అందాల పోటీలు అంటేనే యువత, టీనేజ్ అమ్మాయిలు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లైన మహిళలు సైతం అందాల పోటీల్లో టీనేజ్ అమ్మాయిలకు పోటీని ఇస్తున్నారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేసేందుకు ఎన్నో వేదికలు సిద్దంగా ఉన్నాయి. అలాంటి వాటిలో హాట్ మాండే మిసెస్ ఇండియా ఒకటి. ఇటీవల ఈ వేదికపై మిసెస్ ఇండియాగా పోటీల్లో పాల్గోన్న తెలుగమ్మాయి స్వాతి పాల ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే అందాల పోటీల్లో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా శారీరక, మానసిక సామర్థ్యం, సమయస్ఫూర్తి ఆధారంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారు. అలాగే స్వాతిలో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇన్నర్ బ్యూటీ అని కూడా అనిపించుకుంటుంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్ట పొందిన ఆమె సృజనాత్మకతపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. టీవీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా కేరీర్ ప్రారంభించిన స్వాతి విద్య అనే పేరుతో షార్ట్ ఫిలీం తీసి ప్రశంసలు అందుకుంది. అంతేగాక స్వచ్చభారత్‌పై కొన్ని వీడియోలు తీసి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక పెళ్లయ్యాక పిల్లలకోసం కోన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె.. సేవారంగంపై మెగ్గుచూపింది. నావికాధికారి భార్యగా నేవి భార్యల సంక్షేమం కోసం‘ఎన్‌డబ్ల్యుడబ్ల్యుఏ’ అనే పేరుతో సంఘాన్ని స్థాపించి అందులో కీలకంగా వ్యవహిరిస్తోంది. అంతేగాక పర్‌ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పేరుతో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 15వేల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment