సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేయగా, పక్కా సమాచారంతో చందానగర్ పోలీసులు దాడులు చేశారు. రూ.18 లక్షలు విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
అయితే, ఈ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్రగ్ పెడ్లర్ కృష్ణరామ్‌ను పోలీసులకు ఓ డాక్టర్ పట్టించారు. కృష్ణరామ్ ఆహ్వానించడంతో పార్టీకి వెళ్లిన వైద్యుడు.. కృష్ణరామ్ బ్యాగ్‌లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. కృష్ణరామ్ అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.
గత రెండు రోజుల క్రితం ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా దాచిపెట్టి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ విభాగం బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో ఉన్న జీవీ సలూజా హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్స్ డ్రగ్స్‌తో పాటు మత్తు కలిగించే మందులను గుర్తించారు.
ఇటీవల వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: మయోనైజ్‌పై నిషేధం
Comments
Please login to add a commentAdd a comment