
టైటిల్ సాధించిన సమైరా
హైదరాబాద్: గోవాలో ఈ నెల 2న జరిగిన గ్లామన్ మిస్ అండ్ మిసెస్ ఇండియా (ప్లస్ సైజ్) పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సమైరా మిసెస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ప్లస్ సైజ్ కేటగిరిలో ఆమె ఈ టైటిల్ గెలుచుకున్న అనంతరం శనివారం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ప్లస్ ఈజ్ బ్యూటిఫుల్ థీమ్‌తో జరిగిన పోటీల్లో తాను ఈ కిరీటాన్ని గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ జర్నీలో తనను ఎంతో మంది ప్రోత్సహించి మద్దతు తెలిపారన్నారు. ఫిట్‌నెస్, డ్యాన్స్, డైట్, యాక్టింగ్, డిజైనింగ్ అన్నింటిపైనా దృష్టి పెట్టానన్నారు. నేషనల్ క్యాస్టూమ్ రౌండ్‌లో తాను చార్మినార్ డిజైన్‌తో తయారు చేసిన డ్రెస్‌ను ప్రదర్శించానని తనకు మంచి మార్కులు రావడానికి ఇది ఒక కారణం అన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ మీద చాలా దృష్టి పెట్టానని అదే తనను ఈ టైటిల్ వరకు తీసుకొచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment