
ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల కోసం ఎంతగానో కష్టపడింది శివానీ రాజశేఖర్. ఇటీవలే మిస్ తమిళనాడుగానూ ఎంపికైంది. మరికొన్ని రోజుల్లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం లేకపోలేదు.
ఇటీవల శివానీ మలేరియా బారిన పడింది. దాంతో మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్ మిస్ అయింది. అంతేకాదు, అనారోగ్యంతో తను మరింత సన్నబడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తన మెడికల్ థియరీ పరీక్షలు కూడా మొదలయ్యాయని, మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే రోజు అంటే జూలై 3న తనకు ఎగ్జామ్ ఉందని తెలిపింది. ఈ పరీక్ష మిస్ అవ్వకూడదనే ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేసింది.
దీంతో చదువు కోసం అంత పెద్ద త్యాగం చేస్తున్న శివానీని కొందరు అభినందిస్తుంటే, అంత మంచి అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంటున్నావని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివానీ.. అద్భుతం, శేఖర్ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం తన పరీక్షల మీద పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఎగ్జామ్స్ పూర్తవగానే రాజ్ తరుణ్‌తో కలిసి వెబ్ సిరీస్‌లో నటించనుంది.
చదవండి: శాస్త్రవేత్తపై దోశద్రోహి కేసు.. 50 రోజులు జైల్లో నరకం.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment