Femina Miss India
-
గ్యాప్ కాదు.. ప్రిపరేషన్..
ఫ్యాషన్ షోలో దేవకీనందన వాసుదేవ ఫేమ్ నటి, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్తెలుగు సినిమా ఇండస్ట్రీ సొంత ఇల్లు. నా మనసు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుందని దేవకీనందన వాసుదేవ ఫేమ్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె సాక్షితో ముచ్చటించారు. 2020లో మిస్ ఇండియాగా ఎంపికయ్యాను. 2024లో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చా. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారని పలువురు అంటున్నారు.. అయితే ఇది గ్యాప్ కాదు.. నాకు ప్రిపరేషన్‌లా అనిపిస్తోంది. ముంబై నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ప్యాషన్ ఎప్పుడూ సినిమాపైనే. మొన్ననే దేవకీనందన వాసుదేవ రిలీజ్ అయ్యింది. చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వివిధ రకాల థీమ్స్ వస్త్రాలతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. డిజైనర్ అర్జెంటుమ్ ఆర్ట్స్ రాజ్ దీప్ రణవ్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీ రెడ్డి, వస్త్రలేఖ, మంగళగౌరి, ఆదరణ, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, యక్షి దీప్తి రెడ్డి, అంజలీ, అర్జున్ కపూర్ ప్రముఖ డిజైనర్స్‌కు చెందిన కలెక్షన్లు, ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, సీరత్ కపూర్, ప్రజ్ఞ అయ్యగారి, మాళవిక మోహన్, నేహా శెట్టి షో టాపర్స్‌గా మెరిశారు. ఈ మోడల్ షోలో 16 మంది డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ ర్యాంపుపై సందడి చేశారు. -
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికితా పోర్వాల్ (ఫొటోలు)
-
మిస్ ఇండియా మిస్సవ్వదు..
బ్యూటీ పేజెంట్స్, ఫ్యాషన్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం, సౌందర్యం మాత్రమే కాదని.., నిత్య జీవితంలో మన ఆలోచనా విధానం, సామాజిక అవగాహన, మానవీయ విలువలు తదితర అంశాలతో సంపూర్ణ వ్యక్తిత్వమే ‘మిస్ క్రౌన్’కు ఎంపిక చేస్తాయని తెలుగు రాష్ట్రాల నుంచి ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టులు ప్రకృతి, భవ్య రెడ్డి తెలిపారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్, లండన్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ వీక్, లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన ప్రముఖ సంస్థ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్ ఆధ్వర్యంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రకృతి కంభం, ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ భవ్య రెడ్డిలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీల్లో ఈ ఇరువురూ తెలుగు రాష్ట్రాల తరపున పోటీ పడనున్న నేపథ్యంలో ఫ్యాషన్, అందం, లైఫ్‌స్టైల్ తదితర అంశాలపై వారి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ఈ రంగంలో రాణించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఇరువురినీ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్ సెంటర్ డైరెక్టర్ సంజయ్ సరస్వత్ ప్రత్యేకంగా అభినందించారు. డ్రెస్‌లు వ్యక్తిత్వానికి ప్రతీక కాదు.. దక్షిణాది అమ్మాయిలకు బ్యూటీ పేజెంట్స్‌లో గుర్తింపు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలున్న అమ్మాయిలు రాణిస్తున్నారు. యువతలో పరిపక్వత పెరిగింది. కానీ అవగాహన పెరగాలి. పిల్లలు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి చూపిస్తుంటే ఇబ్బందిగా భావిస్తున్నారు. మంచి చెడులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. కానీ ఫ్యాషన్, మోడలింగ్, సినిమాలు అనే సరికి సమాజం సులభంగా జడ్జ్ చేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్‌లు మా వ్యక్తిత్వానికి ప్రతీక కాదు. