‘ఏది ముందు కోడా.. గుడ్డా?’ నమ్రత ఆన్సర్‌ | Namrata Shirodkar Shares Her Answer To The Tricky Question | Sakshi
Sakshi News home page

రేర్‌ వీడియోతో అభిమానులను ఖుషి చేసిన నమ్రత

Published Thu, Aug 13 2020 4:56 PM | Last Updated on Thu, Aug 13 2020 8:44 PM

Namrata Shirodkar Shares Her Answer To The Tricky Question - Sakshi

మాజీ మిస్‌ ఇండియా, హీరోయిన్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఆసక్తికర అంశాల గురించి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు నమ్రత. తాజాగా మరో వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు నమ్రత. 1993 మిస్‌ ఇండియా కార్యక్రమం ఫైనల్‌ రౌండ్‌కు సంబంధించిన వీడియో ఇది. దీనిలో నమ్రతతో పాటు పూజా భట్రా కూడా ఉన్నారు. ఈ వీడియోలో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌తో పాటు మిస్‌ ఇండియాగా గెలిచిన నమ్రతకు కిరీటం తొడిగే సన్నివేశం కూడా ఉంది. (అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్‌)

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నమ్రత.. ‘క్వశ్చన్‌ అండ​ ఆన్సర్‌ రౌండ్‌లో మా ముగ్గురిని వందల ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్న ఓ చిక్కు ప్రశ్న అడిగారు. దీనికి నేను నా సమాధానం చెప్పాను. మరి మీ సమాధానం ఏంటి. ప్రశ్న ఏంటంటే  ‘ఏది ముందు వస్తుంది కోడా.. గుడ్డా?’. నా సమాధానం ఏంటంటే.. ‘కోడి లేకపోతే గుడ్డు లేదు. కనుక కోడే ముందు’. మరి మీ సమాధానం ఏంటి’ అంటూ అభిమానులను ప్రశ్నించారు నమ్రత. (వైరల్‌: సితార డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా)

అంతేకాక ‘ఆ క్షణం నాలో ఎన్నో భావాలు.. ఉత్సాహం, ఆనందం, ఉన్మాదం.. సీతాకోకచిలుకలా ఎగురుతున్న భావన. ఇవన్నీ ఆ ఒక్క క్షణం కోసమే. ఒక్క జీవితంలో మనం అన్ని పొందవచచ్చు. ముందుకు సాగండి.. జీవితాన్ని విలువైనదిగా చేసుకోండి. పెద్ద కలలు కనండి. మీరు మాత్రమే సాధించగల విజయం ఇది. నేను ప్రతిక్షణం దీన్నే నమ్ముతాను. పెద్దపెద్ద కలలు కనే అమమ్మాయిలందరికి ఒక్కటే చెప్తాను.. ఏది అసాధ్యం కాదు’ అంటూ వీడియోను షేర్‌ చేశారు నమ్రత. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement