జూబ్లీహిల్స్: ఫెమినా మిస్ ఇండియా–2018 రన్నరప్ శ్రేయారావు కామవరపు బుధవారం నగరంలో సందడి చేసింది. ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మీడియాతో తన విజయాన్ని పంచుకున్నారు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహించి తుది వడపోతలో 30 మందిని ఎంపిక చేసారన్నారు. దక్షిణాది నుంచి తనతో పాటు 15 మంది ఎంపికయ్యారన్నారు.
మెంటార్‌గా రకుల్‌ప్రీత్..
అందాల పోటీల్లో కేవలం అందం ఒక్కదానితోనే నెగ్గుకు రాలేమని, ఆత్మవిశ్వాసం, అంతః సౌందర్యం చాలా ముఖ్యమన్నారు. దక్షిణాది నుంచి పోటీపడ్డ అమ్మాయిలకు ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సింగ్ మెంటార్‌గా వ్యహరించి విలువైన సలహాలు, సూచనలు అందించారన్నారు.
ఇక సినిమాలు, మోడలింగ్..
తాను ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాని, ఉన్నతవిద్యకు లండన్ వెళ్లే ఆలోచనలో ఉండగా అనుకోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అందాల పోటీల్లో పాల్గొని, ఇప్పుడు ఫెమినా మిస్ ఇండియా రన్నరప్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. సినిమాలు, మోడలింగ్ రంగాల్లో నిలదొక్కుకోవడం కష్టమైనా మంచి అవకాశాలు వస్తే తప్పక ప్రయత్నిస్తానన్నారు. తాను ఎప్పుడూ జిమ్‌కు వెళ్లలేదని, పోటీలు ప్రారంభమైన తర్వాతే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment