జ్యోతినగర్, న్యూస్‌లైన్: మణప్పురం గోల్డ్‌లోన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత మిస్ ఇండియా పోటీలు కోయంబత్తూర్‌లో జరిగాయి. అందం, మేధాశక్తి, ఆన్‌లైన్ ఓటింగ్ ఆధారంగా జరిగిన ఈ పోటీల ఫలితాలను శనివారం రాత్రి వెల్లడయ్యాయి. 16 మంది యువతులతో పోటీపడిన రశ్మీ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ సాధించి, ఫెమినా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..
రశ్మీ ఠాకూర్ ఆదివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ‘అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే పోటీల్లో పాల్గొన్నానను. మిస్ ఇండియా టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. గతంలో నిర్వహించిన అందాల పోటీల్లో బికినీలు ధరించే అంశం ఉండడంతో ఈ ప్రాంతంలోని అమ్మాయిలు వెళ్లలేకపోయారు. ప్రస్తుతం జరిగిన అందాల పోటీల్లో బికినీ అంశం తొలగించడంతో పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. నిర్వాహకులు సంస్కృతీ సంప్రదాయాలకు అనుణంగా పోటీలను నిర్వహించడం ఏర్పాటు చేయడంహర్షిందగిన విషయం. పోటీలు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగాయి. టైటిల్ సాధించిన ఆ క్షణాల్లో ఆనందభాష్పాలు రాలాయి’ అని వివరించింది.
ఫ్యాషన్ డిజైనర్, మోడల్..
ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లో వ్యాపారం నిర్వహించే భగత్‌సింగ్-ప్రసన్నలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రశ్మీ ఠాకూర్. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా పూర్తి చేసి, పలు అడ్వర్టయిజ్‌మెంట్‌లలో మోడల్‌గా వ్యవహరించింది.
అందాల రాణి
Published Mon, Jan 20 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement