
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పాండిచ్చేరితో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (41 బంతుల్లో 57; 1 ఫోర్, 4 సిక్స్‌లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. మికిల్ జైస్వాల్ (25 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా రాణించాడు.
కాగా తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం తన అర్థసెంచరీతో జట్టుకు విజయం అందించేదాకా వదల్లేదు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 20 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ తరఫున భగత్ వర్మ, తిలక్ వర్మ, సీవీ మిలింద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు ఇండోర్‌లో ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment