miss india competitions
-
Sruthi Chakravarthi Photos: హైదరాబాద్‌కు మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్.. శ్రుతి చక్రవర్తికి ఘన స్వాగతం (ఫొటోలు)
-
'మిస్ ఇండియా' పోటీకి ప్రముఖ హీరో కుమార్తె
ప్రముఖ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె, నటి శివాని 'ఫెమినా మిస్ ఇండియా 2022' పోటీలో పాల్గొనబోతోందని సమాచారం. ఈ మేరకు సోమవారం ఆడిషన్స్‌కు హాజరైనట్టు సోషల్ మీడియా ద్వారా శివాని తెలియజేసింది. దానికి సంబంధించి తన వంతుగా ఉత్తమ ప్రదర్శన కూడా ఇచ్చినట్టు తెలిపింది. దాంతో పాటు తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాని దానికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. ‘ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు సైతం ఆల్ ది బెస్ట్’ అని శివాని తెలిపింది. గత ఏడాది 'అద్భుతం' అనే చిత్రంతో శివాని నటిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇక తాజాగా 'శేఖర్' చిత్రంతో వెండితెరపై తండ్రి రాజశేఖర్‌తో కలిసి శివాని కనిపించనుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. -
‘గ్లామన్’ మిసెస్ ఇండియా విజేత సమైరా
హైదరాబాద్: గోవాలో ఈ నెల 2న జరిగిన గ్లామన్ మిస్ అండ్ మిసెస్ ఇండియా (ప్లస్ సైజ్) పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సమైరా మిసెస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ప్లస్ సైజ్ కేటగిరిలో ఆమె ఈ టైటిల్ గెలుచుకున్న అనంతరం శనివారం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ప్లస్ ఈజ్ బ్యూటిఫుల్ థీమ్‌తో జరిగిన పోటీల్లో తాను ఈ కిరీటాన్ని గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ జర్నీలో తనను ఎంతో మంది ప్రోత్సహించి మద్దతు తెలిపారన్నారు. ఫిట్నెస్, డ్యాన్స్, డైట్, యాక్టింగ్, డిజైనింగ్ అన్నింటిపైనా దృష్టి పెట్టానన్నారు. నేషనల్ క్యాస్టూమ్ రౌండ్లో తాను చార్మినార్ డిజైన్‌తో తయారు చేసిన డ్రెస్‌ను ప్రదర్శించానని తనకు మంచి మార్కులు రావడానికి ఇది ఒక కారణం అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ మీద చాలా దృష్టి పెట్టానని అదే తనను ఈ టైటిల్ వరకు తీసుకొచ్చిందన్నారు. -
‘ఏది ముందు కోడా.. గుడ్డా?’ నమ్రత ఆన్సర్
మాజీ మిస్ ఇండియా, హీరోయిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఆసక్తికర అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు నమ్రత. తాజాగా మరో వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు నమ్రత. 1993 మిస్ ఇండియా కార్యక్రమం ఫైనల్ రౌండ్‌కు సంబంధించిన వీడియో ఇది. దీనిలో నమ్రతతో పాటు పూజా భట్రా కూడా ఉన్నారు. ఈ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటు మిస్ ఇండియాగా గెలిచిన నమ్రతకు కిరీటం తొడిగే సన్నివేశం కూడా ఉంది. (అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్) ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నమ్రత.. ‘క్వశ్చన్ అండ ఆన్సర్ రౌండ్లో మా ముగ్గురిని వందల ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్న ఓ చిక్కు ప్రశ్న అడిగారు. దీనికి నేను నా సమాధానం చెప్పాను. మరి మీ సమాధానం ఏంటి. ప్రశ్న ఏంటంటే ‘ఏది ముందు వస్తుంది కోడా.. గుడ్డా?’. నా సమాధానం ఏంటంటే.. ‘కోడి లేకపోతే గుడ్డు లేదు. కనుక కోడే ముందు’. మరి మీ సమాధానం ఏంటి’ అంటూ అభిమానులను ప్రశ్నించారు నమ్రత. (వైరల్: సితార డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా) View this post on Instagram the excitement, the butterflies, the craziness of it all... its all about that moment 😍😍😍 One life is all we've got. Go on and make it worthwhile.. Dream big!! The one thing that you have that nobody else does is YOU'. This has always been my mantra!! For all the girls who dream ❤️❤️ make it happen... nothing is impossible!! Was asked a tricky question that dates back centuries!! This was my answer... What would yours be? 