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి రాగలిగాము. మా సోషల్ మీడియా అకౌంట్స్‌లో చూస్తే తెలుస్తుంది.. సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తున్నామనేది. నార్త్ ష్యాషన్ ఔత్సాహికులను సైతం హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది. దక్షిణాదిలో సృజనాత్మకత, ఐడియాలజీ, నైపుణ్యాలను వారు అద్భుతంగా వాడుకుంటారు. అదే రీతిలో మనవారినీ ప్రోత్సహించాలి. ఈ రంగంలో బాహ్య, అంతర సౌందర్యం రెండూ ముఖ్యమే. మన రంగూ, రూపు మాత్రమే విజేతగా నిలబెట్టలేవు. ఆలోచనా విధానం, అవగాహన ఇందులో కీలకాంశాలు. – ప్రకృతి కంభం.అలాంటి రోజులు రావాలి..ఈ రోజు సెషన్లో ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికులు.. వారి ప్రయాణాన్ని తమ కుటుంబ సభ్యులే ఒప్పుకోవట్లేదని, ఫ్యాషన్, మోడలింగ్ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని వారిస్తున్నారు. కానీ మాలాంటి అవగాహన, పరిపక్వత, నైపుణ్యాలు ఉన్న అమ్మాయిలు దొరకడం వారి అదృష్టం అని తెలుసుకునే రోజులు రావలి. వ్యవస్థనో, ఫ్యాషన్ పరిశ్రమపై పడిన ముద్ర మమ్మల్ని డిసైడ్ చేయలేవు. కళాత్మకత, సేవ, విద్య, సామాజిక విలువలు తదితర అంశాల్లో మేమెంతో ఉన్నతంగా ఆలోచిస్తాం. కెమెరా, వీఎఫ్ఎక్స్, డైరెక్షన్, సినిమాలు, యాక్టింగ్ అంటూ బాలీవుడ్ వరకూ ఎందరో నగరానకి వస్తున్నారు. కొందరి లోపాలు ఎంచుకుని పరిశ్రమను నిర్ధారిస్తున్నారంటే అది అవగాహనా లోపమే. అందుకే ఎంతో ఇష్టమున్నా రాణించలేకపోతున్నారు. పరిమితులు లేకుండా నచ్చగలిగింది చేయగలిగినప్పుడే మహిళా సాధికారత వస్తుంది. ఒకప్పటిలా స్టిగ్మా లేకపోయినప్పటికీ, పూర్తిగా లేదు అనలేము. గతంలో ఒక ఆటో డ్రైవర్ కూతురు సైతం విజేతగా నిలిచిన సందర్భాలున్నాయి. పోటీలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్‌గా స్థిరంగా ఉంటూ, గ్లోబల్ వేదికపై సత్తా చాటడానికి వినూత్నంగా ప్రయతి్నస్తున్నాం. దేశంలో ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇండియా వేదికలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయి. సాధారణంగా జరిగే పేజెంట్‌లో పాల్గొనే సమయంలో ఇంతకు ముందు విజేతల ప్రొఫైల్స్ తప్పకుండా గమనించాలి. – భవ్య రెడ్డి -
Prakruthi Kambam: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.జీవితం నేర్పిన పాఠాలు..నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు. మల్టీ క్వీన్...నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్‌తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్‌గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్‌తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.25 ఏళ్ల వయసులో..ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్‌లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి. -
మిస్ ఇండియా పోటీలకు గ్రామీణ రైతుబిడ్డ గోమతిరెడ్డి
ఓబులవారిపల్లె: గ్రామీణ రైతుబిడ్డ జాతీయ స్థాయి అందాల పోటీలకు ఎంపికైంది. తన అందం, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మిస్ ఆంధ్రాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో నిర్వహించనున్న మిస్ ఇండియా పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా శ్రీనివాసులరెడ్డి, అరుణకుమారి దంపతుల ఏకైక కుమార్తె ముక్కా గోమతిరెడ్డి మార్చి 5వ తేదీన ముంబైలో నిర్వహించనున్న ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గోమతిరెడ్డి చిన్ననాటి నుంచి పాఠశాలల్లో బెస్ట్ బేబి తదితర పోటీల్లో రాణిస్తూ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేందుకు అన్ని విధాల సహకారం అందించారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అందాల పోటీల్లో గెలుపొందింది. అనంతరం బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అక్కడితో అగిపోకుండా మోడలింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి, 25వ తేదీన ముంబైలో నిర్వహించిన ఫెమీనా మిస్ అంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో మిస్ ఇండియా పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్న గోమతిరెడ్డి... మిస్ వరల్డ్ సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. తల్లిదండ్రుల సహకారంతో ఏదైనా సాధించవచ్చనే లక్ష్యంతో ముందుకువెళుతున్నానని, తన గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పింది. -
బిగ్‌బాస్ భామల సందడి (ఫొటోలు)
-
మిస్ ఇండియా 2022: తుళు సౌందర్యానికి మరో కిరీటం
ఐశ్వర్యా రాయ్... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది. 21 ఏళ్ల సిని శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ‘మిస్ ఇండియా 2022’ కిరీటాన్ని గెలుచుకుంది. చూడబోతే తుళు స్త్రీల శిరస్సులు అందాల కిరీటాల కోసమూ వారి అధరాలు విజయ దరహాసాల కోసమూ పుడుతున్నట్టున్నాయి. ఆదివారం ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. రాజస్థాన్‌కు చెందిన రుబుల్ షెకావత్ మొదటి రన్నర్ అప్‌గా నిలువగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచింది. భారీ హైబ్రిడ్ ఈవెంట్ నేరుగా జరిగే ఈవెంట్లో ఆన్లైన్ ద్వారా కూడా కొందరు ప్రాతినిధ్యం వహిస్తే అలాంటి ఈవెంట్‌ని ‘హైబ్రిడ్ ఈవెంట్’ అంటారు. అంటే డైరెక్ట్‌గా వర్చువల్‌గా కూడా జరిగే ఈవెంట్ అన్నమాట. ‘మిస్ ఫెమినా ఇండియా 2022’ ఈవెంట్ కూడా ఈ విధంగానే జరిగింది. జూరీలో నేహా దూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్‌తో పాటు మన మిథాలీ రాజ్ కూడా ఉంది. వీరి పరీక్షలన్నింటిని దాటి సిని విజేతగా నిలిచింది. దీని వల్ల ఆమె ఈ సంవత్సరం జరగనున్న 71వ ‘విస్ వరల్డ్’ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. సిని శెట్టి ఎవరు? కర్నాటకలో మూలాలున్న తుళు కుటుంబం నుంచి వచ్చిన సిని శెట్టి 2000 సంవత్సరంలో ముంబైలోనే పుట్టి అక్కడే పెరిగింది. తల్లి పేరు హైమా శెట్టి. సోదరుడు షికిన్ శెట్టి. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే సిని ముందు నుంచి మోడలింగ్ అంటే ఇష్టపడింది. ప్రియాంకా చోప్రా నుంచి స్ఫూర్తి పొంది ఆమెలాగే ఎదగాలనుకుంది. మంచి భరతనాట్యం డాన్సర్. మోడల్. ఇన్‌స్టాలో ఆమె అకౌంట్ దాదాపు 60 వేల మంది ఫాలోయెర్లు ఉన్నారు నిన్న మొన్నటి దాకా (ఇప్పుడు లక్షల్లో మారుతుంది). ఇన్‌స్టాలో సిని చేసే డాన్స్ రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘మాది స్త్రీల విషయంలో సమకాలీన ధోరణి ఉన్న కుటుంబమే అయినా మా సమూహం స్త్రీల విషయంలో సంప్రదాయ విలువల గురించి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఆ విలువలు స్త్రీల విషయంలోనే పట్టింపుతో ఉండటం నేను గమనించాను. స్త్రీ జీవితం అంటే ఏమిటో నాదైన ఒక విలువను వెతుక్కునే ప్రయత్నం చేశాను. నేను ఉండే (మోడలింగ్) రంగంలో స్త్రీలు సంప్రదాయ–ఆధునిక పోకడల మధ్య నలుగుతూ నిలవడం పెద్ద సవాలు. కాని సవాళ్లను ఎదుర్కొనే తత్త్వం వల్లే నేను ఈనాడు ఇక్కడ నిలుచుని ఉన్నాను’ అని సిని అంది. మరిచిపోలేని జ్ఞాపకం ‘మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?’ అని అడిగితే సిని శెట్టి తన భరతనాట్యం అరంగేట్రం గురించి చెప్పింది. ‘నాకు డాన్సంటే చాలా ఇష్టం. అది శరీరాన్ని, ఆత్మను సంలీనం చేస్తుంది. అది ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అందువల్ల నేను ఆరంగేట్రం చేసిన రోజును మర్చిపోలేను. అది నా సంస్కృతితో నేను అనుబంధం ఏర్పరుచుకున్న రోజుగా భావిస్తాను. నా భుజాల నుంచి చెమట కారిపోతున్నా, నా కొప్పుముడిలోని పూసలు ఊడి వేళ్లాడుతున్నా డాన్స్ చేస్తున్నందుకు నా లోలోపల ఉబికిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. మూడు గంటలు ప్రేక్షకుల ముందు డాన్స్ చేసి చివరన భూదేవికి పెట్టిన నమస్కారంతో ధన్యురాలిని అయ్యాను’ అని చెప్పింది సిని. త్వరలో ఆమె ఏదైనా భారీ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. -
ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి (ఫొటోలు)
-
Femina Miss India 2022: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
Karnataka Sini Shetty Crowned Femina Miss India World 2022: మగువల అందాన్ని నిర్వచించలేం. కానీ వారి కురులను కారు మబ్బులుగా, మోమును చంద్రబింబంలా, కళ్లను కలువపూలుగా ఇలా వివిధ రకాలుగా పోల్చగలరు, అభివర్ణించగలరు కవులు. అయితే ఫ్యాషన్ రంగంలో మాత్రం అందాన్ని వివిధ రౌండ్స్ వారీగా అంచనా వేస్తారు. ఈ విభాగాలకు రకరకాల పేర్లు పెట్టి ఒకర్ని మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌గా ఎంపిక చేస్తారు. అలాంటి ఈ ఫ్యాషన్ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేది 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలు. ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి కైవసం చేసుకుంది. అన్నీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సినీ శెట్టి అందంలో విజేతగా నిలిచింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలు ఆదివారం (జులై 3) అట్టహాసంగా ముగిసాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే కనులవిందుగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్స్ నేహా ధూపియా, మలైకా అరోరా, డినో మోరియా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ శియామక్ దావర్, మాజీ క్రికేటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్‌గా వ్యవహరించారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో సినీ శెట్టి విజేత కాగా, రాజస్థాన్‌కు చెందిన రూబల్ శెఖావత్ మొదటి రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. విజేతగా ఎంపికైన తర్వాత 21 ఏళ్ల సినీ శెట్టి మాట్లాడుతూ.. 'ఈ జర్నీని నేనేప్పటికీ మర్చిపోలేను. ఇందులో భాగమై నాకు అడుగడుగునా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని తెలిపింది. సినీ శెట్టి కిరీటాన్ని సోంతం చేసుకోవడం పట్ల ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలతో సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. When dreams turned into reality 👑 . . . . .#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/VmXwWjN7Uz — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Danced for Thalapathy's Vaathi Coming during the DANCES OF INDIA segment in the Miss India Competition last night 🔥💥 . . .#SiniShetty #MissIndiaFinale2022 #ThalapathyVijay𓃵 #Varisu #MissIndia2022 #Thalapathy67 #FeminaMissIndia2022 #Thalapathy66 #LokeshKanagaraj #VaathiComing pic.twitter.com/ZYexh43Qtc — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Thanks for all your lovely wishes 🥺🙏🏼 I hope I made Karnataka proud. Can't wait to start this new journey and make India proud 🇮🇳🤞🏼 Keep showering all your love and blessings and I love y'all ❤️#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/x3oRvXdBa0 — Sini Shetty (@sini_shetty) July 4, 2022 -
మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న శివానీ, ఎందుకంటే?
ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల కోసం ఎంతగానో కష్టపడింది శివానీ రాజశేఖర్. ఇటీవలే మిస్ తమిళనాడుగానూ ఎంపికైంది. మరికొన్ని రోజుల్లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల శివానీ మలేరియా బారిన పడింది. దాంతో మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్ మిస్ అయింది. అంతేకాదు, అనారోగ్యంతో తను మరింత సన్నబడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తన మెడికల్ థియరీ పరీక్షలు కూడా మొదలయ్యాయని, మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే రోజు అంటే జూలై 3న తనకు ఎగ్జామ్ ఉందని తెలిపింది. ఈ పరీక్ష మిస్ అవ్వకూడదనే ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేసింది. దీంతో చదువు కోసం అంత పెద్ద త్యాగం చేస్తున్న శివానీని కొందరు అభినందిస్తుంటే, అంత మంచి అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంటున్నావని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివానీ.. అద్భుతం, శేఖర్ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం తన పరీక్షల మీద పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఎగ్జామ్స్ పూర్తవగానే రాజ్ తరుణ్‌తో కలిసి వెబ్ సిరీస్‌లో నటించనుంది. View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) చదవండి: శాస్త్రవేత్తపై దోశద్రోహి కేసు.. 50 రోజులు జైల్లో నరకం.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ -
