jyothi nagar
-
అనుమానంతో హతమార్చాడు
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): మూడు ముళ్లు..ఏడడుగులు వేసి కడదాకా తోడుంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన ఓ భర్త..అనుమానంతో కట్టుకున్న భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ పీకే రామయ్యకాలనీలో లావుడ్య రాములు ఆటో నడుపుకుంటూ భార్య రమాదేవి(30), కూతురు అనూషతో కలిసి జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆమెను అనుమానిస్తూ శారీరకంగా హింసకు గురి చేస్తున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాములు భార్యతో గొడవపడి ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై కొట్టి గాయపరిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడటంతో పక్కనున్నవారు వచ్చి చూడగా గాయపడి ఉంది. దీంతో రాములు అక్క గాయపడిన రమాదేవి తలకు గుడ్డ ముక్కను అదిమిపట్టి గోదావరిఖనిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి సోదరుడు దేదావత్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని రామగుండం సీఐ స్వామి, ఎస్సై సందర్శించి విచారణ చేపట్టారు. -
ఎన్టీపీసీ సమీపంలో దారి దోపిడీ
జ్యోతినగర్ : కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు సమీపంలో రాజీవ్ రహదారిపై ఆగంతకులు ఓ వ్యక్తి నుంచి నగదు, గొలుసు దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం రామగుండం పట్టణానికి చెందిన పాత లక్ష్మయ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి అతన్ని ఆపారు. తమ వద్ద పర్సు దొంగిలించుకొస్తున్నావంటూ అడ్డగించి లక్ష్మయ్య దగ్గరున్న రూ.21వేల నగదు, మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. -
ఎన్టీపీసీ ఐదో యూనిట్లో అంతరాయం
జ్యోతినగర్ (కరీంనగర్) : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్లో సాంకేతిక సమస్యలతో మంగళవారం సాయంత్రం ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదో యూనిట్లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవటంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం 2100 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. -
ఓటర్లకు ప్రలోభాలు
పోల్‌చిట్టీలు పంచిన ఎమ్మెల్యే తనయుడు కనుసైగతో ఓటు అభ్యర్థన జ్యోతినగర్, న్యూస్‌లైన్ : తలరాతలు మార్చే ఓటరు దేవుళ్ల జాబితాను నేతలు ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసుకొని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తనయుడు అరుణ్‌కుమార్ ఆదివారం తన ల్యాప్‌టాప్‌లోని ఓటర్ల జాబితా ఆధారంగా పోల్‌చిట్టీలు పంచారు. పనిలో పనిగా ఓటర్లకు కనుసైగ చేస్తూ తమ అభ్యర్థినే గెలిపించాలని ప్రలోభాలకు గురిచేశారు. నగరపాలక ఎన్నికల్లో 46వ డివిజన్ నుంచి ఎమ్మెల్యే కోడలు కార్పొరేటర్‌గా బరిలో ఉన్నారు. ఆమె గెలుపు కోసం అరుణ్‌కుమార్ తన అనుచరులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గౌతమినగర్ సెంటర్లో పోల్‌చిట్టీలు పంచుతూ ఓటు అభ్యర్థించారు. కాగా ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న వాహనంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. -
అందాల రాణి
జ్యోతినగర్, న్యూస్‌లైన్: మణప్పురం గోల్డ్‌లోన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత మిస్ ఇండియా పోటీలు కోయంబత్తూర్‌లో జరిగాయి. అందం, మేధాశక్తి, ఆన్లైన్ ఓటింగ్ ఆధారంగా జరిగిన ఈ పోటీల ఫలితాలను శనివారం రాత్రి వెల్లడయ్యాయి. 16 మంది యువతులతో పోటీపడిన రశ్మీ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ సాధించి, ఫెమినా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే.. రశ్మీ ఠాకూర్ ఆదివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ‘అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే పోటీల్లో పాల్గొన్నానను. మిస్ ఇండియా టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. గతంలో నిర్వహించిన అందాల పోటీల్లో బికినీలు ధరించే అంశం ఉండడంతో ఈ ప్రాంతంలోని అమ్మాయిలు వెళ్లలేకపోయారు. ప్రస్తుతం జరిగిన అందాల పోటీల్లో బికినీ అంశం తొలగించడంతో పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. నిర్వాహకులు సంస్కృతీ సంప్రదాయాలకు అనుణంగా పోటీలను నిర్వహించడం ఏర్పాటు చేయడంహర్షిందగిన విషయం. పోటీలు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగాయి. టైటిల్ సాధించిన ఆ క్షణాల్లో ఆనందభాష్పాలు రాలాయి’ అని వివరించింది. ఫ్యాషన్ డిజైనర్, మోడల్.. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో వ్యాపారం నిర్వహించే భగత్‌సింగ్-ప్రసన్నలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రశ్మీ ఠాకూర్. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా పూర్తి చేసి, పలు అడ్వర్టయిజ్మెంట్లలో మోడల్‌గా వ్యవహరించింది.