😁😁 #tbt #throwbackthursday #memoriesbringbackyou❤️ A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Aug 12, 2020 at 10:05pm PDT అంతేకాక ‘ఆ క్షణం నాలో ఎన్నో భావాలు.. ఉత్సాహం, ఆనందం, ఉన్మాదం.. సీతాకోకచిలుకలా ఎగురుతున్న భావన. ఇవన్నీ ఆ ఒక్క క్షణం కోసమే. ఒక్క జీవితంలో మనం అన్ని పొందవచచ్చు. ముందుకు సాగండి.. జీవితాన్ని విలువైనదిగా చేసుకోండి. పెద్ద కలలు కనండి. మీరు మాత్రమే సాధించగల విజయం ఇది. నేను ప్రతిక్షణం దీన్నే నమ్ముతాను. పెద్దపెద్ద కలలు కనే అమమ్మాయిలందరికి ఒక్కటే చెప్తాను.. ఏది అసాధ్యం కాదు’ అంటూ వీడియోను షేర్ చేశారు నమ్రత. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. -
మిస్ ఇండియా 2019గా సుమన్ రావు
సాక్షి, ముంబయి : ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్‌రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్, సెకండ్ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. ఇక మిస్ ఇండియా యునైటడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గత ఏడాది సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు... ఈ ఏడాది తన కిరీటాన్ని సంజనా విజ్‌కి బహుకరించింది. ఈ సందర్భంగా కిరీటం సొంతం చేసుకున్న సుమన్ రావు మాట్లాడుతూ ‘జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే , దాన్ని సాధించడానికి శరీరంలోని అణువణువూ మనకు సహకరిస్తూ విజయం వైపు అడుగులు వేయడానికి దోహదపడుతుందని’ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, నటీ నటులు హిమాఖురేషీ, చిత్రాంగధసింగ్, ఫ్యాషన్ నిపుణుడు ఫాల్గుణి పికోకా, భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కరణ్‌జోహర్, నటుడు మనీష్‌పాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, బాలీవుడ్ నటీనటులు కత్రినాకైఫ్, విక్కీకౌషల్, మౌనీరాయ్ తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. -
అందాల రాణి
జ్యోతినగర్, న్యూస్‌లైన్: మణప్పురం గోల్డ్‌లోన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత మిస్ ఇండియా పోటీలు కోయంబత్తూర్‌లో జరిగాయి. అందం, మేధాశక్తి, ఆన్లైన్ ఓటింగ్ ఆధారంగా జరిగిన ఈ పోటీల ఫలితాలను శనివారం రాత్రి వెల్లడయ్యాయి. 16 మంది యువతులతో పోటీపడిన రశ్మీ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ సాధించి, ఫెమినా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే.. రశ్మీ ఠాకూర్ ఆదివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ‘అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే పోటీల్లో పాల్గొన్నానను. మిస్ ఇండియా టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. గతంలో నిర్వహించిన అందాల పోటీల్లో బికినీలు ధరించే అంశం ఉండడంతో ఈ ప్రాంతంలోని అమ్మాయిలు వెళ్లలేకపోయారు. ప్రస్తుతం జరిగిన అందాల పోటీల్లో బికినీ అంశం తొలగించడంతో పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. నిర్వాహకులు సంస్కృతీ సంప్రదాయాలకు అనుణంగా పోటీలను నిర్వహించడం ఏర్పాటు చేయడంహర్షిందగిన విషయం. పోటీలు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగాయి. టైటిల్ సాధించిన ఆ క్షణాల్లో ఆనందభాష్పాలు రాలాయి’ అని వివరించింది. ఫ్యాషన్ డిజైనర్, మోడల్.. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో వ్యాపారం నిర్వహించే భగత్‌సింగ్-ప్రసన్నలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రశ్మీ ఠాకూర్. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా పూర్తి చేసి, పలు అడ్వర్టయిజ్మెంట్లలో మోడల్‌గా వ్యవహరించింది.