మిస్ ఇండియా పోటీల్లో దూసుకెళ్తున్న శివాని రాజశేఖర్
Shivani Rajasekhar Has Top 8 Place In Miss India 2022: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొననున్నట్లు తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నేను కొత్త సాహసం చేస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ టు ది లవ్లీ లేడీస్' అంటూ రాసుకొచ్చింది. అలాగే శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టాప్ 8 ఫైనలిస్టులో ఉంది. తాను ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు ఇన్‌స్టాలో వెల్లడించింది. శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించగా.. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఈ ఫైనలిస్టులో ఉన్నారు. 2021లో తేజ సజ్జా నటించిన అద్భుతం చిత్రంతో శివాని రాజశేఖర్ వెండితెరకు పరిచయమైంది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
'మిస్ ఇండియా' పోటీకి ప్రముఖ హీరో కుమార్తె
ప్రముఖ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె, నటి శివాని 'ఫెమినా మిస్ ఇండియా 2022' పోటీలో పాల్గొనబోతోందని సమాచారం. ఈ మేరకు సోమవారం ఆడిషన్స్‌కు హాజరైనట్టు సోషల్ మీడియా ద్వారా శివాని తెలియజేసింది. దానికి సంబంధించి తన వంతుగా ఉత్తమ ప్రదర్శన కూడా ఇచ్చినట్టు తెలిపింది. దాంతో పాటు తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాని దానికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. ‘ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు సైతం ఆల్ ది బెస్ట్’ అని శివాని తెలిపింది. గత ఏడాది 'అద్భుతం' అనే చిత్రంతో శివాని నటిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇక తాజాగా 'శేఖర్' చిత్రంతో వెండితెరపై తండ్రి రాజశేఖర్‌తో కలిసి శివాని కనిపించనుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. -
రాజమౌళి సినిమాలో చేయాలని ఉంది: మానస వారణాసి
ఫెమినా మిస్ ఇండియా కిరీటంతో అందరి హృదయాలను గెలుచుకొని మిస్ వరల్డ్ కోసం అడుగులు వేస్తున్న తెలుగమ్మాయి మానస వారణాసి. నగరానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన మానస తనకంటూ ఉన్న కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు, ఇష్టాలను షేర్ చేసుకున్నారు. ► ముందుగా మీలో మీకు బాగా నచ్చే లక్షణం? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రశాంతంగా ఉంటేనే ఎదైనా సాధించగలం. ► మీలో నచ్చనిది..? లేజీనెస్...! చేయవలసిన పనులను ఎక్కు వగా వాయిదా వేస్తుంటాను. ► ఇష్టమైన ఫుడ్..? పూర్తిగా వెజిటేరియన్‌ని. వెజిటేరియన్లో ఎదైనా సరే ఇష్టంగా తింటాను. ముఖ్యంగా పులిహోరా నా ఫేవరెట్. ► నచ్చిన సినిమాలు..? తెలుగులో బాహుబలి, వేరే బాషల్లో అయితే ఇంటర్స్టెల్లర్. ► ఇష్టపడే ఫిల్మ్ స్టార్స్...? ఆయుష్ ఖురానా, ప్రియాంక చోప్రా. ► నచ్చిన కలర్..? ఫైర్ రెడ్. ► ఎలాంటి డ్రెస్సింగ్‌ని ఇష్టపడతారు...? ఇండియన్ వేర్. ► పెర్ఫ్యూమ్స్...? కొరియాండర్, లావెండర్ ఫ్లేవర్స్.. ► నచ్చే పుస్తకం..? లిటిల్ ప్రిన్స్ ► ఎలాంటి గేమ్స్ ఇష్టం..? మెదడుకు పనిపెట్టేవి. ► నచ్చిన ప్లేస్? ఎవ్వరినైనా ఆహ్వానించే సుగుణం ఉన్న హైదరాబాద్ నగరం. ► ఇష్టమైన వాహనం? కంఫర్ట్‌గా ఉండే ఏ కారైనా ఇష్టమే. ► ఇష్టమైన పనులు...? సేవ చేయడం. ఆల్రెడీ కొన్ని ఎన్జీవోలతో కలిసి వాలంటీర్‌గా పని చేసాను. ► మోడలింగ్‌లోకి రాకుండా ఉంటే..? యోగా ట్రైనర్‌ని అయ్యేదానిని. ► హబీస్...? పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. పాటలు కూడా పాడతాను. ► ఫిట్‌నెస్‌కు సంబంధించిని నియమాలు? రెండేళ్లుగా క్రమం తప్పకుండా యెగా చేస్తున్నాను. కానీ డైట్ మాత్రం పాటించను. మా అమ్మమ్మ చేసిన వంటకాలేవీ వదలను. ► మీ సక్సెస్ మంత్ర? ఎమోషనల్‌గా, స్ప్రిచ్యువల్గా బ్యాలెన్స్డ్ గా ఉంటాను. అప్పుడే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతాను. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను. ప్రతి పనిలో గతం కంటే ఉన్నతంగా ఉండేలా కష్టపడుతాను. గోల్స్ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అప్పుడే మనం చేసే పనులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఐ లవ్ చాలెంజెస్. ► సినిమాల్లో అవకాకాశాలు వస్తే ..? ప్రస్తుతం నా ధ్యాస అంతా మిస్ వరల్డ్ పైనే. రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని ఉంది. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి, హైదరాబాద్ ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్‌గా తెలుగమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ‘పుట్టుకతో వచ్చినది కాదు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడంలో అందం ప్రతిఫలిస్తుంది’ అని నిరూపిస్తోంది మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మానస విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో గెలిచి తన సత్తా చాటింది. ఇప్పుడీ తెలుగు అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ముంబయ్ హయ్యత్ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 వేడుకలో తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానం లో నిలిచి అందాల కిరీటం గెలుచుకోగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన మనికా షియోకండ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. 23 ఏళ్ల మానస హైదరాబాద్‌లోని గ్లోబల్ ఇండియన్ లో స్కూల్ చదువు, వాసవి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. నిత్య సాధనం... నిత్య వినూత్నం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మానస తన ప్రాక్టీస్‌ను నిత్యం కొనసాగిస్తూ, ఆ అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది. ‘సాధన చేస్తూ ఉంటే జీవితం ఏం ఇస్తుందో ఎవరూ చెప్పరు. రాయడం, చిత్రలేఖనం, పరిగెత్తడం, పాడటం వంటివి మాత్రమే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా సాధన చేయాలి. మంచి ఫ్రెండ్‌గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి. ప్రజలు దానిని గుర్తించేంత వరకు సాధన ఆపకూడదు. అవసరమైన చోట కోపం చూపడం, అవసరమైన వారికి దయను ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మనల్ని శక్తింతులను చేసేవే, ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను’ అని చెప్పారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కళల కసరత్తు ఇంజినీరింగ్ చదువు పూర్తి కాగానే మానస ఎఫ్‌బిబి–ఇండియా ఫ్యాషన్ హబ్ కలర్స్ టివి ఫెమినా మిస్ ఇండియా 2019 తెలంగాణ ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలుపొందిన ఈ అందాల రాశి కసరత్తులు చేయడంతో పాటు రాయడం, చదవడం, సంగీతం, యోగా, భరతనాట్యంలోనూ రాణిస్తోంది. కొత్తవాటిని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎన్నింటినో నేర్పుతుంది. మనల్ని బలవంతుల్ని చేస్తుంది అని నమ్ముతుంది. ఎప్పుడూ ఓ కొత్త కళను సాధన చేయడంలో బిజీగా ఉండే మానస ‘నా చిన్నతనంలో చాలా సిగ్గుగా, నలుగురిలోకి వెళ్లాలన్నా భయంగా ఉండేదాన్ని. టీనేజ్‌లో ఏదో తెలియని ఒక ఆరాటం, ఎప్పుడూ నాకు సౌకర్యంగా అనిపించిన ప్లేస్లోనే ఉండిపోవడానికి ప్రయత్నించేదాన్ని. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కాస్త పెద్దయ్యాక ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మెరుగుపరుచుకోవడం మొదలయ్యింది. ఇప్పటికీ ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాను. దీనివల్ల ప్రతియేటా నన్ను మరింత శక్తిమంతురాలిగా ఈ లోకం ముందు నిలబెడుతుంది’ అంటూ తన ఆలోచనలు పంచుకుంటారు ఆమె. ఈ అందాల రాశి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి, పిల్లలకు విద్యాబోధన కూడా చేసింది. పిల్లలతో ఉండడం వల్ల, వారి చిరునవ్వుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఎంతో సంతోషాన్ని పంచుకోవచ్చని అంటుంది మానస. కళలపై ఉన్న అభిరుచి, సాధన ఈ రోజు ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టాయి. మానస వారణాసి మరిన్ని విజయశిఖరాలను అధిరోహించాలని తెలుగువారి అభిలాష, అకాంక్ష. -
అందం ఒక్కటే సరిపోదు..
జూబ్లీహిల్స్: ఫెమినా మిస్ ఇండియా–2018 రన్నరప్ శ్రేయారావు కామవరపు బుధవారం నగరంలో సందడి చేసింది. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మీడియాతో తన విజయాన్ని పంచుకున్నారు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహించి తుది వడపోతలో 30 మందిని ఎంపిక చేసారన్నారు. దక్షిణాది నుంచి తనతో పాటు 15 మంది ఎంపికయ్యారన్నారు. మెంటార్‌గా రకుల్‌ప్రీత్.. అందాల పోటీల్లో కేవలం అందం ఒక్కదానితోనే నెగ్గుకు రాలేమని, ఆత్మవిశ్వాసం, అంతః సౌందర్యం చాలా ముఖ్యమన్నారు. దక్షిణాది నుంచి పోటీపడ్డ అమ్మాయిలకు ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సింగ్ మెంటార్‌గా వ్యహరించి విలువైన సలహాలు, సూచనలు అందించారన్నారు. ఇక సినిమాలు, మోడలింగ్.. తాను ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాని, ఉన్నతవిద్యకు లండన్ వెళ్లే ఆలోచనలో ఉండగా అనుకోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అందాల పోటీల్లో పాల్గొని, ఇప్పుడు ఫెమినా మిస్ ఇండియా రన్నరప్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. సినిమాలు, మోడలింగ్ రంగాల్లో నిలదొక్కుకోవడం కష్టమైనా మంచి అవకాశాలు వస్తే తప్పక ప్రయత్నిస్తానన్నారు. తాను ఎప్పుడూ జిమ్‌కు వెళ్లలేదని, పోటీలు ప్రారంభమైన తర్వాతే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకున్నానన్నారు. -
కలర్పుల్గా ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్
-
ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్
-
బిలీవ్ యువర్సెల్ఫ్
సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలు పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలని బాలీవుడ్ నటి (ద ఎక్స్పోజ్ ఫేం), మాజీ మిస్ ఇండియా జోయా అఫ్రోజ్ సూచిస్తోంది. నగరానికి చెందిన మార్వెల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ సాఫ్ట్ ఎన్ షైన్ అందాల పోటీని గురువారం ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో తన మనోభావాలను పంచుకుంది... టాలీవుడ్‌లోని కొన్ని సంఘటనల నేపథ్యంలో హీరోయిన్లు కాల్‌గాళ్స్ అవుతున్నారని నన్ను అడిగితే దానికి నేనేం చెప్పగలను? నాకు తెలిసినంతవరకూ సినీ రంగంలోని అమ్మాయిలకు ‘ఆ’ దారి తప్ప మరో దారి లేని పరిస్థితి ఎప్పుడూ రాదు. నేనైతే డబ్బు కోసం నటించడం లేదు. చిన్నప్పటి నుంచి నటించిన అనుభవం, ఇష్టం మాత్రమే నన్ను నటిగా మార్చాయి. సినిమాలు లేకపోయినా హాయిగా బతకగలిగినంత స్థితిమంతులైన కుటుంబం మాది. అవ్మూరుులకు నేనిచ్చే సలహా ఒకటే. తమని తాము నమ్మాలి. భయం వదలాలి. ఏ రంగంలోనైనా స్ట్రగుల్ తప్పదు. బ్యూటీ కాంటెస్ట్‌లోకి వచ్చే అమ్మాయిలకు మరింత ఆత్మవిశ్వాసం అవసరం. ఎలాంటి పరిస్థితిలోనైనా చిరునవ్వు చెదరకుండా ఉండడం నేర్చుకోవాలి. ‘ఐటమ్’ అనొద్దు... టాలీవుడ్లో మంచి ఆఫర్ వస్తే నటించడానికి సిద్ధం. హీరో మహేష్‌బాబుతో పాటు నచ్చే హీరోలెందరో ఇక్కడ ఉన్నారు. ఐటమ్‌సాంగ్ చేయడానికి నో అబ్జెక్షన్. అయినా దాన్ని ఐటమ్ అని ఎందుకంటారో అర్థం కాదు. దాన్ని ఒక మంచి డ్యాన్స్ నంబర్ అనొచ్చుగా. - ఎస్బీ