ఓటర్లకు ప్రలోభాలు | voter list in loptop | Sakshi
Sakshi News home page

ఓటర్లకు ప్రలోభాలు

Published Mon, Mar 31 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

voter list in loptop

 పోల్‌చిట్టీలు పంచిన ఎమ్మెల్యే తనయుడు  కనుసైగతో ఓటు అభ్యర్థన
 
 జ్యోతినగర్, న్యూస్‌లైన్ : తలరాతలు మార్చే ఓటరు దేవుళ్ల జాబితాను నేతలు ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసుకొని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తనయుడు అరుణ్‌కుమార్ ఆదివారం తన ల్యాప్‌టాప్‌లోని ఓటర్ల జాబితా ఆధారంగా పోల్‌చిట్టీలు పంచారు.

 

పనిలో పనిగా ఓటర్లకు కనుసైగ చేస్తూ తమ అభ్యర్థినే గెలిపించాలని ప్రలోభాలకు గురిచేశారు. నగరపాలక ఎన్నికల్లో 46వ డివిజన్ నుంచి ఎమ్మెల్యే కోడలు కార్పొరేటర్‌గా బరిలో ఉన్నారు. ఆమె గెలుపు కోసం అరుణ్‌కుమార్ తన అనుచరులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గౌతమినగర్ సెంటర్‌లో పోల్‌చిట్టీలు పంచుతూ ఓటు అభ్యర్థించారు. కాగా ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న వాహనంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement