గుంతకల్లు టౌన్: గోవా నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అనంతపురం జిల్లా గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.65 వేల విలువజేసే 12.890 గ్రాముల ‘మేథాంపేటామైన్’ అనే నిషేధిత డ్రగ్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన ఎరెల్లి దయాకర్, మలికపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రాసిబట్టుల వివేక్ హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.
ఈ క్రమంలోనే వీరిరువురు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైన స్నేహితులకు డ్రగ్స్ గురించి తెలియజేయగా, తమకు కూడా తెచ్చివ్వాలని వారు కోరడంతో గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి సోమవారం సాయంత్రం గుంతకల్లుకు చేరుకున్నారు. అయితే రాత్రి వరకు హైదరాబాద్‌కు రైలు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా ఏదైనా వాహనంలో వెళ్లేందుకు ఇద్దరు యువకులూ స్థానిక బీరప్పగుడి సర్కిల్‌లో వేచి ఉన్నారు.
అందిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు యువకుల్నీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయ్యింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్ ఒక్కో గ్రాము రూ.5 వేల ధర పలుకుతుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment