
ప్రముఖ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె, నటి శివాని 'ఫెమినా మిస్ ఇండియా 2022' పోటీలో పాల్గొనబోతోందని సమాచారం. ఈ మేరకు సోమవారం ఆడిషన్స్‌కు హాజరైనట్టు సోషల్ మీడియా ద్వారా శివాని తెలియజేసింది. దానికి సంబంధించి తన వంతుగా ఉత్తమ ప్రదర్శన కూడా ఇచ్చినట్టు తెలిపింది. దాంతో పాటు తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాని దానికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది.
‘ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు సైతం ఆల్ ది బెస్ట్’ అని శివాని తెలిపింది. గత ఏడాది 'అద్భుతం' అనే చిత్రంతో శివాని నటిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇక తాజాగా 'శేఖర్' చిత్రంతో వెండితెరపై తండ్రి రాజశేఖర్‌తో కలిసి శివాని కనిపించనుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.