్‌ను అందుకున్నారు. ఈమె యూపీలోని అమితీ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో ఎం.టెక్ చదువుతున్నారు. -
ఈసారి బికినీ రౌండ్ ఉండదట!
ఫెమినా మిస్ ఇండియా పోటీలంటే అందులో పాల్గొనేవాళ్లతో పాటు చూసేవాళ్లు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఈ పోటీలతో యువతుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం, మొదటి మూడుస్థానాలు పొందినవారితో పాటు.. పోటీలో పాల్గొన్న అందరికీ కూడా మోడలింగ్ అవకాశాలు విస్తృతంగా రావడంతో వీటికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఈసారి ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా పోటీలలో మాత్రం ఆడిషన్ సమయంలో బికినీ రౌండ్ ఉండబోదని ప్రకటించారు. ఈ విషయాన్ని వాళ్లు తమ అధికారిక వెబ్సైట్లో తెలిపారు. సైట్లో పాల్గొనేవారికి అర్హతలను పేర్కొన్నప్పుడు.. అక్కడే ఈ సంగతి కూడా పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనేవాళ్లు 5 అడుగుల ఆరు అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ పొడవుతో ఉండాలని, అలాగే 2017 డిసెంబర్ 31 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు కలిగినవారై ఉండాలని, పెళ్లి గానీ, నిశ్చితార్థం గానీ అయి ఉండకూడదని తెలిపారు. దాంతోపాటు భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉండాలని చెప్పారు. ఉద్యోగం, నివాసం, చదువు లేదా మరేదైనా అవసరాల కోసం దేశం వెలుపల ఆరు నెలలుగా ఉన్నవాళ్లు భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉంటే వాళ్లు కూడా అర్హులేనన్నారు. ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు కూడా భారతీయ పౌరులలాగే లెక్కలోకి వస్తారన్నారు. ఓసీఐ కార్డుదారులు టైటిల్ గెలుచుకోడానికి వీలుండదు గానీ, రెండు లేదా మూడోస్థానాలకు అర్హులని చెప్పారు. ఇతర అంతర్జాతీయ అందాల పోటీలకు కూడా అర్హులవుతారన్నారు. ఆడిషన్స్ సమయంలో జరిగే బికినీ రౌండ్ ఉండదన్నారు.