Syed Mushtaq Ali T20: Tilak Varma-Ravi Teja Shines Hyd Beat Goa 37 Runs, Score Details Inside - Sakshi
Sakshi News home page

Syed Mushtaq Ali T20: అదరగొట్టిన తిలక్‌ వర్మ.. హైదరాబాద్‌కు మరో విజయం

Published Sat, Oct 15 2022 7:11 AM | Last Updated on Sat, Oct 15 2022 10:54 AM

Syed Mushtaq Ali T20: Tilak Varma-Ravi Teja Shines HYD-Beat-Goa 37 Runs - Sakshi

జైపూర్‌: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ రెండో విజయం నమోదు చేసింది. గోవా జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 37 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు.

కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించాడు. గోవా తరఫున ఆడుతున్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అనంతరం గోవా 18.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్‌ బౌలర్లు టి.రవితేజ 20 పరుగులిచ్చి 4 వికెట్లు.. అనికేత్‌ రెడ్డి 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి గోవా జట్టును దెబ్బ తీశారు. 

చదవండి: సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement