Shivani Rajasekhar Has Top 8 Place In Femina Miss India 2022, Details Inside - Sakshi
Sakshi News home page

Shivani Rajasekhar: ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో దూసుకెళ్తున్న శివాని రాజశేఖర్‌

Published Wed, Apr 20 2022 9:34 PM | Last Updated on Thu, Apr 21 2022 7:58 AM

Shivani Rajasekhar Has Top 8 Place In Miss India 2022 - Sakshi

Shivani Rajasekhar Has Top 8 Place In Miss India 2022: సీనియర్‌ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఫెమినా మిస్‌ ఇండియా 2022 పోటీలో పాల్గొననున్నట్లు తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నేను కొత్త సాహసం చేస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిస్‌ ఇండియా ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి. ఆల్‌ ది బెస్ట్‌ టు ది లవ్‌లీ లేడీస్‌' అంటూ రాసుకొచ్చింది.

అలాగే శివాని రాజశేఖర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి టాప్‌ 8 ఫైనలిస్టులో ఉంది. తాను ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు ఇన్‌స్టాలో వెల్లడించింది. శివాని రాజశేఖర్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించగా.. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఈ ఫైనలిస్టులో ఉన్నారు. 2021లో తేజ సజ్జా నటించిన అద్భుతం చిత్రంతో శివాని రాజశేఖర్‌ వెండితెరకు పరిచయమైంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement